(K.Veeranna,News18,Medak)
సంక్షేమ గురుకుల పాఠశాలలు, మైనార్టీ రెసిడెన్షియల్ Minority Residential Hostel హాస్టళ్లల్లో స్టూడెంట్స్ ఎదుర్కొనే సమస్యల గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. స్టూడెంట్స్‌కి మౌలిక వసతులు ఉండవు, సరైన సౌకర్యాలు ఏర్పాటు చేయరు. కనీసం పౌష్టికాహారంతో కూడిన రుచికరమైన భోజనం కూడా పెట్టరనే విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు ఈ విమర్శలు నిజం అన్నట్లుగా మారింది సిద్దిపేటSiddipetలోని ఓ మైనార్టీ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాల నిర్వాహకుల పరిస్థితి చూస్తుంటే. విద్యార్ధులకు వడ్డించిన భోజనం విషతుల్యం(food poisoning) కావడంతో సుమారు నూట పాతికమందికి(128 Students)పైగా విద్యార్ధులు అస్వస్థతకు గురై ఆసుపత్రి(Hospital) పాలవడం కలకలం రేపింది.
చికెన్ గ్రేవీతో వంకాయకూర..
సిద్దిపేట జిల్లా కేంద్రంలోని తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో ఈ నిర్లక్ష్య సంఘటన చోటు చేసుకుంది. మైనారిటీ గురుకుల పాఠశాలలో అదివారం మధ్యాహ్నం విద్యార్థులకు చికెన్ భోజనం వడ్డించారు. మధ్యాహ్నం పిల్లలకు పెట్టగా మిగిలిన చికెన్ గ్రేవీని రాత్రి పెట్టే భోజనం కోసం తయారు చేసిన వంకాయ కూరలో కలిపి స్టూడెంట్స్‌కి పెట్టారు. దీంతో రాత్రి భోజనం తిన్న తర్వాత నుంచి 128 మంది స్టూడెంట్స్ అస్వస్థతకు గురయ్యారు. అర్ధరాత్రి నుంచి విద్యార్ధినులు కడుపునొప్పితో బాధపడుతుండటంతో సోమవారం ఉదయం గురుకుల పాఠశాల నిర్వాహకులు స్థానిక వైద్య సిబ్బందిని పిలిపించి చికిత్స అందించారు.
పిల్లల ఆరోగ్యంతో చెలగాటమా..
స్టూడెంట్స్ హెల్త్ కండీషన్‌ను పరిశీలించిన డాక్టర్లు వాళ్లు తిన్న ఫుడ్ పాయిజన్ అయిందని అందుకే ఈ విధంగా అస్వస్థతకు గురైనట్లుగా తెలిపారు. కొందరు విద్యార్థినులకు మెరుగైన చికిత్స కోసం సిద్దిపేట జిల్లా అసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. పిల్లలు అస్వస్థతకు గురైన విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. గురుకుల పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం రాత్రి సంఘటన జరిగితే కనీసం తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని మండిపడ్డారు. పరిస్థితి విషమించడంతో హాస్పిటల్‌కు రావాలని పేరెంట్స్‌కు ఫోన్ చేయడంపై అసహనం వ్యక్తం చేశారు.
నూట పాతిక మందికి అస్వస్థత..
విద్యార్థినులు ఆరోగ్య పరిస్థితిని తెలంగాణ మైనార్టీ గురుకులాల సంస్థ రాష్ట్ర సహాయ కార్యదర్శి యూసఫ్ అలీ. జిల్లా విజులెన్స్ అధికారి గౌస్ పాషా, మైనార్టీ గురుకులాల జిల్లా ఇన్‌చార్జ్ గోపాల్‌రావును అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై విచారణ చేపట్టారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని, సంబంధిత నివేదికను మైనార్టీ గురు కులాల రాష్ట్ర అధికారులకు సమర్పిస్తామని తెలిపారు.ప్రస్తుతం విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల సంఘటనలో విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాలని డీఎంహెచ్ వో కాశీనాథ్ ను మంత్రి తన్నీరు హరీశ్ రావు అదేశించారు. ఈమేరకు జిల్లా అసుపత్రిలో విద్యార్థులకు అందుతున్న చికిత్సను మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో మొత్తం 326మంది విద్యార్థినులు చదువుతున్నారు. అందులో 128మంది ఆసుపత్రి పాలవడంతో జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.