పిల్లాడు కాదు పిడుగు.. 12 ఏళ్లకే డేటా సైంటిస్ట్ జాబ్

ప్రస్తుతం ఏడో తరగతి చదువుతున్న సిద్థార్థ్.. చదువుకుంటూనే జాబ్ చేస్తున్నాడు. వారంలో రెండు రోజులు స్కూల్‌కు వెళ్తూ.. నాలుగు రోజులు ఆఫీసుకు వెళ్తున్నాడు.

news18-telugu
Updated: November 27, 2019, 4:23 PM IST
పిల్లాడు కాదు పిడుగు.. 12 ఏళ్లకే డేటా సైంటిస్ట్ జాబ్
సిద్దార్థ్
  • Share this:
12 ఏళ్ల వయసులో అందరు పిల్లలు స్కూల్ లైఫ్ ఎంజాయ్ చేస్తారు. అల్లరి చేయడం... స్నేహితులతో ఆడుకోవడం.. అప్పుడప్పుడూ చదవుకోవడం..ఇది మాత్రమే వారికి తెలుసు. కానీ ఇక్కడ కనిపిస్తున్న ఈ పిల్లాడు మాత్రం వెరీ వెరీ స్పెషల్..! ఎందుకంటే స్కూలుకు వెళ్తూనే జాబ్ కొట్టేశాడు. 12 ఏళ్ల వయసులోనే సాఫ్ట్ వేర్ కంపెనీలో డేటా సైంటిస్ట్‌గా పనిచేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాడు. ఈ కాలం యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.

ఇతడి పేరు పిల్లి సిద్ధార్థ్ శ్రీవాస్తవ.  హైదరాబాద్‌లోని చైతన్య టెక్నో స్కూల్లో ఏడోతరగతి చదువుతున్నాడు.  ఆన్‌లైన్ గేమ్స్ ఆడడం సిద్ధార్థ హాబీ. కేవలం ఆడడమే కాదు.. గేమ్స్ రూపొందించడం నేర్చుకున్నాడు.  ఇంటర్నెట్ సాయంతో కోడింగ్ నేర్చుకుని ఓ గేమ్ క్రియేట్ చేశాడు. అలా చిన్న వయస్సులోనే సైన్స్ అండ్ టెక్నాలజీపై ఎంతో ఆసక్తి పెంచుకున్నాడు.  అనంతరం పైథాన్, కఫ్కా వంటి కంప్యూటర్ లాంగువేజెస్ నేర్చుకున్నాడు. సిద్ధార్థ్ సైన్స్ స్కిల్స్ చూసిన మాంటైగ్నే స్మార్ట్ బిజినెస్ సొల్యుషన్స్ అనే సంస్థ అతడికి జాబ్ ఆఫర్ ఇచ్చింది.

బిగ్ గేట్స్, స్జీవ్ జాబ్స్ నాకు స్ఫూర్తి. చిన్నతనంలోనే  కెరీర్ ప్రారంభించారు. ప్రపంచంలో విప్లవం సృష్టించారు. పారిశ్రామిక వేత్త కావడం నా లక్ష్యం. ప్రభుత్వంతో పాటు సమాజానికి సేవ చేయాలి.
సిద్ధార్థ్ శ్రీవాస్తవ


ప్రస్తుతం ఏడో తరగతి చదువుతున్న సిద్థార్థ్.. చదువుకుంటూనే జాబ్ చేస్తున్నాడు. వారంలో రెండు రోజులు స్కూల్‌కు వెళ్తూ.. నాలుగు రోజులు ఆఫీసుకు వెళ్తున్నాడు. ఉదయం 10 గంటల నుంచి సాయత్రం 06.30 వరకు ఉద్యోగం చేస్తున్నాడు. బిల్ గేట్స్‌లా వ్యాపారవేత్త కావడమే తన లక్ష్యమంటున్నాడు సిద్థార్థ్.వీడియో ఇక్కడ చూడండి:
First published: November 27, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>