2 WOMEN WERE KILLED AND 10 WERE INJURED IN A ROAD ACCIDENT ON THEIR WAY TO AND FROM A FUNERAL IN KAMAREDDY SADASHIVANAGAR VB NZB
Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. తలపై ఎక్కిన లారీ టైర్లు.. మరో మహిళను రెండు కిలో మీటర్లు ఈడ్చుకెళ్లి..
ఘటనా స్థలం వద్ద దృశ్యం
Road Accident: అంత్యక్రియలకు వెళ్లి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందగా, పదిమంది గాయపడ్డారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం పద్మాజివాడి గ్రామ శివారులో 44వనంబర్ జాతీయ రహదారిపై ఆదివారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
(పి. మహేందర్, నిజామాబాద్ జిల్లా, న్యూస్18 తెలుగు)
దగ్గరి బంధువు మృతి చెందడంతో అంత్యక్రియలకు వెళ్లారు.. అంత్యక్రియలు ముగించుకుని తిరుగు ప్రయాణం అయ్యారు. మరి కొద్ది నిమిషాల్లో గమ్యస్థానానికి చేరుకుంటారు. అంతలోనే రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు వెంటాడింది.. వెనుక నుంచి వస్తున్న లారీ ముందు ఉన్న ఆటోను డీ కోట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు తోడి కొడళ్లు మృతి చెందారు. మరో ఏడు గురికి తీవ్రగాయలు అయ్యాయి.. ఈ ప్రమాదం కామారెడ్డి జిల్లాలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం సంగోజివాడికి చెందిన కుటుంబ సభ్యులు, బంధువులు కలిసి ఆటోలో నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం కులాస్‌పూర్‌లో బంధువు మృతి చెందితే అంత్యక్రియలకు వెళ్లారు. అంత్యక్రియలు పూర్తి అయ్యాక ఆటోలో తిరుగు ప్రయాణం అయ్యారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం పద్మాజివాడి క్రాస్ రోడ్డు వద్ద వెనుక నుంచి వచ్చిన లారీ, ఆటోను వేగంగా ఢీ కొట్టింది. దీంతో ఆటో పల్టీలు కొట్టింది.
ఆటోలో ప్రయాణిస్తున్న గడ్డం మమత(35) అక్కడికక్కడే మృతిచెందగా ఆమె భర్త ఆటోడ్రైవర్ గడ్డం చిన్న బాలయ్యకు రెండు కాళ్లు విరిగి పోయాయి. మరో మహిళ గడ్డం లక్ష్మి(30)ని లారీ ప్రమాద స్థలం నుంచి రెండు కిలోమీటర్లు లాక్కెళ్లడంతో తీవ్రగాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన మరో ఆరుగురిని చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో గడ్డం చిన్నబాలయ్య, గడ్డం రాజయ్య, సాయవ్వను మెరుగైన చికిత్స కొసం నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులు స్వప్న, లక్ష్మి, నర్సవ్వ, రాజవ్వ కామారెడ్డిలో చికిత్స పొందుతున్నారు. ఈ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మమత, లక్ష్మిలు తోటికోడళ్లు. మృతురాలు గడ్డం మమత భర్త చిన్న బాలయ్య వ్యవసాయం చేస్తూనే ఆటోడ్రైవర్‌గా పనిచేస్తు కుటుంబాన్ని పోషించుకుంటున్నారు.
రోడ్డు ప్రమాదంలో ఆయన రెండు కాళ్లు విరిగాయి. మరో మృతురాలు లక్ష్మి భర్త మురళీమనోహర్ బతుకుదెరువు కోసం రెండేళ్ల క్రితం గల్ఫ్ దేశం వెళ్లారు. రెండు కుటుంబాలకు ఆడదిక్కు లేకుండా పోయింది. తల్లి మృతితో పిల్లలు బోరున విలపిస్తున్నారు. వారి రోదనలో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.. ఒకే ఊరికి చెందిన వీరంతా బంధువులు. తల్లి మృతి, తండ్రి కాళ్లు విరిగి ఆసుపత్రి పాలవడం.. మరోపైపు తల్లి మృతి.. తండ్రి గల్ఫ్ దేశంలో ఉండడంతో పిల్లలు ఆనాథలుగా మారారు. పిల్లలను చూసి గ్రామస్తులు చలించిపోయారు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.