తెలంగాణలో రెవెన్యూ అధికారు తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భూప్రక్షాళ సమయంలో రికార్డులను తప్పుల తడకగా రూపొందించారని రైతులు ఆరోపిస్తున్నారు. పేద రైతుల నుంచి వేల వేలు లంచాలను వసూలు చేస్తున్నారని మండిపడుతున్నారు. ఐనా తమ సమస్యలను పరిష్కరించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. న్యాయం చేయమని నిత్యం అధికారుల చుట్టూ తిరిగిన ప్రయోజనం లేదు. న్యాయం కోసం బ్రతిమాలినా..కాళ్లపై పడి కన్నీళ్లు పెట్టుకున్నా కనికరిచండం లేదు. చివరకు ఆత్మహత్యకు పాల్పడిన సందర్భాలూ ఉన్నాయి. తాజాగా ఆసిఫాబాద్ జిల్లాలోనూ ఇద్దరు రైతులు ఆత్మహత్యాయత్నం చేశారు.
భూ సమస్య పరిష్కారం కోసం బెజ్జురు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఇద్దరు రైతులు ఆత్మహత్యాయత్నం చేశారు. తండ్రి పేరిట ఉన్న ఆస్తిని రెండు భాగాలుగా పంచకుండా.. మొత్తం భూమిని తన వదిన పేరిట పట్టా చేశారని ఫకీర్ అనే రైతు అధికారుల చుట్టూ ఎన్నోసార్లు తిరిగాడు. తన వాటాను ఇవ్వకుండా అడ్డుపడుతోందని అధికారులకు చెప్పాడు. తమ తండ్రి చెబుతున్నా ఆమె వినడం లేదని, తనకు న్యాయం చేయాలని కోరాడు. ఐతే రోజులు గడుస్తున్నా సమస్య పరిష్కారం కాకపోవడంతో మనస్థాపానికి గురయ్యాడు. శుక్రవారం ఎమ్మార్వో కార్యాలయంలో తండ్రి మూఖ్యతో కలిసి ఆత్మహత్యాయత్నం చేశాడు. స్థానికులు హుటాహుటిన వారిని ఆస్పత్రికి తరలించారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.