Home /News /telangana /

12 FARMERS TRIES TO COMMIT SUICIDE AT COLLECTOR OFFICE NAGARKURNOOL SK

నాగర్‌కర్నూల్‌లో ఉద్రిక్తత.. కలెక్టరేట్‌లో 12 మంది రైతుల ఆత్మహత్యాయత్నం

కలెక్టరేట్ ఎక్కిన రైతులు

కలెక్టరేట్ ఎక్కిన రైతులు

రెవిన్యూ అధికారులతో పాటు కలెక్టర్‌కు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టంచుకోవడం లేదని వాపోయారు. తమకు న్యాయం చేయాలంటూ కలెక్టరేట్ భవనంపైకి ఎక్కిన రైతులు కిరోసిన్ పోసుకున్నారు.

    తెలంగాణలో రెవెన్యూ అధికారు తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భూప్రక్షాళ సమయంలో రికార్డులను తప్పుల తడకగా రూపొందించారని రైతులు ఆరోపిస్తున్నారు. పేద రైతుల నుంచి వేలకు వేలు లంచాలను వసూలు చేస్తున్నారని మండిపడుతున్నారు. ఐనా తమ సమస్యలను పరిష్కరించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. న్యాయం చేయమని నిత్యం అధికారుల చుట్టూ తిరిగిన ప్రయోజనం లేదు. న్యాయం కోసం బ్రతిమాలినా..కాళ్లపై పడి కన్నీళ్లు పెట్టుకున్నా కనికరిచండం లేదు. చివరకు ఆత్మహత్యకు పాల్పడిన సందర్భాలూ ఉన్నాయి. తాజాగా నాగర్ కర్నూలు‌లో రైతులు ఆత్మహత్యాయత్నం చేశారు.

    నాగర్ కర్నూల్ కలెక్టరేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పెంట్లవెల్లి మండలం జట్‌ప్రోలుకు చెందిన రైతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. 12 మంది రైతులు కిరోసిన్ డబ్బాలతో కలెక్టర్ కార్యాలయానికి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. తమ భూమిని కొందరు వ్యక్తులు కబ్జాచేస్తూ బెదిరిస్తున్నారని ఆరోపించారు. రెవిన్యూ అధికారులతో పాటు కలెక్టర్‌కు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టంచుకోవడం లేదని వాపోయారు. తమకు న్యాయం చేయాలంటూ కలెక్టరేట్ భవనంపైకి ఎక్కిన రైతులు కిరోసిన్ పోసుకున్నారు. అప్రమత్తమైన సిబ్బంది, పోలీసులు రైతులను అడ్డుకొని కిరోసిన్ బాటిళ్లను లాక్కొని కిందకు దింపారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Farmers Protest, Revenue officers, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు