హోమ్ /వార్తలు /తెలంగాణ /

Hyderabad : వర్షం ఎప్పుడు వస్తుందో ఖచ్చితంగా చెప్పెస్తారు.. అందుకే వేలమంది ఫాలోవర్స్ వాళ్లకి..

Hyderabad : వర్షం ఎప్పుడు వస్తుందో ఖచ్చితంగా చెప్పెస్తారు.. అందుకే వేలమంది ఫాలోవర్స్ వాళ్లకి..

వెదర్ అప్టెట్‌లో దూసుకుకుపోతున్న యువకులు

వెదర్ అప్టెట్‌లో దూసుకుకుపోతున్న యువకులు

Hyderabad : ఒక్కొక‌రికి ఒక్కొ అభిరుచి ఉంటుంది. అయితే ఓ ముగ్గురు యువ‌కుల‌కు ఉన్న అభిరుచి వారికి సోషల్ మీడియాలో వేల మంది ఫాలోవర్స్‌ను సాధించి పెట్టింది.కామన్ కాకుండా ప్రజలకు ఉపయగపడే వెదర్ అప్డెట్‌ను అందించడంలో ఆ యువకులు తమ ప్రతిభను కనబరిచారు. దీంతో వాతవరణ మార్పుల్లో ఖచ్చిత్వత్వంతో సోషల్ మీడియాలో ఆదరణ పొందుతున్నారు.

ఇంకా చదవండి ...

వాతవరణంపై అంచనాలు ఇంకా 100 ఖచ్చితత్వంగా చెప్పలేకపోతున్నాము. వాతవరణ శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు ఈ రంగంలో అనేక విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నా.. ఎక్కడో కొంత లోపం మాత్రం కనిపిస్తోంది. అయితే ఇలాంటీ ప్రజలకు అత్యవసరమైన వాతవరణ మార్పులను ఎప్పటికప్పుడు అందించడం ద్వారా కొంతమంది యువకులు తమ రికార్డులను సొంతం చేసుకోవడంతో పాటు వేలాది ఫాలోవర్స్‌ను సంపాదించుకున్నారు.. దీంతో సౌత్ ఇండియాలోనే బెస్ట్ వాతావ‌ర‌ణ అప్డేట్స్ ఇచ్చే బ్లాగ‌ర్స్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అప్పుడ‌ప్పుడు వాతావ‌ర‌ణ శాఖ ఇచ్చిన అప్డేట్స్ అయిన లెక్క త‌ప్పుతుందేమో కాని ఈ ముగ్గురు యువకులు ఇచ్చే అప్డేట్స్ మాత్రం ఖ‌చ్చితంగా ఉంటాయని చెబుతున్నారు...

అయితే వీరి ప్రస్థానం ఎలా సాగింది. ఈ సక్సెస్ వెనక ఉన్న అసలు అంశాలను తెలుసుకునేందుకు న్యూస్ 18 వీళ్ల‌ను సంప్ర‌దించే ప్రయ‌త్నం చేసింది. సౌత్ ఇండియాలోనే టాప్ వెథ‌ర్ అప్డేట్స్ ఇచ్చేవాళ్ల‌లో టాప్ ప్లేస్ లో వారిలో సాయి ప్రణీత్ ఒకరు 2013లో వాతావరణాన్ని అధ్యయనం చేయడం ప్రారంభించాడు. దాదాపు రెండేళ్ల పరిశోధన త‌రువాత‌, అతను 2015లో తన బ్లాగ్, వెదర్ ఆఫ్ సౌత్ ఇండియా ద్వారా వాతావరణాన్ని అంచనా వేయడం ప్రారంభించాడు. బీటెక్ గ్రాడ్యువేష‌న్ అన్నా యూనివర్సిటీ పూర్తీ చేసిన సాయి ప్ర‌ణీత్ బీటెక్ లో గోల్డ్ మెడ‌ల్ కూడా పొందారు. ప్ర‌స్తుతం బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తూ త‌న అభిరుచి త‌గిన ప‌నిగా ఇలా వాతావ‌ర‌ణంలో వ‌చ్చే మార్పుల‌ను అంచవేయ‌డం ప్రారంభించాడు. అయితే ప్ర‌ణీత్ ఇలా వాతావ‌ర‌ణంలో వ‌చ్చే మార్పుల‌ను అంచ‌న వేయ‌డానికి శాటిలైట్, రాడార్ చిత్రాలు, వాతావరణ శాఖ (IMD) నుండి సేకరించిన సంఖ్యా నమూనాలు తోపాటు యూరప్, జ‌ప‌నీస్ నుండి ఇమేజ్ డేటా, వాతావరణ డేటాను ఉపయోగిస్తాన్నాడు.

ఇలా వాతావ‌ర‌ణాన్ని అంచ‌న వేసిన మొద‌ట్లో సాయి ప్రణీత్ వాతావరణ అప్డేట్స్ వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా తన స్వంత సర్కిల్‌లను మాత్రమే అప్‌డేట్ చేసేవాడు. అయితే తాను ఇచ్చే అప్డెట్స్ లో ఉన్న ఖ‌చ్చిత్వానికి చాలా మంది సోష‌ల్ మీడియాలో కూడా త‌న అప్డేట్స్ పెట్టాల‌ని కోర‌డంతో సోష‌ల్ మీడియాలో అప్డ‌ట్స్ ఇవ్వ‌డం ప్రారంభించాడు ప్ర‌స్తుతం సాయి ప్రణీత్‌కు ట్విట్టర్‌లో 35,000 మంది ఫాలోవర్లు, ఫేస్‌బుక్‌లో 55,000 మంది ఫాలోవర్లు ఉన్నారు.

