హోమ్ /వార్తలు /తెలంగాణ /

కూకట్‌పల్లి ఐడీఎల్‌లో పేలుడు.. ఒకరి మృతి..

కూకట్‌పల్లి ఐడీఎల్‌లో పేలుడు.. ఒకరి మృతి..

సూడాన్‌లో పేలుడు

సూడాన్‌లో పేలుడు

డిటోనేటర్ పేలుడుతో స్థానిక ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

  హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఘోర ప్రమాదం జరిగింది. ఐడీఎల్ (ఇండియన్ డిటోనేటర్స్ లిమిటెడ్) కంపెనీలో డిటోనేటర్ పేలింది. ఈ ఘటనలో ఏలేశ్వరపు వాసుదేవ శర్మ అనే వ్యక్తి చనిపోయారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ టీమ్ చేరుకొని సహాయక చర్యలు చేపట్టింది. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించారు. డిటోనేటర్ పేలుడుతో స్థానిక ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై ఆరా తీస్తున్నారు.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: BLAST, Hyderabad, Telangana

  ఉత్తమ కథలు