Saidabad rape : బాధితురాలి కుటుంబానికి 10 కోట్లు.. స్పాట్‌లో షర్మిల దీక్ష.. రాజకీయ దుమారం రేపుతున్న ఘటన

Ys sharmila

Saidabad rape : సైదాబాద్ అత్యాచారంతో రాష్ట్ర రాజకీయాలు హీటెక్కాయి. బాధితురాలి కుటుంబాన్నిపరామర్శించేందుకు నేతలు సైదాబాద్‌కు క్యూ కడుతున్నారు. ఇప్పటికే పలువురు ప్రతిపక్ష నేతలు సంఘటన స్థలానికి వెళ్లగా తాజాగా షర్మిల వెళ్లి అక్కడే దీక్షకు కూర్చున్నారు.

  • Share this:
    సైదాబాద్ అత్యాచారం(saidabad rape) జరిగి ఆరు రోజులు గడుస్తున్నా.. నిందితుడు పరారీలో ఉండడంతో విషయం కాస్తా.. రాజకీయ రంగు(political) పులుముకుంటుంది. ఓ వైపు హైదరాబాద్(hyderabad) పోలీసులు నిందితుడి కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం కనిపించడం లేదు. నిందితుడి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని పోలీసులు(hyderabad police) చెబుతున్నా కేసులో ప్రధాన నిందితుడు జాడ మాత్రం తెలియడం లేదు. దీంతో నిందితుడి ఫోటోను అన్ని బార్లు, రెస్టారెట్లలో కూడా పెట్టాలని పోలీసులు నిర్ణయించడంతోపాటు పట్టించినవారికి పది లక్షల రూపాయల రివార్డును ప్రకటించారు.

    ఓ వైపు పోలీసుల ప్రయత్నాలు కొనసాగుతుండగా మరోవైపు రాజకీయా పార్టీలు సంఘటనతో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటీ సంఘటనలపై పట్టించుకోకుండా తత్సారం చేస్తుందని మండిపడుతున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలో గంజాయితో పాటు డ్రగ్స్ విచ్చల విడిగా అమ్ముడు అవుతున్నాయని, వీటిని కట్టడి చేయకపోవడం వల్లే సైదాబాద్ లాంటి సంఘటనలు జరుగుతున్నాయని టీపీసీసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(revanth reddy) తీవ్రంగా మండిపడ్డారు.

    ఇది  చదవండి : వైద్యం చేయమంటే చిన్నారి బొడ్డు కొరికాడు.. భూత వైద్యుడి ఘోరం


    మరోవైపు ఉదయం ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(komatireddy venkatreddy) సైతం సంఘటన స్థలాన్ని సందర్శించి బాధితురాలి కుటంబాన్ని పరామర్శించారు. సంఘటన తీరుపై పోలీసులు వ్యవహరించిన తీరును ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. సంఘటన జరిగిన తర్వాత కనీసం మంత్రి కేటిఆర్ గాని సీఎం కేసీఆర్‌లు గాని బాధిత కుటుంబాన్ని పరామర్శించక పోవడం పై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే ఆయన మంత్రి కేటీఆర్ పై నిప్పులు చెరిగారు. నిందితున్ని పట్టుకునేందుకు రివార్డు ప్రకటించినప్పుడు పోలీసులు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు.

    మరోవైపు వైఎస్ఆర్టీపీ అధినేత షర్మిల(ys sharmila) ఏకంగా సంఘటన స్థలం వద్ద దీక్ష చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం సంఘటనపై స్పందించే వరకు అక్కడే దీక్ష చేపడతనాని హెచ్చరిస్తూ దీక్ష చేపట్టారు. మరోవైపు బాధిత కుటుంబానికి పది కోట్ల రూపాయల పరిహారాన్ని అందించాలని ఆమె డిమాండ్ చేశారు.మంత్రి కేటీఆర్ దత్తత తీసుకున్న ప్రాంతంలోనే పరిస్థితి ఇలా ఉంటే రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని అమె ఫైర్ అయ్యారు. కేటీఆర్ దత్తత ప్రాంతమైనా ఎందుకు పరామర్శించలేదని ఆమె ప్రశ్నించారు.

    ఇది చదవండి : రాష్ట్రంలో విచ్చలవిడిగా గంజాయి.. మత్తు విక్రయాలు.. దాని ఫలితమే సైదాబాద్ ఘటన


    మొత్తం మీద సైదాబాద్ సంఘటన అటు పోలీసులతో పాటు ఇటు ప్రభుత్వ పెద్దలపై కూడా ఒత్తిడి తీసుకువస్తుంది. మరోవైపు మంత్రి కేటీఆర్ సైతం సంఘటన జరిగిన తర్వాత నిందితుడు పోలీసులు అదుపులో ఉన్నాడని చేసిన ట్వీట్ సైతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దారుణ సంఘటనలపై ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన మంత్రి వ్యవహర శైలిపై కూడా పలు విమర్శలు తలెత్తున్నాయి. దీంతో తాను చేసిన ట్వీట్‌కు బదులుగా మరో ట్వీట్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది.
    Published by:yveerash yveerash
    First published: