పరిశ్రమలో వరుస ప్రమాదాలు భయాందోళకు గురిచేస్తున్నాయి. విశాఖలో స్టైరీన్ గ్యాస్ లీకేజ్ దుర్ఘటనను మరవకముందే.. సంగారెడ్డిలో జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. స్కంద బయోడీజిల్ పరిశ్రమలో రియాక్టర్ పేలి పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే చనిపోయారు. మరికొందరికి గాయాలయ్యాయి. జహీరాబాద్ మండలం అర్జున్ నాయక్ తండా వద్ద ప్రమాదం జరిగింది. ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే అగ్రిమాపక సిబ్బంది అక్కడ చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. పలువురిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.