రెండు రోజుల్లోనే 12 కుక్కలు మృతి.. అసలు అక్కడేం జరుగుతోంది..?

ప్రతీకాత్మక చిత్రం

పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడెడ్ గ్రామంలో గత రెండు రోజుల వ్యవధిలో ఊరిలో తిరిగే 12 కుక్కలు ఆకస్మాత్తుగా కూప్పకూలి చనిపోయాయి. దీంతో వింత వ్యాధితో కుక్కలు చనిపోతున్నాయంటూ ప్రజల్లో భయాందోళనలు మొదలయ్యాయి.

  • Share this:
    కరోనా మహమ్మారి విజృంభిస్తుండడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ఇంతలోనే ఆ గ్రామంలో ఒక్కసారిగా అలజడి రేగింది. రెండు రోజుల వ్యవధిలోనే ఎక్కడి కుక్కలు అక్కడే పడి చనిపోతున్నాయి. రోజురోజూకీ కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువవుతున్న నేపథ్యంలో గ్రామంలోని కుక్కలు వింత వ్యాధితో మృతిచెందుతున్నాయి. దీంతో ప్రజల్లో భయాందోళలు రోజురోజూకీ ఎక్కువవుతున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే.. ముత్తారం మండలంలోని ఓడేడ్ గ్రామంలో ఉన్నట్టుండి వీధి కుక్కలు ఎక్కడివక్కడే కుప్పకూలిపోతున్నాయి.

    దాదాపు రెండురోజుల్లోనే గ్రామంలో 12 కుక్కల వరకు రోడ్లపై కుప్పకూలి చనిపోయారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని పశువైద్యాధికారి హన్నన్‌ను దృష్టికి తీసుకురాగా కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు హైపో క్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేశారు. దీంతో గ్రామంలోని గడ్డిని తినడంతో కుక్కలు చనిపోయి ఉంటాయని తెలిపారు. మళ్లీ కుక్కలు చనిపోతే పోస్టుమార్టం చేసి అసలు విషయం చెబుతామని పేర్కొన్నారు. దీనికితోడు గ్రామాల్లో కుక్కలకు సరైన ఆహారం దొరక్కపోవడం వల్ల కూడా చనిపోయి ఉంటాయని, గ్రామస్తులు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని వివరించారు.
    Published by:Narsimha Badhini
    First published: