10 YEARS OLD SON KILLED IN ROAD ACCIDENT WIFE COMPLAINED AGAINST HUSBAND FOR RASH DRIVING IN TELANGANA SK
Telangana: రోడ్డు ప్రమాదంలో కుమారుడు మృతి.. భర్తే చంపాడని భార్య ఫిర్యాదు.. ఏం జరిగింది?
ప్రతీకాత్మక చిత్రం
shankarpalli Accident: అతివేగంతో అదుపు తప్పిన ఓ కారు బోల్తా పడింది. అందులో నుంచి ఎగిరిపడి పదేళ్ల బాలుడు మరణించాడు. తన భర్త నిర్లక్ష్యంగా కారు నడపడం వల్లే.. తన కొడుకు మరణిచాడని.. పోలీసులకు ఫిర్యాదు చేసింది భార్య.
రోడ్డుప్రమాదంలో కుమారుడు మరణించాడు. తన కళ్ల ముందే ఈ ఘోరం జరిగింది. ఫ్యామిలీ మొత్తం కారులో వెళ్తున్న క్రమంలోనే ప్రమాదం జరిగి.. కుమారుడు చనిపోయాడు. కానీ అతడి తల్లి మాత్రం భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. భర్తే తన కొడుకును చంపేశాడని చెప్పింది. అతడి నిర్లక్ష్యం వల్లే మరణించాడని సంచలన ఆరోపణలు చేసింది. తెలంగాణలోని వికారాబాద్ (Vikarabad) జిల్లా శంకర్‌పల్లి (Shankarpalli Accident) మండలంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆమె ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇంతకి ఏం జరిగింది? ఆ బాలుడు ఎలా చనిపోయాడు? భర్తపై భార్య ఎందుకు ఫిర్యాదు చేసింది? ఆ వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా నవాబ్‌పేట మండలం ఎల్లకొండ గ్రామానికి చెందిన రహీం(38), రేష్మ (30) దంపతులు. వీరిది రైతు కుటుంబం. వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. రహీం, రేష్మ దంపతులకు ఒక కూతురు, ఒక కుమారుడు ఉన్నారు. కుమార్తె పేరు ఆశ్యుబేగం (13), కొడుకు పేరు రెహమాన్ (10). చిన్న కుటుంబం.. ఉన్నంతలోనే ఎంతో సంతోషంగా జీవిస్తున్నారు. ఐతే శుక్రవారం శంకర్‌పల్లిలోని బంధువుల ఇంట్లో శుభకార్యం జరిగింది. సాయంత్రం ఆ శుభకార్యానికి వెళ్లారు. అర్ధరాత్రి కారులో తిరుగు ప్రయాణమయ్యారు. ఐతే వీరు ప్రయాణిస్తున్న కారు శంకర్ పల్లి మండలం కచ్చిరెడ్డి గూడలో గ్రామ శివారులోని మూలమలుపు వద్ద ప్రమాదానికి గురయింది. అతివేగంతో అదుపుతప్పి బోల్తా పడింది.
కారు బోల్తా పడ్డాక.. డోర్ నుంచి రెహమాన్ కిందపడ్డాడు. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మరణించాడు. కళ్ల ముందే కొడుకు చనిపోవడంతో భార్యాభర్తలు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఐతే రహీ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని రేష్మ ఆరోపిస్తోంది. అతి వేగంగా నడపడం వల్లే.. అదుపు తప్పి బోల్తాపడిందని చెప్పింది. ఎంత చెప్పినా వినకుండా.. అధిక వేగంతో కారును నడిపాడని.. అతడని నిర్లక్ష్యం వల్లే రెహమాన్ మరణించాడని శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది రేష్మ. తన కుమారుడి మృతికి తన భర్తే కారణమని ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.