నెహ్రూ జూపార్క్‌లో 14 ఏళ్ల తెల్లపులి బద్రి మృతి...

టైగర్ బద్రి

రెండు రోజులుగా ఆరోగ్యం విషమించడంతో బద్రికి ప్రత్యేక వైద్య బృందం చికిత్స అందిస్తోంది. ఆ పులిని బతికించేందుకు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది.

  • Share this:
    హైదరాబాద్‌లోని నెహ్రూ జూపార్క్‌లో 14 ఏళ్ల మగ తెల్లపులి బద్రి చనిపోయింది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బద్రి.. చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం మరణించింది. అనంతరం పోస్టుమార్టం చేసిన వెటర్నరీ వైద్యులు పులి గొంతుభాగం నుంచి 5 కేజీల కణతిని బయటకు తీశారు. అనంతరం ట్యూమర్ శాంపిల్స్‌ని వెటర్నరీ బయాలజీ ఇన్‌స్టిట్యూట్, కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్, సీసీఎంబీకి పంపించారు. పూర్తి ఇన్వెస్టిగేషన్ అనంతరం పులికి ఎలాంటి వ్యాధి సోకిందన్న దానిపై స్పష్టత రానుంది.

    ఈ నెల 7 నుంచి పులి గొంతుభాగంలో వాపు కనిపించింది. అప్పటి నుంచీ ట్రీట్‌మెంట్ ఇస్తున్నారు. రెండు రోజులుగా ఆరోగ్యం విషమించడంతో బద్రికి ప్రత్యేక వైద్య బృందం చికిత్స అందిస్తోంది. ఆ పులిని బతికించేందుకు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. కాగా, తిరుపతి జూలో 2006లో జన్మించింది బద్రి. అక్కడి నుంచి కొన్నేళ్ల క్రితం నెహ్రూ జూకు తీసుకొచ్చారు.


    Published by:Shiva Kumar Addula
    First published: