హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Zomato: జొమాటో ట్వీట్‌కు అదిరిపోయే రిప్లై ఇచ్చిన అమెజాన్, యూట్యూబ్

Zomato: జొమాటో ట్వీట్‌కు అదిరిపోయే రిప్లై ఇచ్చిన అమెజాన్, యూట్యూబ్

ఇటీవల కేంద్రం నుంచి వచ్చిన మార్గదర్శకాల తర్వాత మెల్లమెల్లగా జనం ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ మీద ఆధారపడుతున్నారు. ఏదో కొంచెం వ్యాపారం నడుస్తుందనుకుంటే జొమాటో, స్విగ్గీలాంటి యాప్స్ కమిషన్ పేరిట తమకు వచ్చే లాభాలను కూడా హరించేస్తున్నాయని రెస్టారెంట్స్ ఓనర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవల కేంద్రం నుంచి వచ్చిన మార్గదర్శకాల తర్వాత మెల్లమెల్లగా జనం ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ మీద ఆధారపడుతున్నారు. ఏదో కొంచెం వ్యాపారం నడుస్తుందనుకుంటే జొమాటో, స్విగ్గీలాంటి యాప్స్ కమిషన్ పేరిట తమకు వచ్చే లాభాలను కూడా హరించేస్తున్నాయని రెస్టారెంట్స్ ఓనర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Zomato | వారం క్రితం తమ కస్టమర్ల కోసం చేసిన ట్వీట్‌ను పెద్దపెద్ద కంపెనీలు కాపీ చేసి వాడుకోవడం జొమాటోకు షాకిచ్చింది.

వారం క్రితం జొమాటో పోస్ట్ చేసిన ఓ ట్వీట్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంది. "గయ్స్... కభీ కభీ ఘర్ కా ఖానా భీ ఖా లేనా చాహియే" అంటూ ట్వీట్ చేసింది జొమాటో. అంటే అప్పుడప్పుడూ ఇంటి భోజనం కూడా తింటూ ఉండండి అని అర్థం. జొమాటో ఇండియాలో అతిపెద్ద ఫుడ్ డెలివరింగ్ కంపెనీల్లో ఒకటని తెలిసిందే. అలాంటి కంపెనీ కేవలం వ్యాపారకోణంలోనే కాకుండా... ఇంటి భోజనం ఆరోగ్యానికి మంచిదంటూ యూజర్లకు పరోక్షంగా చెప్పింది. నెటిజన్లను ఆకట్టుకున్న ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. ఆ ట్వీట్‌కు వచ్చిన ఫన్నీ రిప్లైస్ ఇవే.

ఇక్కడివరకు బాగానే ఉంది. జొమాటోకు రిప్లై ఇచ్చింది యూజర్లు మాత్రమే కాదు. అమెజాన్, యూట్యూబ్, గానా, మొబీక్విక్ లాంటి కంపెనీలు కూడా జొమాటో ట్వీట్‌కు తమదైన స్టైల్‌లో రిప్లై ఇచ్చాయి. జొమాటో ట్వీట్‌ను కాపీ చేసి తమ యూజర్లను టార్గెట్ చేశాయి. "రాత్రి 3 గంటలకు ఫోన్ పక్కకు పెట్టండి" అని యూట్యూబ్ సలహా ఇస్తే, అప్పుడప్పుడూ కేబుల్ టీవీ కూడా చూడండి అంటూ అమెజాన్ ప్రైమ్ వీడియో ట్వీట్ చేసింది. ఆ ట్వీట్స్ ఇవే.

వారం క్రితం తమ కస్టమర్ల కోసం చేసిన ట్వీట్‌ను పెద్దపెద్ద కంపెనీలు కాపీ చేసి వాడుకోవడం జొమాటోకు షాకిచ్చింది. ఆ కంపెనీలను టార్గెట్ చేస్తూ "అప్పుడప్పుడు మంచి ట్వీట్స్ ఆలోచించండి" అని సెటైర్ వేసింది జొమాటో.

మొత్తానికి జొమాటో ట్వీట్ వైరల్‌గా మారింది. ఈ ట్వీట్స్ అన్నీ యూజర్లను ఆకట్టుకున్నాయి.

Redmi K20 Pro: షావోమీ నుంచి కొత్త ఫోన్స్... రెడ్‌మీ కే20, కే 20 ప్రో

ఇవి కూడా చదవండి:

SBI: ఎస్‌బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్... రిజిస్టర్ చేసుకోండిలా

UPI Apps: గూగుల్ పే, ఫోన్‌పే లావాదేవీల్లో ఈ జాగ్రత్తలు పాటించండి

WhatsApp: వాట్సప్‌లో వచ్చేస్తున్న కొత్త ఫీచర్స్ ఇవే...

First published:

Tags: Amazon, Amazon prime, Twitter, Youtube, Zomato

ఉత్తమ కథలు