Home /News /technology /

ZOOM HAS A NEW MALWARE THREAT THAT CAN BE USED TO ATTACK YOUR PHONE ALL DETAILS HERE GH VB

Zoom App: జూమ్ యాప్ యూజర్లకు అలర్ట్.. మాల్‌వేర్‌తో ఫోన్ హ్యాక్ అయ్యే ప్రమాదం.. ఈ జాగ్రత్తలు పాటించండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

జూమ్‌లోని భద్రతా లోపం కారణంగా మొబైల్‌లోకి మాల్వేర్‌ని ఇన్‌స్టాల్ చేయడానికి హ్యాకర్లు దారి దొరికింది. దీనికి సంబంధించి యూజర్లకు ఎలాంటి మెసేజ్ అలర్ట్స్ రావు. Android, iOS, macOS, Windows, Linuxలను దృష్టిలో ఉంచుకుని భద్రతా లోపం గురించి జూమ్ నివేదించింది.

ఇంకా చదవండి ...
కరోనా (Corona) కారణంగా గత రెండేళ్ల నుంచి వీడియో కాలింగ్(Video Calling), మీటింగ్ యాప్ ‘జూమ్‌(Zoom)’ ఎంతో పాపులర్(Popular) అయింది. ప్రపంచ వ్యాప్తంగా కంపెనీలన్నీ తమ ఉద్యోగులకు లక్ష్యాలను నిర్దేశించేందుకు వీడియో కాన్ఫరెన్స్‌(Video Conference) వ్యవస్థను ఉపయోగించుకుంటున్నాయి. మెజార్టీ కంపెనీలు(Majority Companies) ఇందుకోసం జూమ్‌ యాప్‌ను(Zoom App) వాడుతున్నాయి. వీడియో కాన్ఫరెన్సింగ్ కోసం ఉపయోగించే బెస్ట్(Best) టూల్స్‌లో ఇది ఒకటి. అయితే సక్సెస్‌పుల్‌గా(Successful) రన్ అవుతున్న దీనిపై హ్యాకర్ల దృష్టి పడింది. జూమ్‌లోని భద్రతా(Security) లోపం కారణంగా మొబైల్‌లోకి మాల్వేర్‌ని ఇన్‌స్టాల్ చేయడానికి హ్యాకర్లు దారి దొరికింది. దీనికి సంబంధించి యూజర్లకు ఎలాంటి మెసేజ్ అలర్ట్స్ రావు.

Startup Layoffs: ఈ ఏడాది కూడా తగ్గని స్టార్టప్ కంపెనీల ఫండింగ్.. కానీ కంపెనీలు ఉద్యోగులను ఎందుకు తొలగిస్తున్నాయి?


Android, iOS, macOS, Windows, Linuxలను దృష్టిలో ఉంచుకుని భద్రతా లోపం గురించి జూమ్ నివేదించింది. సర్వర్ స్విచ్ అభ్యర్థన సమయంలో హోస్ట్ పేరును సరిగ్గా ధ్రువీకరించడంలో వెర్షన్ 5.10.0 విఫలమైందని, అందులో లొసుగులు ఉన్నట్లు తేలిందని జూమ్ పేర్కొంది. గూగుల్ ప్రాజెక్ట్ జీరో గ్రూప్‌లో బగ్ హంటర్ ‘ఇవాన్ ఫ్రాటిక్’ ఈ సమస్యను గుర్తించింది. ఫిబ్రవరిలో భద్రతా లోపం గురించి జూమ్‌కు అది తెలియజేసింది. ఆ తర్వాత బగ్‌ను అప్‌డేట్ చేయడంతో ఆ సమస్య ముగిసిపోయింది.

మీరు 5.10.0 కంటే ముందు వెర్షన్‌తో జూమ్ క్లయింట్‌ని ఉపయోగిస్తుంటే, వెంటనే సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేయమని కంపెనీ మిమ్మల్ని అడుగుతోంది. మాల్వేర్‌‌కు సంబంధించి ఏవైనా లింక్‌లు వస్తే క్లిక్ చేయకుండా ఇది వ్యక్తులను ముందుగానే హెచ్చరిస్తుంది. హ్యాకింగ్ సమస్యలు క్రమం తప్పకుండా తలెత్తుతూనే ఉంటాయి. ఏదైనా ప్రమాదాన్ని అడ్డుకోవడానికి కంపెనీలకు పటిష్టమైన భద్రతా యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవడం అత్యవసరం. అప్‌డేట్‌లు ఆ ప్రక్రియలో కీలకంగా పనిచేస్తాయి. ఇవి బగ్‌ను పరిష్కరించడంలో సాఫ్ట్‌వేర్‌కి సహాయపడతాయి. భవిష్యత్తులో సమస్యాత్మకంగా ఉండే ఇతర జీరో-డే విషయాల నుండి మీకు మెరుగైన భద్రతను అందిస్తాయి.

