హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Zoom Escaper: జూమ్ మీటింగ్స్‌ బోర్ కొట్టేస్తున్నాయా? ఇలా చేస్తే వాటి నుంచి సులువుగా బయటపడొచ్చు..!

Zoom Escaper: జూమ్ మీటింగ్స్‌ బోర్ కొట్టేస్తున్నాయా? ఇలా చేస్తే వాటి నుంచి సులువుగా బయటపడొచ్చు..!

కరోనా తరువాత చాలా కంపెనీలు తమ ఉద్యోగులను ఇంటి నుంచే పనిచేయమని ఆదేశించాయి. వర్క్ ఫ్రం హోమ్ వల్ల ఉద్యోగుల పని విధానం చాలా వరకు మారిపోయింది. వీడియో కాన్ఫరెన్సులు, జూమ్ మీటింగ్స్ సాధారణమయ్యాయి. ఆఫీసుల్లో అయితే ఎప్పుడో ఒకసారి మీటింగ్స్ జరిగేవి. ఆ తరువాత ఎవరి పని వారు చేసుకునేవారు. కానీ వర్క్‌ ఫ్రం హోమ్ వల్ల...

ఇంకా చదవండి ...

  కరోనా తరువాత చాలా కంపెనీలు తమ ఉద్యోగులను ఇంటి నుంచే పనిచేయమని ఆదేశించాయి. వర్క్ ఫ్రం హోమ్ వల్ల ఉద్యోగుల పని విధానం చాలా వరకు మారిపోయింది. వీడియో కాన్ఫరెన్సులు, జూమ్ మీటింగ్స్ సాధారణమయ్యాయి. ఆఫీసుల్లో అయితే ఎప్పుడో ఒకసారి మీటింగ్స్ జరిగేవి. ఆ తరువాత ఎవరి పని వారు చేసుకునేవారు. కానీ వర్క్‌ ఫ్రం హోమ్ వల్ల ఉద్యోగులు క్రమం తప్పకుండా జూమ్ మీటింగ్స్‌కు హాజరవ్వాల్సి వస్తోంది. కొన్నిసార్లు సుదీర్ఘంగా సాగే వర్చువల్ సమావేశాలు విసుగు తెప్పిస్తాయి. ఇలాంటప్పుడు సరైన కారణంతో మీటింగ్ నుంచి బయటపడే ఉపాయాన్ని కనిపెట్టారు శామ్ లావిగ్నే అనే వ్యక్తి. దీనికి జూమ్ ఎస్కేపర్ అని పేరు పెట్టడం కూడా విశేషం. ఈ ప్రోగ్రాంలో నకిలీ ఆడియో ఎఫెక్ట్స్ వినిపిస్తాయి. వీటితో మీటింగ్ కి అంతరాయం కలుగుతుంది. ఈ కారణంతో సమావేశం నుంచి బయటపడవచ్చు.

  ఈ జూమ్ ఎస్కేపర్ సాఫ్ట్‌వేర్.. జూమ్ కాల్‌కు నకిలీ ఆడియో ఎఫెక్ట్స్‌ను జోడిస్తుంది. జూమ్ యాప్‌లో వీడియో మీటింగ్స్ జరుగుతున్నప్పుడు ఈ ఆడియో ఎఫెక్ట్స్‌ను ఎంచుకుంటే సమావేశానికి అంతరాయం కలుగుతుంది. పెద్దగా గాలులు వచ్చేటప్పుడు వినిపించే శబ్దాలు, పిల్లల అల్లరి, కుక్కలు మొరగడం, పెద్దవాళ్ల ఏడుపు, వాయిస్ ప్రతిధ్వనించడం... వంటి ఎన్నో ఆడియో ఎఫెక్ట్స్‌ దీంట్లో ఉన్నాయి. ఇందు వల్ల ఎప్పుడూ ఒకే సాకు కాకుండా వేర్వేరు కారణాలు చెప్పి బయటపడే వీలుంటుంది. ‘సుదీర్ఘంగా జరిగే జూమ్ మీటింగ్స్ ఉద్యోగులకు చిరాకు తెప్పిస్తాయి. ఇలాంటప్పుడు జూమ్ ఎస్కేపర్‌ యాప్‌ను అస్ర్తంగా వాడుకొని మీటింగ్ నుంచి బయటపడవచ్చు. అందరూ నమ్మే కారణాన్ని సాకుగా చూపి మీటింగ్స్ తప్పించుకోవచ్చు’ అని శామ్ తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో ట్యూటోరియల్స్ యూట్యూబ్‌లో ఎన్నో ఉన్నాయి. వీటి ద్వారా జూమ్ ఎస్కేపర్‌ను ఎలా వాడాలో తెలుసుకోవచ్చు.

  జూమ్ ఎస్కేపర్ ఎలా వాడొచ్చో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి..

  * ఉచితంగా వాడుకోవచ్చు

  జూమ్ ఎస్కేపర్‌ ప్రోగ్రాంను ఉచితంగా వాడుకోవచ్చు. కస్టమర్లు ముందు VB-ఆడియో అనే సాఫ్ట్‌వేర్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆ తరువాత జూమ్ యాప్‌లో ఆడియో ఇన్‌పుట్‌ను మైక్రోఫోన్ నుంచి VB-ఆడియోకు మారిస్తే చాలు. మీటింగ్ జరిగేటప్పుడు దీంట్లో ఉంటే ఎఫెక్ట్స్‌ను ఎంచుకుంటే.. సమావేశంలో పొల్గొంటున్న వారికి ఫేక్ ఆడియో వినిపిస్తుంది. దీంతో పాటు జూమ్ డిలీటర్ అనే మరో ప్రోగ్రాంను కూడా శామ్ తయారు చేశారు. ఇది కంప్యూటర్లో జూమ్ యాప్‌ను ఆటోమేటిగ్గా డిలీట్ చేస్తుంది. అయితే దీన్ని ఉపయోగించడం వల్ల మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంటుంది.

  ఎప్పుడైనా మీకు అంతగా అవసరం లేని విషయం గురించి చర్చ జరుగుతూ అది మిమ్మల్ని బోర్ కొట్టిస్తుంటే దీన్ని ఉపయోగించండి. అయితే ముఖ్యమైన మీటింగ్స్‌కి ఉపయోగించి మధ్యలో బయటకు వచ్చేస్తే ఆ తర్వాత మీకే ఇబ్బంది ఎదురవ్వచ్చు ఆలోచించండి..

  First published:

  ఉత్తమ కథలు