తెలంగాణ (Telangana)లో రోజురోజుకు కరోనా కేసులు (Corona cases) పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 2,606 కరోనా కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ తన బులెటిన్‌లో వెల్లడించింది. కాగా, ఉమ్మడి వరంగల్ (Warangal) జిల్లాలో మళ్ళీ కరోనా (Corona) మహమ్మారి విజృంభిస్తుంది. కాకతీయ మెడికల్ కాలేజీ (Kakatiya medical college)లో ఏకంగా 17 మంది మెడికోలు కరోనా (Corona) బారిన పడ్డారు..దీంతో మిగిలిన మెడికోలు – అధ్యాపకులు ఆందోళన చెందుతున్నారు.. మహాత్మా గాంధీ మెమోరియల్ హాస్పిటల్ (MGM)లో వైద్యసేవలు అందిస్తున్న క్రమంలోనే వారంతా కోవిడ్ బారిన పడ్డారని వైద్య విద్యార్థులు (Medical students), ప్రొఫెసర్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత వారం రోజుల నుంచి వరంగల్(Warangal) కోవిడ్ కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతుంది.
వైద్య సేవలను అందిస్తూ..
మహాత్మా గాంధీ మెమోరియల్ హాస్పిటల్ (MGM)లోని కోవిడ్ వార్డుకు కరోనా బాధితులు (Corona patients) క్యూ కడుతున్నారు. కరోనా బాధితులకు మెడికల్ స్టూడెంట్స్ (Medical students) కూడా వైద్య సేవలు అందిస్తున్నారు. వైద్య సేవలను అందిస్తూ.. మెడికో (Medico)లు కూడా కరోనా బారిన పడుతున్నారు.
17 మందికి కోవిడ్ పాజిటీవ్..
తాజాగా కాకతీయ మెడికల్ కళాశాల (Kakatiya Medical College)కు చెందిన మెడికోలు కోవిడ్ (Covid) బారిన పడ్డారు.. స్వల్ప లక్షణాలున్న ఎంబీబీఎస్ (MBBS) విద్యార్థులకు కోవిడ్ పరీక్షలు నిర్వహించారు.. వీరిలో 17 మందికి కోవిడ్ పాజిటీవ్ నిర్దారణ అయింది.. ఈ నేపథ్యంలో వారిని ఐసోలేషన్ (Isolation) లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఒకేసారి 17మంది కోవిడ్ బారిన పడడంతో తోటి మెడికలో, పీజీ డాక్టర్లు, ప్రొఫెసర్లు ఆందోళన చెందుతున్నారు.. ఎంజీఎం (MGM)లో రెగ్యులర్ గా వైద్య సేవలు అందిస్తున్న క్రమంలోనే కోవిడ్ బారిన పడ్డారని ఆందోళన చెందుతున్నారు.
ఇది కూడా చదవండి: అయ్యో ఎంత పని చేశావమ్మా... డాక్టర్ చెప్పాడని నిండు గర్భిణి అయి ఉండి ఇంతటి కఠోర నిర్ణయం తీసుకున్నావా..?
జీహెచ్ఎంసీలో విజృంభణ..
మరోవైపు జీహెచ్ఎంసీ (GHMC) పరిధిలో కేసులు భారీగా పెరిగిపోయాయి. జీహెచ్ఎంసీ (GHMC) పరిధిలో 1583, మేడ్చల్ 292, రంగారెడ్డిలో 214 కరోనా కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా కరోనా (Corona)తో ఈ రోజు ఇద్దరు మృతి (Died) చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో నమోదవుతున్న కరోనా కేసుల్లో (Corona cases in Telangana) 60 శాతంపైగా హైదరాబాద్ (Hyderabad)లోనే నమోదవుతున్నాయి. దీంతో నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. వైద్య సౌకర్యాలు తక్కువగా ఉండే గ్రామీణ ప్రాంతాల్లో కొవిడ్ మొదటి, రెండో వేవ్‌లలో సరైన చికిత్స అందక వేలమంది మరణించారు.
ఇవి కూడా చదవండి :
Love marriage killed family: కుటుంబాన్నే బలితీసుకున్న ప్రేమ పెళ్లి.. మొదట కొడుకు.. తర్వాత కోడలు... చివరికి తండ్రి..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Corona cases, Medical college, Warangal