కాగా, జూమ్ యాప్ అంత సురక్షితం కాదని ఇప్పటికే భారత సైబర్‌ సెక్యూరిటీ సంస్థ (సెర్ట్‌-ఇన్‌) ప్రకటించింది. కేంద్ర హోంశాఖ కూడా రెండేళ్ల క్రితమే దీనికి సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ యాప్‌ను వాడొద్దంటూ ప్రభుత్వ శాఖలకు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.
జూమ్‌ యాప్‌లోని లొసుగుల ఆధారంగా ఉద్యోగి సమాచారం, కంపెనీ సాఫ్ట్‌ వేర్‌ అప్లికేషన్లు, రహస్యాలు, ఇతర డేటాపై హ్యాకర్లు హ్యాక్ చేసే అవకాశం ఉందని కేంద్ర హోంశాఖ తన అడ్వయిజరీలో పేర్కొంది. జూమ్‌లోని లోపాల కారణంగా హ్యాకర్లు ఎలాంటి ఆహ్వానం (మీటింగ్‌ ఐడీ) లేకుండానే కాన్ఫరెన్స్‌లో పాలుపంచుకుంటారు. ఏక కాలంలో కాన్ఫరెన్స్‌లో ఉన్న అందరు వ్యక్తుల మొబైల్‌ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లలోకి మాల్‌వేర్‌ను జొప్పించగలరని పేర్కొంది. కీలక ఫైళ్లను వారు హ్యాక్ చేసే అవకాశం ఉంది.

* తీసుకోవాల్సిన జాగ్రత్తలు
కంపెనీలు గుర్తింపు పొందిన వెండర్‌ వద్ద వీడియో కాన్ఫరెన్సింగ్‌ యాప్‌ను కొనడం ఉత్తమం. దాని వల్ల వివరాలన్నీ ఎన్‌క్రిప్ట్‌ అవుతాయి. దీంతో హ్యాకర్లు డేటాను తస్కరించడానికి అవకాశం ఉండదు. మీటింగ్‌ షెడ్యూల్‌ను ఉద్యోగులకు ఈ-మెయిల్‌ ద్వారా మాత్రమే తెలపాలి. ప్రతి ఉద్యోగికి యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ ఇవ్వాలి. అయితే మీటింగ్‌ ప్రారంభమవ్వడానికి ముందు.. ఎవరూ జాయిన్‌ కాకుండా నియంత్రించాలి. ‘వెయిటింగ్‌ రూం’ ఫీచర్‌ను ఉపయోగించుకోవాలి. దానివల్ల యాజమాన్యం ఎంచుకున్నవారినే మాత్రమే కాన్ఫరెన్స్‌లోకి ఆహ్వానించడానికి అవకాశం ఉంటుంది. మిగతావారు వెయిటింగ్‌ రూంలో ఉంటారు.

Exclusive: Modi@8: రైతులను బంగారు వ్యవసాయ రంగం వైపు నడిపిస్తున్న కేంద్రం.. న్యూస్‌18తో కేంద్ర మంత్రి తోమర్‌..


ఇన్విటేషన్ లేకుండా ఎవరైనా మీటింగ్‌లోకి వచ్చారేమో చూడాలి. అడ్మిన్‌ మినహా.. మిగతా వారికి ఫైల్‌ షేరింగ్‌ చేయవద్దు. ఉద్యోగులంతా కాన్ఫరెన్స్‌ లో జాయిన్‌ అవ్వగానే.. ‘లాక్‌ మీటింగ్‌’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. దీంతో ఇతరులు కాన్ఫరెన్స్‌లో జాయిన్‌ అవ్వడానికి అవకాశం ఉండదు. అదేవిధంగా ‘రికార్డ్‌ మీటింగ్‌’ ఆప్షన్‌ను డిజేబుల్‌ చేయాలి. మీటింగ్‌ అయిపోయాక ‘ఎండ్‌ మీటింగ్‌’ను ఎంచుకున్న తరువాతనే అడ్మిన్‌ మీటింగ్‌ నుంచి తప్పుకోవాలి.
Published by:Veera Babu
First published:

Tags: 5g technology, Bugs, Hackers, Technology, Zoom

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు