హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Zoom App: మాది ‘మేడిన్ చైనా’ కాదు...డేటా సురక్షితమన్న జూమ్

Zoom App: మాది ‘మేడిన్ చైనా’ కాదు...డేటా సురక్షితమన్న జూమ్

Zoom App | తమది చైనాకు చెందిన సంస్థ కాదని జూమ్ టెలికమ్యునికేషన్స్ భారత విభాగం హెడ్ సమీర్ రాజె చెప్పుకొచ్చారు. జూమ్ అమెరికాకు చెందిన కంపెనీ...నాస్‌డాక్‌లో లిస్ట్ అయ్యిందని చెప్పారు.

    లాక్‌డౌన్ నేపథ్యంలో పలు ఆఫీసులు, విద్యా సంస్థల్లో వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్ - జూమ్‌ను బాగా వినియోగిస్తున్నారు. కోట్లాది మంది ఈ యాప్‌ను వాడుతుండటంతో ఆ సంస్థ భారీ లాభాలు ఆర్జిస్తోంది. దీంతో జూమ్ కంపెనీ మార్కెట్ విలువ గత కొన్ని మాసాల్లోనే ఎన్నో రెట్లు పెరిగింది. అయితే జూమ్ యాప్‌లో డేటా రక్షణపై కేంద్ర హోం శాఖ సందేహాలు వ్యక్తంచేయడంతో కొందరు దానికి దూరమయ్యారు. అటు సరిహద్దులో భారత్-చైనా సేనల మధ్య ఘర్షణల నేపథ్యంలో ‘బాయ్‌కాట్ చైనా’ నినాదం పుంజుకోవడంతో ఆ ప్రభావం జూమ్ యాప్‌పై పడింది. దేశ సమగ్రత, సమైక్యతకు విఘాతం కలిగిస్తున్నాయంటూ టిక్ టాక్ సహా చైనాకు చెందిన 59 యాప్‌లను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. దీంతో చైనాకు చెందిన జూమ్ యాప్‌ను కూడా నిషేధించాలన్న డిమాండ్ సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తోంది. దీంతో చాలా మంది జూమ్‌ను వీడి గూగుల్ మీట్, ఇటీవల విడుదలైన జియోమీట్‌ను వాడుతున్నారు.

    ఈ నేపథ్యంలో తమది చైనాకు చెందిన సంస్థ కాదని జూమ్ టెలికమ్యునికేషన్స్ భారత విభాగం హెడ్ సమీర్ రాజె చెప్పుకొచ్చారు. జూమ్ అమెరికాకు చెందిన కంపెనీ...నాస్‌డాక్‌లో లిస్ట్ అయ్యిందని చెప్పారు. కాలిఫోర్నియాలోని శాన్‌జోన్స్‌లో దీన్ని స్థాపించినట్లు వివరించారు. అక్కడే ప్రధాన కార్యాలయం ఉన్నట్లు వివరించారు. తమది ‘మేడిన్ చైనా’ అంటూ అపోహలు రావడం తమను బాధిస్తోందని..కానీ నిజాలు వేరని పేర్కొన్నారు. కొత్త వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్స్ వస్తుండటంపై స్పందిస్తూ...పోటీ సంస్థలకు వాటి వ్యూహాలు వాటికి ఉంటాయని, దీనిపై ఆందోళన అవసరం లేదని తన టీమ్‌కి చెప్పినట్లు వెల్లడించారు.

    కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖతో తాము టచ్‌లో ఉన్నట్లు ఆయన చెప్పారు. జూమ్ డేటా సెంటర్లు ఎక్కడెక్కడ ఉన్నాయి? యాప్ ఎలా పనిచేస్తుంది? తదితర సాంకేతిక అంశాలను ప్రభుత్వానికి అందజేసినట్లు తెలిపారు. అయితే డేటాను ఏ దేశంతోనూ పంచుకోవడం లేదని స్పష్టంచేశారు. డేటా పూర్తిగా సురక్షితమని, ఇందులో రాజీ ప్రసక్తే లేదన్నారు.  భారత్‌లో తమకు రెండు డేటా సెంటర్లు ఉన్నట్లు సమీర్ రాజె తెలిపారు.

    First published:

    ఉత్తమ కథలు