హోమ్ /వార్తలు /తెలంగాణ /

Hyderabad Gangrape: మెడికల్ షాప్‌కు వెళ్లిన బాలిక కిడ్నాప్... మత్తు మందు ఇచ్చి గ్యాంగ్ రేప్.. హైదరాబాద్ నడిబొడ్డున ఘోరం

Hyderabad Gangrape: మెడికల్ షాప్‌కు వెళ్లిన బాలిక కిడ్నాప్... మత్తు మందు ఇచ్చి గ్యాంగ్ రేప్.. హైదరాబాద్ నడిబొడ్డున ఘోరం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Hyderabad Gang Rape: కారులో వచ్చి.. ఆమెను బలవంతంగా కారులో ఎక్కించుకున్నారు. మాయమాటలతో నాంపల్లిలోని ఓ లాడ్జికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెకు మత్తు మందు ఇచ్చి.. రెండు రోజుల పాటు అత్యాచారానికి పాల్పడ్డారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  హైదరాబాద్ (Hyderabad) నడిబొడ్డున ఘోరం జరిగింది. పాత బస్తీలో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం (Old City Gangrape) జరిగింది. 13 ఏళ్ల  బాలికకు మత్తు మందు ఇచ్చి అఘాయిత్యానికి పాల్పడ్డారు. పాతబస్తీలోని డబీర్‌పురా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘోరం వెలుగుచూసింది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం..చంచల్ గూడ‌కు చెందిన మైనర్ బాలికను అదే ప్రాంతానికి చెందిన ఇద్దరు యువకులు కిడ్నాప్ చేశారు. కారులో వచ్చి.. ఆమెను బలవంతంగా కారులో ఎక్కించుకున్నారు. మాయమాటలతో నాంపల్లిలోని ఓ లాడ్జికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెకు మత్తు మందు ఇచ్చి.. రెండు రోజుల పాటు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత రోడ్డుపై వదిలిపెట్టి పారిపోయారు. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. నిందితులిద్దరు బాలికకు తెలిసిన వారేనని.. పోలీసులు వెల్లడించారు.

  ''సెప్టెంబరు 12న రాత్రి నాకు ఛాతీలో నొప్పి వచ్చింది. మెడికల్ షాప్‌కు వెళ్లి మందులు తీసుకురమ్మని మా కూతురిని పంపించాను. బయటకు వెళ్లి చాలా సేపయిన పాప రాలేదు. రాత్రంతా వెతికాం. తెలిసిన వారందరికీ ఫోన్ చేశాం. కానీ ఎక్కడా దొరకలేదు. మరుసటి రోజు ఉదయం 8 గంటల సమయంలో డబీర్ పురా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాం. రాత్రి చాదర్ ఘాట్ వద్ద మా కుమార్తెను వదలిపెట్టారు. ఆమెను స్థానిక పోలీసులు గుర్తించి డబీర్‌పురా తీసుకొచ్చారు. అప్పటికే పాప నడవలేని స్థితిలో ఉంది. చేతికి ఇంజెక్షన్ ఇచ్చినట్లుగా ఆనవాళ్లు ఉన్నాయి. ప్రస్తుతం మా కూతురిని భరోసా కేంద్రానికి పంపించారు.మాకు న్యాయం చేయాలి. నిందితులను కఠినంగా శిక్షించాలి.'' అని బాధితురాలి తల్లి వాపోయారు.

  ఈ కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. బాధితురాలి వాంగ్మూలంతో పాటు సీసీ ఫుటేజీ ఆధారంగా కీలక విషయాలను రాబట్టారు. నాంపల్లిలోని సృజన స్టే ఇన్ హోటల్‌‌లో సెప్టెంబరు 13న రాత్రి సోహైల్ అనే వ్యక్తి రూమ్ బుక్ చేసుకున్నాడు. సోహైల్‌తో పాటు బాధితురాలు చెక్ ఇన్ అయినట్లు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. వీళ్ళు చెక్ ఇన్ అయిన గంట తర్వాత మరో యువకుడు కూడా రూమ్‌లోకి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. హోటల్ ఇచ్చిన ఐడి ప్రూఫ్‌ల ఆధారంగా నిందితులను గుర్తించారు. వారు గంజాయి, డ్రగ్స్ మత్తులో బాలికపై అత్యాచారం చేసినట్లు వెల్లడించారు. బాలికకు కూడా గుర్తు తెలియని ఇంజెక్షన్ ఇచ్చారు. నిందితులు పాతబస్తీలో గంజాయితో పాటు మత్తు ఇంజెక్షన్‌లు పోలీసుల విచారణలో తేలింది.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Crime, Crime news, Gang rape, Hyderabad

  ఉత్తమ కథలు