హోమ్ /వార్తలు /తెలంగాణ /

Harish rao : వంద శాతం తొలి డోసు పూర్తి.. కేక్ కట్ చేసిన హరీష్ రావు..

Harish rao : వంద శాతం తొలి డోసు పూర్తి.. కేక్ కట్ చేసిన హరీష్ రావు..

Harish rao : తెలంగాణలో వంద శాతం మొదటి డోసు వ్యాక్సినేషన్ పూర్తయిన సంధర్భంగా మంత్రి హరీష్ రావు కేక్ కట్ చేశారు.. వంద శాతం పూర్తిచేసుకున్న పెద్ద రాష్ట్రంగా తెలంగాణ అవతరించడం అభినందనీయమని అన్నారు. మరోవైపు జనవరి 3 నుండి 15 సంవత్సరాల పైబడిన పిల్లలకు వ్యాక్సిన్ ప్రారంభించనున్నట్టు ఆయన తెలిపారు.

ఇంకా చదవండి ...

  కరోనా వ్యాక్సినేషన్‌లో తెలంగాణ మరో మైలు రాయిని చేరుకుంది. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసుకుంది. కాగా దేశంలో వంద శాతం పూర్తి చేసుకున్న రాష్ట్రాలు మొత్తంగా చూస్తే...ఇప్పటి వరకు అండమాన్ నికోబార్ దీవులు, చండీగర్, దాద్రానగర్ హవేలీ, గోవా, హిమాచల్ ప్రదేశ్, జమ్ము కాశ్మీర్, లక్ష ద్వీప్, సిక్కిం..వంటి 8 చిన్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు మాత్రమే ఈ ఘనత సాధించాయి.

  ఈ లక్ష్యం చేరడంలో వైద్యారోగ్య శాఖ కృషి ఎంతో దాగుందని ఈ సంధర్బంగా మంత్రి అభినందించారు..ప్రభుత్వంలోని ప్రతి ఒక్క శాఖ సహాకారంతో ఇది సాధ్యమైందని అందుకు ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలిపారు..ఇక ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన వివరించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 100% మొదటి డోసు, 66% రెండో డోసు పూర్తయిందని చెప్పారు. ఇక జాతీయ సగటు మొదటి డోసు 90 శాతం ఉండగా, రెండో డోసు 63 శాతంగా ఉంది. అంటే తెలంగాణ రాష్ట్రం జాతీయ సగటు కంటే ముందే ఉన్నామని అన్నారు... ఇందుకోసం ప్రభుత్వ వాక్సిన్ కేంద్రాల్లో 87శాతం వాక్సినేషన్ జరగగా, 13% ప్రైవేటు లో జరిగిందని చెప్పారు. ప్రస్తుతానికి రాష్ట్రంలో వాక్సిన్లకు కొరత లేకపోవడంతోపాటు 30 లక్షల డోసులు నిల్వ ఉన్నాయని చెప్పారు...

  Love marriage : ఒకరిని కాదు ఇద్దరిని ప్రేమించాడు.. రెండవ ప్రియురాలు చేసిన పనికి షాక్ తిన్నాడు.

  మరోవైపు జనవరి 3 నుండి 15-18 వయస్సు వారికి, జనవరి 10 నుండి 60 ఏళ్ల పై బడిన వారికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆయన వివరించారు. ముందుగా హైదరాబాద్ తో పాటు మున్సిపాలిటీల్లోని PHC, ఆపై స్థాయి ఆస్పత్రిలో ఉన్న చోట్ల వ్యాక్సినేషన్ ప్రారంభిస్తామని చెప్పారు.. ఆ తర్వాత గ్రామ స్థాయికి ఇస్తామన్నారు. కాగా వ్యాక్సిన్ కోసం మున్సిపాలిటీల్లో తప్పనిసరిగా కోవిన్ పోర్టల్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు.. ఇతర ప్రాంతాల్లో నేరుగా వ్యాక్సినేషన్ కేంద్రానికి వెళ్లి వేసుకోవచ్చని అన్నారు.. కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం, 15-18 వారికి కోవాక్సిన్, 60 ఏళ్లు పై బడిన వారికి అంతకుముందు తీసుకున్న డోసులనే అందించడం జరుగుతుందని చెప్పారు.. రాష్ట్రంలో 15-18 యేండ్ల వయస్సు వారు 22.78 లక్షలు, 60 ఏళ్ల పై బడిన వారు 41.60 లక్షలు, హెల్త్ కేర్, ఫ్రంట్ లైన్ వారియర్లు 6.34 లక్షలు ఉన్నారని మంత్రి తెలిపారు..

  Accident :పోష్ బైక్, రాష్ డ్రైవింగ్... మద్యంతో.. ముగ్గురు యువకుల పరిస్థితి దారుణం...!

  రాష్ట్ర వ్యాప్తంగా 7970 వాక్సినేషన్ బృందాలు పని చేస్తున్నాయి. అర్హులైన ప్రతి ఒక్కరికీ వాక్సిన్ అందాలనే లక్ష్యంతో ఇంటింటికి వెళ్లి టీకాలు ఇవ్వడం జరుగుతున్నది. రాష్ట్రంలో 18 ఏళ్లు దాటిన 2,77,67,000 మందిని వాక్సిన్ కు అర్హులుగా ప్రభుత్వం గుర్తించింది. మొత్తం 5.55 కోట్ల డోసులు వేయడం లక్ష్యంగా పెట్టుకున్నది. ప్రభుత్వ పరిధిలో 3500 కేంద్రాలు, ప్రైవేటులో 264 కేంద్రాల్లో వాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నది.మొత్తం 10వేల మంది వ్యాక్సినేటర్లు ఉండగా, మొత్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియలో 35వేల మంది సిబ్బంది పని చేస్తున్నట్లు మంత్రి హరీష్ రావు వివరించారు.
  *

  First published:

  Tags: Corona Vaccine, Harish Rao

  ఉత్తమ కథలు