ఒక భర్త.. ఇద్దరు భార్యలు.. బావిలో శవమై తేలిన రెండో భార్య కొడుకు.. మొదటి భార్యే చేసిందనుకున్నారు కానీ..

సంతోష్ ఫైల్ ఫొటో

మొదటి భార్యకు ఓ కొడుకు, కూతురు ఉన్నారు. రెండో భార్యకు కూడా ఓ కొడుకు ఉన్నాడు. రెండో భార్య కొడుకు బావిలో శవమై కనిపించాడు. మొదట్లో ఎవరో ఆగంతుకులు ఈ దారుణం చేసి ఉంటారని అంతా భావించారు. కానీ..

 • Share this:
  ఓ వ్యక్తికి ఇద్దరు భార్యలు. మొదటి భార్యతో విబేధాలు వచ్చి విడిపోయిన తర్వాత రెండో పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్యకు ఓ కొడుకు, కూతురు ఉన్నారు. రెండో భార్యకు కూడా ఓ కొడుకు ఉన్నాడు. కానీ ఊహించని రీతిలో రెండో భార్య కొడుకు బావిలో శవమై కనిపించాడు. మొదట్లో ఎవరో ఆగంతుకులు ఈ దారుణం చేసి ఉంటారని అంతా భావించారు. కానీ పోలీసులకు మాత్రం కుటుంబ సభ్యుల మీదే అనుమానం కలిగింది. దీంతో ఒక్కొక్కరినీ విచారిస్తే అసలు నిజం వెలుగులోకి వచ్చింది. ఈ దారుణానికి పాల్పడింది ఎవరో తేలింది. మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట మండలం జానం పేట గ్రామానికి చెందిన విష్ణుకు చాలా ఏళ్ల క్రితమే పద్మ అనే మహిళతో పెళ్లయింది.

  ఆమెతో విబేధాలు రావడంతో 13 ఏళ్ల క్రితమే ఆమెను వదిలి పెట్టాడు. ఆమెను వదిలి పెట్టే నాటికే కూతురు, కొడుకు విష్ణు ఉన్నారు. ఆ తర్వాత లక్ష్మి అనే మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు సంతోష్ అనే కొడుకు కలిగాడు. ప్రస్తుతం విష్ణు వయసు 16ఏళ్లు కాగా, సంతోష్ వయసు ఏడేళ్లు. వరుసకు ఇద్దరూ అన్నాదమ్ములే అయినా తరచూ గొడవపడేవారు. ఇదే క్రమంలో ఫిబ్రవరి 22న కూడా సంతోష్ తో విష్ణు గొడవపడ్డాడు. ఈ గొడవలతో విసిగిపోయిన విష్ణు ఓ కఠిన నిర్ణయం తీసుకున్నాడు. సంతోష్ ను చంపేయాలనుకున్నాడు. అదే రోజు సంతోష్ ను వ్యవసాయ బావి వైపునకు తీసుకెళ్లాడు. తాడుతో గొంతకు ఉరి బిగించి చంపేశాడు.
  ఇది కూడా చదవండి: ప్లీజ్.. నన్ను రెండో పెళ్లయినా చేసుకోమని కోరిన యువతి.. నో చెప్పిన ప్రియుడు.. ఆ భగ్న ప్రేమికురాలు ఎంతకు తెగించిందంటే..

  ఆ తర్వాత చీరలో చుట్టి పక్కనే ఉన్న బావిలో పడేశాడు. ఆ తర్వాత ఏమీ తెలియనట్టు ఉండిపోయాడు. అయితే కొడుకు కనిపించకపోవడంతో అంతా వెతికితే బావిలో సంతోష్ మృతదేహం లభ్యమయింది. దీంతో హత్యగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులకు కుటుంబ సభ్యులపైనే అనుమానం ఉండటంతో, ఒక్కొక్కరినీ ఆరా తీశారు. విడివిడిగా ప్రశ్నించారు. చివరకు విష్ణును దోషిగా తేల్చారు. విష్ణు కూడా నేరం ఒప్పుకోవడంతో మర్డర్ మిస్టరీ వీడినట్టయింది. మొదట మొదటి భార్యే ఈ దారుణానికి పాల్పడి ఉంటుందని స్థానికులు అంతా అనుకున్నారు. కానీ ఆమె నిర్దోషి అనీ, ఆమె కొడుకే ఈ దారుణానికి తెగించాడని తెలియడంతో అంతా షాకయ్యారు.
  ఇది కూడా చదవండి: పెళ్లిని రద్దు చేసుకున్న వరుడు.. అసలు కారణం ఏంటని నేరుగా అతడికే వధువు ఫోన్ చేస్తే..
  Published by:Hasaan Kandula
  First published: