Home /News /telangana /

10 DAYS VACCINATION FOR SUPER SPRIDERS IN HYDERABAD VRY HYD

Hyderabad : నగరంలో పది రోజుల పాటు సూపర్ స్ప్రెడర్స్ కు వాక్సినేషన్ : మేయర్

జీహెచ్‌ఎంసీ మేయర్ విజయ లక్ష్మి(ఫైల్ ఫొటో)

జీహెచ్‌ఎంసీ మేయర్ విజయ లక్ష్మి(ఫైల్ ఫొటో)

Hyderabad : నగరంలో పది రోజుల పాటు సూపర్ స్ప్రైడర్స్‌‌కు వ్యాక్సినేషన్ ఇవ్వనున్నట్టు మేయర్ గద్వాల విజయలక్ష్మి తెలిపారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని పలు వ్యాక్సినేషన్ సెంటర్లను ఆమె పరీశీలించారు.

రాష్ట్రంలో కరోనా కట్టడి లో భాగంగా ప్రభుత్వం చేపట్టిన పలు చర్యల్లో భాగంగా సూపర్ స్ప్రెడర్స్ గా గుర్తించిన పది వివిధ రంగాలకు చెందిన వర్కర్స్ కు నేటి నుండి పది రోజుల పాటు ప్రత్యేక వాక్సినేషన్ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామని గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి చెప్పారు..

నేటి నుండి ప్రారంభమైన సూపర్‌స్ప్రైడర్స్ వ్యాక్సినేషన్ ఏర్పాట్లలో భాగంగా పలు సెంటర్లను ఆమె సందర్శించారు. దేశంలోనే తెలంగాణా రాష్ట్రం ఈ విధంగా సూపర్ స్ప్రెడర్స్ ను గుర్తించి ఉచిత వాక్సినేషన్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసింది. గ్రేటర్ హైదరాబాద్ లో దాదాపు మూడు లక్షల మందికి ఈ ఉచిత వాక్సిన్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగిందని ఆమె తెలిపారు.

నగరంలోని 30 సర్కిళ్లలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేంద్రాలలో ఉదయం నుండి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించడం జరుగుతోందన్నారు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందనడానికి నిదర్శనం ఈ వాక్సిన్ కార్యక్రమమని చెప్పారు. కోవిడ్ బాధితులకు తగు వైద్య సలహాలు, ఇతర సదుపాయాలను కల్పించేందుకు జీహెచ్ఎంసీ లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసామని వివరించారు.

ఇప్పటికే హైదరాబాద్ నగరంలో దాదాపు 17 లక్షల ఇళ్లల్లో మొదటి విడత ఇంటింటి ఫీవర్ సర్వే నిర్వహించి జ్వర లక్షణాలున్న వారికి ఉచితంగా మందుల కిట్ లను అంద చేసామని చెప్పారు. రెండో విడత ఫీవర్ సర్వే కూడా ప్రారంభం అయిందని, నగరంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోను జ్వర పరీక్షలు నిర్వహించి జ్వరం ఉన్నవారికి ఉచితంగా మందుల కిట్ లను అందచేస్తున్నామని చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ లోని ముప్పై సర్కిళ్లలో కోవిద్ పాజిటివ్ బాధితులకు ప్రత్యేకంగా ఐసోలేషన్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేసామన్నారు.

దురదృష్టవశాత్తు ఎవరైనా మరణిస్తే వారికిఏవిధమైన ఆర్థిక భారం లేకుండా ఉండేందుకు ఉచిత అంబులెన్సు ఎర్పాటు చేయడమే కాకుండా, ఉచితంగా దహన సంస్కారం కూడా జరిపిస్తున్నామని చెప్పారు..మరోవైపు లాక్‌డౌన్‌లో పేద ప్రజలు ఇబ్బందులు ఎదర్కోకూడదని ప్రతి రోజు 60వేల మందికి అన్నపూర్ణ ద్వార ఉచిత భోజనాన్ని అందిస్తున్నామని చెప్పారు.
Published by:yveerash yveerash
First published:

Tags: Corona alert, GHMC, Lockdown

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు