టెన్త్ మాత్రమే చదివాడు... ఆల్కహాల్ డిటెక్టర్ కనిపెట్టాడు... కేటీఆర్‌ని మెప్పించాడు

పదో తరగతి మాత్రమే చదివిన కుర్రాడు ఇంటర్నెట్ సాయంతో తనకు నచ్చిన అంశాన్ని నేర్చుకొని ఆల్కహాల్ డిటెక్టర్ తయారు చేయడం కేటీఆర్‌ను సైతం మెప్పించింది. తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ ద్వారా సపోర్ట్ ఇస్తామని ట్విట్టర్‌లో ప్రకటించారు కేటీఆర్.

news18-telugu
Updated: February 5, 2019, 5:39 PM IST
టెన్త్ మాత్రమే చదివాడు... ఆల్కహాల్ డిటెక్టర్ కనిపెట్టాడు... కేటీఆర్‌ని మెప్పించాడు
టెన్త్ మాత్రమే చదివాడు... ఆల్కహాల్ డిటెక్టర్ కనిపెట్టాడు... కేటీఆర్‌ని మెప్పించాడు (image: ANI)
news18-telugu
Updated: February 5, 2019, 5:39 PM IST
హైదరాబాద్‌కు చెందిన 22 ఏళ్ల కుర్రాడు ఆల్కహార్ డిటెక్టర్‌ని కనిపెట్టి కేటీఆర్‌ మెప్పు పొందాడు. అతని పేరు సాయి తేజ. చదివింది పదో తరగతే. కానీ... రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు డ్రైవర్ మద్యం తాగాడా లేదా అని గుర్తించే పరికరాన్ని కనిపెట్టాడు సాయితేజ. ఒకవేళ డ్రైవర్ మద్యం తాగినట్టైతే ఆ పరికరం గుర్తిస్తుంది. ఇంజిన్ పనిచేయకుండా ఆపేస్తుంది. దీంతో వాహనం ముందుకు కదలడం సాధ్యం కాదు. అంతేకాదు... అందులో ముందే ఫీడ్ చేసిన మొబైల్ నెంబర్లకు ఎస్ఎంఎస్ అలర్ట్ కూడా పంపించడం ఈ పరికరం ప్రత్యేకత.

నేను కొన్ని కారణాల వల్ల 10వ తరగతి తర్వాత చదువు మానేశాను. కానీ ఎలక్ట్రానిక్స్ అంటే ఆసక్తి ఎక్కువ. అందుకే ఇంటర్నెట్‌ ద్వారా నేర్చుకున్నాను. ఇంటర్నెట్‌లోనే కోడ్ నేర్చుకొని ఆల్కహాల్ డిటెక్టర్ సృష్టించాను. డ్రైవర్ 30 శాతం కన్నా ఎక్కువ ఆల్కహాల్ తీసుకున్నట్టయితే వాహనం ఇంజిన్ స్టార్ట్ కాదు.
ఏఎన్ఐతో సాయితేజ


alcohol detector, sai teja alcohol detector, ktr supports saiteja, Telangana State Innovation Cell supports saiteja, ఆల్కహాల్ డిటెక్టర్, సాయితేజ, తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్
(image: ANI)
ఈ పరికరం తయారు చేయడానికి సాయితేజకు 15 రోజుల సమయం పట్టింది. రూ.2500 ఖర్చయింది. డ్రైవర్ మద్యం తాగితే వాహనం ఇంజిన్‌ను ఆపెయ్యడమే కాదు అందులోని మైక్రో కంట్రోలర్‌లో సేవ్‌ చేసిన ఫోన్ నెంబర్లకు ఎస్ఎంఎస్ వెళ్లేలా దీన్ని రూపొందించాడు సాయితేజ. పదో తరగతి మాత్రమే చదివిన కుర్రాడు ఇంటర్నెట్ సాయంతో తనకు నచ్చిన అంశాన్ని నేర్చుకొని ఆల్కహాల్ డిటెక్టర్ తయారు చేయడం కేటీఆర్‌ను సైతం మెప్పించింది. తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ ద్వారా సపోర్ట్ ఇస్తామని ట్విట్టర్‌లో ప్రకటించారు కేటీఆర్.మనలో దాగి ఉన్న ప్రతిభను చూపించడానికి చదువు ఒక్కటే మార్గం కాదని నిరూపించాడు సాయితేజ. తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ సపోర్ట్‌తో సాయితేజ మరిన్ని అద్భుతాలు ఆవిష్కరించాలని ఆశిద్దాం.

ఇవి కూడా చదవండి:

#Jobs: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 2019 నోటిఫికేషన్ విడుదల... వివరాలివే

Alert: ఫోటో ఎడిటింగ్ యాప్స్‌లో వైరస్... ఈ యాప్స్ మీ దగ్గరున్నాయా?

Alert: ఏప్రిల్ 2న Google+ షట్ డౌన్, మీరేం చేయాలో తెలుసుకోండి
First published: February 5, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...