సిరిసిల్ల జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం

కంకర లోడుతో వస్తున్న టిప్పర్ అతి వేగంగా బైకును ఢీకొట్టింది. అంతటితో ఆగక హైదరాబాద్‌ నుంచి వేములవాడకు వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ప్రమాదంలో బైక్‌ నడుపుతున్న సత్తిరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయాడు.

Shiva Kumar Addula | news18
Updated: June 9, 2018, 1:31 PM IST
సిరిసిల్ల జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం
ప్రతీకాత్మక చిత్రం
  • News18
  • Last Updated: June 9, 2018, 1:31 PM IST
  • Share this:
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సిరిసిల్ల మండలం రగుడు గ్రామ శివారులో ఓ టిప్పర్ బీభత్సం సృష్టించింది. అతి వేగంతో అదుపుతప్పి ఓ బైక్‌ను ఢీకొట్టడంతో పాటు ఎదురుగా వస్తున్న ఆర్టీసి బస్సును ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న సత్తిరెడ్డి అనే వ్యక్తి మరణించాడు. మరో పది మందికి గాయాలయ్యాయి.

మృతుడు, అతని తల్లి బైక్‌పై సిద్ధిపేటకు వెళ్లి తిరిగి స్వగ్రామానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో రగడు గ్రామ శివారులో కంకర లోడుతో వస్తున్న టిప్పర్ అతి వేగంగా బైకును ఢీకొట్టింది. అంతటితో ఆగక హైదరాబాద్‌ నుంచి వేములవాడకు వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ప్రమాదంలో బైక్‌ నడుపుతున్న సత్తిరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయాడు. అతడి తల్లి ఎల్లవ్వ తీవ్రంగా గాయపడింది. వీరి స్వస్థలం చందుర్తి మండల బండపల్లి.

అటు ఆర్టీసీ బస్సులో వెళ్తున్నప్రయాణికులకూ గాయాలయ్యాయి. కొదరుపాకకు చెందిన రాణి, జక్కపూర్‌కు చెందిన రాములు, బస్సు డ్రైవర్, టిప్పర్ డ్రైవర్‌తో పాటు మరికొందరు తీవ్రంగా  గాయపడ్డారు. మరికొందరు బస్సు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. వీరిని సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
Published by: Shiva Kumar Addula
First published: June 8, 2018, 3:57 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading