హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Zoom Zmail: జీమెయిల్‌కు పోటీగా రానున్న Zmail.. లాంచింగ్ ఎప్పుడంటే..

Zoom Zmail: జీమెయిల్‌కు పోటీగా రానున్న Zmail.. లాంచింగ్ ఎప్పుడంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Zoom Zmail: జూమ్ ప్లాట్‌ఫామ్ సొంత ఈమెయిల్ యాప్‌తో పాటు క్యాలెండర్ సర్వీసులను పరిచయం చేయడానికి రెడీ అవుతున్నట్లు తాజాగా 'ది ఇన్ఫర్మేషన్' టెక్ రిపోర్ట్ వెల్లడించింది. ఈ రెండు సర్వీసులతో జూమ్ తన యూజర్లను నిలుపుకోవడంతో పాటు యూజర్ల సంఖ్యను పెంచుకోనుంది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్ జూమ్ (Zoom) కరోనా కాలంలో బాగా పాపులర్ అయింది. మైక్రోసాఫ్ట్, గూగుల్ రన్ చేస్తున్న ఈ-మెయిల్ సర్వీసులు, డిజిటల్ క్యాలెండర్‌ల నుంచి అపాయింట్‌మెంట్ లింక్స్‌పై క్లిక్ చేయడం ద్వారా ఈ ప్లాట్‌ఫామ్‌లో వీడియో కాన్ఫరెన్సింగ్ కాల్స్‌ (Video Conferencing Calls) చేయవచ్చు. అయితే తన ఫ్లాట్‌ఫామ్‌లో వీడియోకాల్స్‌ చేసే ప్రక్రియను మరింత సులభతరం చేసేలా తన సొంత ఈమెయిల్ యాప్ (Email App) తీసుకొచ్చేందుకు జూమ్ సిద్ధమైంది. ఈ కంపెనీ సొంత ఈమెయిల్ యాప్‌తో పాటు క్యాలెండర్ (Calendar) సర్వీసులను పరిచయం చేయడానికి రెడీ అవుతున్నట్లు తాజాగా వెల్లడించింది 'ది ఇన్ఫర్మేషన్' టెక్ రిపోర్ట్. ఈ రెండు సర్వీసులతో జూమ్ తన యూజర్లను నిలుపుకోవడంతో పాటు యూజర్ల సంఖ్యను పెంచుకోనుంది.

గూగుల్ (Google), మైక్రోసాఫ్ట్ (Microsoft) సంస్థలతో పోటీ పడడానికి జూమ్ (Zoom) జెడ్‌మెయిల్ (Zmail) అనే ఈమెయిల్ యాప్, జెడ్‌కాల్ (Zcal) అనే క్యాలెండర్ యాప్‌ను తీసుకు వచ్చే పనిలో నిమగ్నమైంది. సాధారణంగా మైక్రోసాఫ్ట్, గూగుల్ సంస్థలు వీడియో కాల్స్ చేసేందుకు అన్ని సర్వీసులను ఆఫర్ చేస్తున్నాయి. దీనివల్ల వాటిని వదిలి జూమ్ యాప్‌కి మారేందుకు యూజర్లు ఆసక్తి చూపడం లేదు.

దానికి తోడు ఆల్రెడీ ఉన్న యూజర్లు వేరే వాటికి మారే ఛాన్స్‌లు కూడా అధికంగా ఉన్నాయి. దీనివల్ల జూమ్ బిజినెస్ దెబ్బతినే అవకాశం ఉంది. అందుకే ఈ కంపెనీ తన యూజర్లు కోసం ఓన్ ఈమెయిల్ యాప్ తీసుకొస్తోంది. దీని సహాయంతో యూజర్లు ఇతర యాప్స్‌ను యూజ్ చేయాల్సిన అవసరం లేకుండా జూమ్‌ ప్రొడక్ట్స్‌లోనే వీడియో కాల్ మీటింగ్స్, కాన్ఫరెన్స్‌లు షెడ్యూల్ చేసుకోవచ్చు.

* లాంచింగ్ ఎప్పుడు?

జూమ్ ఈ ఏడాది నవంబర్‌లో జరిగే వార్షిక జూమ్‌టోపియా కాన్ఫరెన్స్‌ (Zoomtopia conference)లో Zmail, Zcal యాప్స్ ప్రకటించే అవకాశం ఉంది. ఈ యాప్స్‌ 24 నెలలుగా డెవలప్‌మెంట్ దశలో ఉన్నాయని సమాచారం. కంపెనీ ఈ ఏడాది చివర్లో Zmail సర్వీస్ లాంచ్‌ చేయొచ్చని తెలుస్తోంది. ఈ వీడియో కాన్ఫరెన్సింగ్ ప్లాట్‌ఫామ్ ఎక్కువ మందిని తన వైపు తిప్పుకోగలిగింది. అయితే భవిష్యత్తులో కూడా తనే నంబర్ వన్ పొజిషన్‌లో ఉండేందుకు ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల కొద్దీ యూజర్లు గల Gmail వంటి అతి పెద్ద సంస్థకు పోటీ ఇవ్వడానికి వంద అడుగులు వేస్తోంది.

ఇది కూడా చదవండి : గుడ్ న్యూస్... డ్రైవింగ్ లైసెన్స్ సహా 58 సేవలు ఆన్‌లైన్‌లోనే

* టాప్ ప్లేస్‌లో జీమెయిల్

నిజానికి యాహూ, రెడిఫ్ మెయిల్ వంటి ఈమెయిల్ సర్వీసులను తొక్కేసి టాప్ ప్లేస్‌కి చేరుకుంది జీమెయిల్. ఇక మైక్రోసాఫ్ట్ అవుట్‌లుక్ బిజినెస్ ఈమెయిల్స్‌కు కేరాఫ్ అడ్రస్ అయింది. జీమెయిల్‌ను మాత్రం సాధారణ యూజర్లతో పాటు బిజినెస్‌లు కూడా ఎక్కువగా యూజ్ చేస్తున్నాయి. వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్స్‌లో జూమ్‌ మొదటి స్థానంలో నిలుస్తున్నా ఇలాంటి దిగ్గజ ఈమెయిల్ సర్వీస్‌కి తన Zmail ఏపాటి పోటీ ఇస్తుందో చూడాలి.

Published by:Sridhar Reddy
First published:

Tags: GMAIL, Tech news, Zoom

ఉత్తమ కథలు