Telangana BJP : బీజేపీ ఎమ్మెల్యేలకు కోర్టులో చుక్కెదురు.. సస్పెషన్ స్టే.. నిరాకరణ.

ఒక  విశాఖ‌ప‌ట్నానికి చెందిన మ‌రో కుర్రాడు రజనీ 2014లో వచ్చిన హుద్‌హుద్ తుఫాను వాతావరణ అప్డేట్స్ ఇవ్వ‌డం ప్రారంభించాడు. తుఫాను వైజాగ్ నగరంపై ప్రభావం చూపదని చాలా మంది ప్రజలు అపోహలో ఉన్నారు.  కానీ తుఫాను వచ్చినప్పుడు, నగరం పెద్ద ఎత్తున విధ్వంసాన్ని చూసింది, 124 మంది మరణించారు. దీంతో ఎదో ఒక‌టి చేయాల‌ని అప్ప‌టి నుంచి వాతావ‌ర‌ణంలో వ‌చ్చే మార్పుల‌ను అంచ‌న వేయ‌డం ప్రారంభించాడు ర‌జ‌నీ.  మొద‌ట్లో మేఘాలు, గాలి దిశలు, తేమ పరిధిని గమనించడం ద్వారా వాతావరణాన్ని అంచనా వేసేవారు. తరువాత, అతను తన అంచనాలను సోషల్ మీడియాలో పోస్ట్  చేయాల‌ని నిర్ణయించుకున్నప్పుడు, కంప్యూటర్ ఆధారిత వాతావరణ నమూనాల వంటి మరిన్ని సాంకేతిక అంశాలను ఉపయోగించాడు. హైదరాబాద్‌లో ఉంటూ వాతావరణాన్ని అంచనా వేసే రజనీ రెండు తెలుగు రాష్ట్రాలకు త‌న అప్డేట్స్ ను ఇస్తున్నారు. “వాతావరణ అంచనా అనేది ఒక రోజు పని కాదు. సరైన అంచనా వేయడానికి ఆ రోజు వర్షం పడకపోయినా ప్రతిరోజూ పరిస్థితిని మనం అప్‌డేట్ చేయాలి ఉష్ణోగ్రత, తేమ, గాలి దిశలు వంటి రోజువారీ మార్పులు ఒక పెద్ద వాతావరణ మార్పుకు దోహ‌దం చేస్తాయ‌ని వాటిని క్రమం తప్పకుండా పర్యవేక్షించాల్సిన ఉంటుంద‌ని తెలిపారు ర‌జినీ.

‘తెలంగాణ వెదర్‌మ్యాన్’ ట్విట్టర్ హ్యాండిల్ పేరుతో వెద‌ర్ అప్డ్ డేట్స్ ఇస్తున్న మ‌రో కుర్రాడు బాలాజీ.  16 ఏళ్ల ఈ  యువకుడు వాతావరణం, వర్షాలకు సంబంధించిన మార్పుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు అంద‌రికి తెలిజేస్తోన్నాడు. బాలాజీ 10వ తరగతి నుండి సాంకేతిక విషయాలపై దృష్టి పెట్టడం ప్రారంభించాడు ఇంటర్మీడియట్‌లో ఉన్నప్పుడు COVID-19 లాక్‌డౌన్ స‌మ‌యంలో, ఆన్‌లైన్‌ల క్లౌడ్ ఫార్మేషన్ నమూనాల పై ఆస‌క్తి పెంచుకున్నాడు ఇప్ప‌టికే  ఫీల్డ్‌లో ఉన్న సీనియర్ వాతావరణ బ్లాగర్ల స‌హాయంతో ఖ‌చ్చిత‌మైన అప్డేట్స్ ఇస్తున్నాడు..  బాలాజీ త‌న ప్రెండ్ సర్కిల్‌లో అప్పటికే ‘వెదర్‌మ్యాన్’గా మంచి పేరు త‌చెచ్చుకున్నాడు, అక్టోబర్ 2020లో సోషల్ మీడియా ద్వారా తన అప్డేట్స్ ను ఇవ్వ‌డం ప్రారంభించాడు. అదే నెలలో హైదరాబాద్‌లో వరదలకు కారణమైన భారీ వర్షాలను సరిగ్గా అంచనా వేసిన వాతావరణ బ్లాగర్లలో అతను కూడా ఉన్నాడు. “హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తాయని గుర్తించాను అంద‌రిని అప్రమత్తం చేయాలనుకుంటున్నాను. కొద్దిసేపటికే, నగరంలో వరదలు పెరిగాయి. నేను ఈ సమయంలోనే సోషల్ మీడియాలో నా అప్డడేట్స్  పోస్ట్ చేయడం ప్రారంభించాను వాటిలో చాలా వరకు ఖచ్చితంగా ఉండ‌డంతో చాలా మంది న‌న్ను ఫాలో చేయ‌డం ప్రారంభించారు. ప్ర‌స్తుతం ట్విట్టర్‌లో 8,500 మంది ఫాలోవర్ల ఉన్నార‌ని  బాలాజీ చెప్పారు. వాతావరణ అంచనాల కోసం బాలాజీ IMD, నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్‌కాస్ట్ (NCFMRW) నుండి డేటా ను త‌న‌ విశ్లేషణకు ఉపయోగిస్తాడు.

.

First published:

Tags: Hyderabad, Weather report

ఉత్తమ కథలు