హోమ్ /వార్తలు /తెలంగాణ /

Jagtial: వండర్ కిడ్.. రెండేళ్లకే అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ.. బుజ్జిబుజ్జి మాటలతో అద్భుతాలు

Jagtial: వండర్ కిడ్.. రెండేళ్లకే అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ.. బుజ్జిబుజ్జి మాటలతో అద్భుతాలు

వండర్ కిడ్ అధృతి

వండర్ కిడ్ అధృతి

Wonder Kid: ఈ చిన్నారిలో ఓ అద్భుతమైన ట్యాలెంట్ ఉంది. ఏ విషయాన్నైనా ఇట్టే గ్రహిస్తుంది. చెప్పిన దానిని బాగా గుర్తు పెట్టుకుట్టుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

సాధారణంగా రెండేళ్ల పిల్లలు ఏం చేస్తారు..? బుజ్జిబుజ్జి మాటలు చెబుతారు. బొమ్మలతో ఆడుకుంటారు. ఇంట్లో అల్లరి చేస్తుంటారు. వచ్చీరానీ మాటలతో.. అది కావాలి..ఇది కావాలని మారాం చేస్తుంటారు. కానీ ఓ చిన్నారి మాాత్రం..మిగతా పిల్లలకు సాధ్యం కాని అద్భుతాలను చేస్తోంది. ఏకంగా వండర్ బుక్‌ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది. ముద్దు ముద్దు మాటలు నేర్చుకునే.. లేలేత ప్రాయంలోనే.. అద్భుత జ్ఞాపకశక్తితో అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభను చాటుకుంది. పాప వయసు రెండేళ్లే కానీ.. జ్ఞాపక శక్తి మాత్రం అమోఘం..! అంత చిన్న వయసులోనే ఎన్నో అంశాలను గుర్తుపెట్టుకుంది. అడిగనప్పుడు చకచకా చెబుతుంది. పిట్ట కొంచెం కూత ఘనమంటే ఇదే..!

' isDesktop="true" id="1467536" youtubeid="oUrGUy3jgKY" category="telangana">

జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం గుల్లకోటకు చెందిన దావుల రాజకుమార్, సౌమ్య దంపతులకు ఓ కూతురు ఉంది. ఆ చిన్నారి పేరు అధృతి. వయసు 2 సంవత్సరాల 3 నెలలు. సాధారణంగా ఈ వయసులో ఉండే పిల్లలకు అమ్మా నాన్నలు తప్ప వేరే లోకమే తెలియదు. అధృతి కూడా ఇప్పుడిప్పుడే మాటలు నేర్చుకుంటుంది. ఐతే ఈ చిన్నారిలో ఓ అద్భుతమైన ట్యాలెంట్ ఉంది. ఏ విషయాన్నైనా ఇట్టే గ్రహిస్తుంది. చెప్పిన దానిని బాగా గుర్తు పెట్టుకుట్టుంది. ఇంత చిన్న వయసులో అంత జ్ఞాపక శక్తి ఉందా అని తల్లిదండ్రులే షాక్ అయ్యే వారు. తమ కూతురిలో అసాధారణమైన జ్ఞాపకశక్తిని గుర్తించిన తల్లిదండ్రులు చిరుప్రాయంలోనే ఆమెను ప్రోత్సహించారు. అవయవాలు, జంతవులు, కూరగాయలు, పండ్లు.. ఇలా ఎన్నో విషయాలను నేర్పించారు. వాటిని ఏ మాత్రం తడబడకుండా అప్పజెప్పేది అధృతి.

అధృతి చెప్పే విషయాలన్నీ వీడియో చిత్రీకరణ చేసి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ ఇంటర్నేషనల్ వారికి పంపించారు. మానవ శరీరంలోని 25 అవయవాల పేర్లు, 19 రకాల జంతువులు, వాటి అరుపులతో సహా అనుసరించి చెప్పడం, 15 రకాల కూరగాయలు పండ్లు, 20 రకాల గృహ పరికరాలు పేర్లు, 10 రకాల వాహనాలు, వివిధ రంగులు, ఆహార పదార్థాలను గుక్క తిప్పుకోకుండా చెప్పింది అధృతి. రైమ్స్‌ని కూడా డాన్స్ చేస్తూ..చక్కగా చెబుతుంది. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని.. వండర్ బుక్ వారు అధృతిని వండర్ కిడ్‌గా గుర్తించారు. ఈ మేరకు చిన్నారుల తల్లిదండ్రులకు సర్టిఫికెట్ అందజేశారు. ఈ గుర్తింపుతో తల్లిదండ్రుల్లో ఆనందోత్సవాలు నెలకొన్నాయి. ఇంత చిన్న వయసులో చిలుక పలుకుల్లా.. మాటలు చెబుతుంటే.. అందరూ ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఇలాంటి జ్ఞాపకశక్తి ఉన్న పిల్లలు చాలామంది ఉన్నారు. తల్లిదండ్రులు సమయం కేటాయించి వారితో గడిపితే.. ఇలాంటి అద్భుతాలను ఇంకా ఎన్నో చేస్తారు. .

First published:

Tags: Karimangar, Telangana

ఉత్తమ కథలు