హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Zomato: జొమాటో ఫుడ్‌డెలివరీ పార్ట్నర్స్‌ ర్యాష్‌ డ్రైవింగ్‌ చేస్తున్నారా..? అయితే ఇలా ఫిర్యాదు చేయండి..

Zomato: జొమాటో ఫుడ్‌డెలివరీ పార్ట్నర్స్‌ ర్యాష్‌ డ్రైవింగ్‌ చేస్తున్నారా..? అయితే ఇలా ఫిర్యాదు చేయండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో కీలక నిర్ణయం తీసుకొంది. డెలివరీ బ్యాగులపై హాట్‌లైన్ ఫోన్ నంబర్‌ను అందిస్తోంది. ఈ నంబర్‌కు డయల్ చేసి, ఎవరైనా డెలివరీ పార్ట్నర్‌ డ్రైవింగ్‌పై ఫిర్యాదు చేయవచ్చు.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

ప్రస్తుతం ఆన్‌లైన్‌లో ఫుడ్‌ ఆర్డర్ చేసుకునే వారి సంఖ్య పెరిగింది. నగరాల్లో ఫుడ్‌ డెలివరీకి సంబంధించిన కంపెనీ బ్యాగులతో బైక్‌లపై ప్రయాణించే డెలివరీ పార్ట్నర్స్‌ తరచూ కనిపిస్తుంటారు. డెలివరీ సకాలంలో అందించేందుకు కొన్ని సందర్భాల్లో వేగంగా దూసుకెళ్తుంటారు. అయితే ఇలాంటి వారు ప్రమాదకరంగా డెలివరీ డ్రైవ్‌ చేయకుండా ఉండేందుకు ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో చర్యలు తీసుకొంది. డెలివరీ బ్యాగులపై హాట్‌లైన్ ఫోన్ నంబర్‌ను అందిస్తోంది. ఈ నంబర్‌కు డయల్ చేసి, ఎవరైనా డెలివరీ పార్ట్నర్‌ డ్రైవింగ్‌పై ఫిర్యాదు చేయవచ్చు. ఈ అప్‌డేట్‌కు సంబంధించి బుధవారం జొమాటో వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఆ వివరాలు తెలుసుకుందాం.

ఫోన్‌ నంబర్‌తో డెలివరీ బ్యాగులు

జొమాటో తన డెలివరీ పార్ట్నర్స్‌ ర్యాష్ డ్రైవింగ్‌ గురించి ఫిర్యాదు చేయడానికి హాట్‌లైన్ ఫోన్ నంబర్‌తో డెలివరీ బ్యాగ్‌లను విడుదల చేస్తున్నట్లు దీపిందర్‌ గోయల్‌ స్పష్టం చేశారు. అ ఆగస్టులో జరిగిన కంపెనీ వార్షిక సర్వసభ్య సమావేశంలో దీపిందర్ గోయల్ మాట్లాడుతూ.. జొమాటో డెలివరీ పార్ట్నర్స్‌కు ఇచ్చే బ్యాగులపై ఫోన్ నంబర్‌ను ప్రింట్ చేస్తుందని, ఎవరైనా అతివేగంగా డ్రైవ్‌ చేస్తున్నట్లు అనిపిస్తే ఈ నంబర్‌కు కాల్ చేసి రిపోర్ట్ చేయవచ్చని చెప్పారు. అప్పట్లో తీసుకున్న ఈ నిర్ణయంతో, ఇప్పుడు హాట్‌లైన్ ఫోన్ నంబర్‌తో డెలివరీ బ్యాగ్‌లను విడుదల చేయడం ప్రారంభించినట్లు ఆయన ట్విట్టర్‌లో ఒక పోస్ట్‌ చేశారు.

ఆన్‌టైమ్‌ డెలివరీలను ప్రోత్సహించం

ఆన్‌టైమ్‌ డెలివరీలకు ఎలాంటి ప్రోత్సాహకాలను కంపెనీ అందించదని, ఈ విషయం వినియోగదారులు గుర్తించాలని దీపిందర్‌ తెలిపారు. ఆలస్యంగా ఫుడ్‌ డెలివరీ చేసినా డెలివరీ పార్ట్నర్‌పై ఎలాంటి చర్యలు ఉండవని చెప్పారు. ఎక్స్‌పెక్టెడ్‌ డెలివరీ టైంను కూడా డెలివరీ పార్ట్నర్‌కు తెలియజేయమని, ఎవరైనా వేగంగా ప్రయాణిస్తుంటే, అది వారి సొంత నిర్ణయం మేరకు చేస్తున్నట్లేనని భావించాలని సూచించారు. రోడ్లపై ట్రాఫిక్‌ను మరింత భద్రతగా మార్చడంలో సహకరించాలని కోరారు.

డెలివరీ పార్ట్నర్స్‌ భద్రత ప్రధానం

Zomato ఈ ఏడాది మార్చిలో ఇన్‌స్టాంట్‌10 నిమిషాల డెలివరీని ప్రారంభించే యోచనలో ఉన్నట్లు ప్రకటించింది. ఆ సమయంలో దాని డెలివరీ పార్ట్నర్స్‌ రహదారి భద్రత, సకాలంలో డెలివరీ చేయడంలో ఒత్తిడి వంటివి ఎదుర్కోవాల్సి వస్తుందని విమర్శలు వచ్చాయి. అయితే ఫుడ్‌ను వేగంగా డెలివరీ చేయడానికి కంపెనీ తన డెలివరీ పార్ట్నర్స్‌పై ఎలాంటి ఒత్తిడి తీసుకురావడం లేదని గోయల్ చెప్పారు. అధిక డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన డెన్స్‌ ఫినిషింగ్ స్టేషన్ల నెట్‌వర్క్‌ ద్వారా తక్కువ సమయంలో ఫుడ్‌ డెలివరీ చేస్తామని వివరించారు. డెలివరీ పార్ట్నర్స్‌ భద్రతకు జొమాటో ఎప్పుడూ ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు.

మూడు రంగాలపై దృష్టి

ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్ జొమాటో ఫుడ్ ఆర్డర్, డెలివరీకి సంబంధించిన మూడు కీలక రంగాలపై దృష్టిని పెట్టాలని నిర్ణయించుకున్నట్లు కంపెనీ ఛైర్మన్ కౌశిక్ దత్తా ఆగస్టు ప్రారంభంలో తెలిపారు. జొమాటో ఫుడ్ ఆర్డర్, డెలివరీ, హైపర్‌ప్యూర్, క్విక్‌ కామర్స్‌కు ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు. ఇప్పటి నుంచి పదేళ్ల తర్వాత అర్ధవంతంగా పెద్ద వ్యాపారాలుగా మారే అవకాశం ఉన్న ప్రాంతాలపై మాత్రమే దృష్టి పెట్టే ఆలోచన ఉందన్నారు. కోవిడ్-19 సమయంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఇంధన ధరలు వంటి అనేక సవాళ్లను ఎదుర్కొన్నట్లు చెప్పారు. అడ్జస్టెడ్‌ EBITDA బర్న్‌ని కంట్రోల్‌ చేయడం ద్వారా బలమైన టాప్ లైన్ వృద్ధిని సాధించగలిగామని అన్నారు.

First published:

Tags: Online food delivery, Zomato

ఉత్తమ కథలు