(Mahendar P, News18, Nizamabad)
ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (Sriram Sagar project) లోకి వరద ఉధృతి పెరిగింది.. దీంతో 12 గంటల్లో 19 టీఎంసీ నీరు వచ్చిన ప్రాజెక్టులో చేరింది. దీంతో ప్రాజెక్టు నీటి మట్టం గంట గంటకు పెరుగుతోంది. ఎప్పటికప్పుడు అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.. మారో 24 గంల పాటు ఇదే స్థాయిలో వరద ఉధృతి కొనసాగితే ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో ప్రాజెక్టు దిగువన ఉన్న ప్రజలను, పశువుల కాపరులను అలర్ట్ చేస్తున్నారు.. ఏ క్షణమైన ప్రాజెక్టు గెట్లు (SRSP gates)ఎత్తే అవకాశం ఉంటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు.. నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి.. మోస్థారు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి.. దీంతో ప్రాజెక్టులు, చెరువు, వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి.. చెరువులు మత్తల్లు పోస్తున్నాయి.. కొన్ని చోట్ల రోడ్ పై నుంచి వరద నీరు ప్రవహించి రాకపోకలు నిలిచి పోయాయి.. పంట పొలాలు నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
నిర్మల్ జిల్లాలో అత్యధిక వర్షాలు..
ఉత్తర తెలంగాణ వర ప్రదాయని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి (SRSP) వరద ప్రవహం పెరిగింది.. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు లోకి 4లక్షల 92వేల415 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చి చేరుతున్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు ఎగువన ఉన్న మహారాష్ట్ర లోని బాలేగావ్ ప్రాజెక్టు గేట్లు ఎత్తడం, దీనికి తోడు నిర్మల్ జిల్లాలో అత్యధికంగా వర్షాలు కురవడంతో గడ్డేన్న వాగు నుంచి వరద ప్రవాహం ప్రాజెక్ట్ లోకి వస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు 90 టిఎంసి లు కాగా ఈ రోజు ఉదయం 11 గంటల వరకు 1083 అడుగులు 60.9టిఎంసి ల నీటి నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు.
జూలై 9 రాత్రి 10 గంలకు 40 టీఎంసీలు నీరు ప్రాజెక్టులో ఉంటే.. 12 గంల వ్యవదిలో వరద ఉద్రితి పెరిగి పాజెక్టు లోకి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరడంతో 19 టీఎంసీ నీరు వచ్చింది.. దీంతో ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులకు గాను 1083 అడుగులకు చేరుకుంది.. ప్రాజెక్టు నీటి సామర్ద్యం 90 టీఎంసీలకు గాను 60.9 టీఎంసీలకు చేరింది.. దీంతో ప్రాజెక్టు లోకి వరద ఉధృతి ఏమాత్రం తగ్గడం లేదు. మరో 24 గంటలు ఇదే స్థాయిలో వరద కొనసాగితే ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
గోదావరి నది తీర ప్రాంత ప్రజలకు అధికారులు ఈ మేరకు ప్రకటన విడుదలచేశారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీ వరద నీరు వస్తున్నది. కావున గోదావరి నది పరివాహక మరియు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా గొర్ల , బర్ల కాపరులు చేపల వేటకు పోయే వారు నది లోనికి వెళ్లరాదని ప్రాజెక్టు అధికారులు విజ్ఞప్తి చేశారు.
1096 క్యూసెక్కుల నీటిని విడుదల..
పైఅధికారుల ఆదేశాల మేరకు వరద కాల్వకు నీటి విడుదలను అధికారులు ప్రారంభించారు. 5000క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతుంది. అవసరాన్ని బట్టి నీటి విడుదలను పెంచే ఆవకాశం ఉదని తెలుస్తుంది. జుక్కల్ లోని కౌలాస్ నాలా ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండుకుంది.. ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తి 1096 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్ ప్లో 1828 క్యూసెక్కులు ఉంది. ప్రాజెక్టు సామర్థ్యం 1.237 టీఎంసీలకు గాను 1.141 టీఎంసీలకు మెంటేన్ చేస్తున్నారు.. నిజాంసాగర్ ప్రాజెక్టులోకి కూడా వరద నీరు వచ్చి చేరుతుంది.. జిల్లా మొత్తం వర్షానికి తడిసి ముద్దైంది.. ఎటూ చూసిన నీరు మాత్రమే కనిపిస్తుంది.. మూడు రోజులుగా సూర్యుని దర్శనం లేదు.. భారి నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.. అధికారులు కలెక్టర్ సి నారాయణ రెడ్డి అదేవాలతో పరిస్థితి సమీక్షిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Floods, Heavy Rains, Irrigation Projects, Nizamabad