IPL 2019: జొమాటో ప్రీమియర్ లీగ్... 30 శాతం క్యాష్‌బ్యాక్, 40 శాతం డిస్కౌంట్

Zomato Premier League | ప్రతీ రోజూ జరిగే మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారో అంచనా వేసే క్రికెట్ ఫ్యాన్స్‌కు అదనంగా 30 శాతం క్యాష్‌బ్యాక్, 40 శాతం డిస్కౌంట్ లభిస్తుంది.

news18-telugu
Updated: April 19, 2019, 2:30 PM IST
IPL 2019: జొమాటో ప్రీమియర్ లీగ్... 30 శాతం క్యాష్‌బ్యాక్, 40 శాతం డిస్కౌంట్
IPL 2019: జొమాటో ప్రీమియర్ లీగ్... 30 శాతం క్యాష్‌బ్యాక్, 40 శాతం డిస్కౌంట్ (image: Zomato/twitter)
news18-telugu
Updated: April 19, 2019, 2:30 PM IST
ఇండియన్ ప్రీమియర్ లీగ్ సందర్భంగా క్రికెట్ ఫ్యాన్స్‌పై ఆఫర్ల వర్షం కురుస్తోంది. 'స్విగ్గీ సిక్సెస్' పేరుతో స్విగ్గీ ఆఫర్లు ప్రకటిస్తే... జొమాటో కూడా జొమాటో ప్రీమియర్ లీగ్-ZPL నిర్వహిస్తోంది. ఐపీఎల్‌లో ఎనిమిది టీమ్స్‌కు జొమాటో ఫుడ్ డెలివరీ పార్ట్‌నర్‌గా ఉంది. క్రికెట్ ఫ్యాన్స్ కోసం జొమాటో ప్రీమియర్ లీగ్ పేరుతో ఇన్-యాప్ గేమ్ ప్రారంభించింది. ప్రతీ రోజూ జరిగే మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారో అంచనా వేసే క్రికెట్ ఫ్యాన్స్‌కు అదనంగా 30 శాతం క్యాష్‌బ్యాక్, 40 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. గత మూడు వారాల్లో 40 లక్షల మంది ఈ గేమ్ ఆడారని కంపెనీ చెబుతోంది. విజేతలు ఇప్పటి వరకు డిస్కౌంట్, క్యాష్‌బ్యాక్ రూపంలో రూ.8 కోట్లు ఆదా చేశారని అంచనా. జొమాటో ప్రీమియర్ లీగ్ కోసం 50,000 రెస్టారెంట్లతో ఒప్పందం కుదుర్చుకుంది కంపెనీ.


ఏప్రిల్ 15న ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ మధ్య జరిగిన ఒక్క మ్యాచ్‌పైనే 60,000 ప్రెడిక్షన్స్ వచ్చాయి. జొమాటో ప్రీమియర్ లీగ్‌లో ఢిల్లీకి చెందిన క్రికెట్ ఫ్యాన్స్ యాక్టీవ్‌గా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఒక్క ఢిల్లీ నుంచే 10 లక్షల ప్రెడిక్షన్స్ రావడం విశేషం. జొమాటో ప్రీమియర్ లీగ్ మే 12 వరకు ఉంటుంది. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ సూపర్ కింగ్స్ మ్యాచ్‌ల పాసులు గెలుచుకునేందుకు సోషల్ మీడియాలో కాంటెస్ట్‌లు నిర్వహిస్తోంది జొమాటో.



తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఇక్కడ చెక్ చేసుకోండి
Loading...

ఇవి కూడా చదవండి:

IPL 2019: బ్యాట్స్‌మెన్ సిక్స్ కొడితే స్విగ్గీలో మీకు 60% డిస్కౌంట్

IPL 2019: క్రికెట్ ఫ్యాన్స్‌కు BSNL కొత్త ప్లాన్స్

IPL 2019: హాట్‌స్టార్‌లో క్రికెట్ చూస్తూ... ఫుడ్ ఆర్డర్ చేయొచ్చు
First published: April 19, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...