Zomato News | జొమాటో వాడుతున్నారా? జొమాటో ద్వారా ఎక్కువగా ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్ ఇస్తూ ఉంటారా? అలాగే బిల్లు కూడా ఆన్‌లైన్‌లోనే పే చేస్తున్నారా? అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే. జొమాటోలో (Zomato) కొత్త ఫుడ్ (Food) డెలివరీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఏంటి ఈ స్కామ్? ఎలా జరుగుతోంది? ఎలా వెలుగులోకి వచ్చింది? అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.
విజయ్ సేథి అనే ఒక ఎంట్రప్రెన్యూర్ జొమాటోలో ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ చేశారు. బర్గర్ ఆర్డర్ ఇచ్చారు. 30 నుంచి 40 నిమిషాల్లో ఇచ్చిన ఆర్డర్ ఇంటికి వచ్చింది. జొమాటో డెలివరీ బాయ్ ఫుడ్ డెలివరీ చేసేటప్పుడు ఆన్‌లైన్ పేమెంట్ చేయవద్దని చెప్పినట్లు వినయ్ తన లింక్డ్ ఇన్ పోస్ట్‌లో తెలియజేశారు. ఈ పోస్ట్ ప్రకారం.. మళ్లీ ఫుడ్ డెలివరీ చేసేటప్పుడు ఆన్‌లైన్‌లో డబ్బులు కట్టొద్దు. క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల తక్కువ ధరకే ఫుడ్ పొందొచ్చు. రూ. 1000 విలువైన ఫుడ్ కేవలం రూ.200కే వస్తుంది.
ఈ బైక్ క్రేజ్ వేరే లెవెల్.. ప్రతి నెలా 2 లక్షల మందికి పైగా కొంటున్నారు!
ఇక్కడ డెలివరీ బాయ్‌కు రూ.200 నుంచి రూ. 300 చెల్లించాలి. అప్పుడు వాళ్లు డెలివరీ తీసుకోలేదని జొమాటోకు తెలియజేస్తారు. కానీ ఆ ఫుడ్‌ను కస్టమర్‌కు డెలివరీ చేస్తారు. ఇలా రూ.200కే రూ.1000 విలువైన ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చని డెలివరీ బాయ్ పేర్కొన్నట్లు వినయ్ తెలిపారు. ఇలా జొమాటోలో ఫుడ్ డెలివరీ స్కామ్ జరుగుతోంది. ఈ విషయం జొమాటో సీఈవోకు కూడా తెలిసే ఉంటుందని ఆయన పేర్కొన్నారు. అలాగే జొమాటో సీఈవో దీపేంద్ర గోయల్ ఈ అంశంపై స్పందించారు. లూప్ హోల్స్‌ను సరిచేసే ప్రయత్నం చేస్తున్నామని వెల్లడించారు.
ఇక ఈ నెలలో బ్యాంకులు పని చేసేది 3 రోజులే.. 5 రోజులు సెలవులు!
ఇలాంటి ఘటనలు జరగడం ఇదే కొత్తమీ కాదు. జొమాటో గతంలో కూడా ఆన్‌లైన్ పేమెంట్ అంశంపై విమర్శలు ఎదుర్కొంది. ఆన్‌లైన్ ఆర్డర్ల బిల్లు పెంపు అంశంపై విమర్శలు వచ్చాయి. ఆఫ్‌లైన్‌లో కన్నా ఆన్‌లైన్‌లో బిల్లు పేమెంట్‌పై చాలా వ్యత్యాసం ఉందని గతంలో వార్తలు వచ్చాయి. అంటే ఆఫ్‌లైన్‌లో ఫుడ్ ధరల కన్నా ఆన్‌లైన్‌లో జొమాటో ఎక్కువ వసూలు చేస్తోందని చాలా మంది విమర్శలు చేశారు. దాదాపు ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ బిల్లు తేడా 34 శాతం వరకు ఉందని ఒక యూజర్ గతంలో వెల్లడించారు. ఇప్పుడు మళ్లీ మరో వివాదం తెర పైకి వచ్చింది. దీంతో ఇప్పుడు జొమాటో ఇలాంటి స్కామ్స్ జరగకుండా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Food delivery, Latest offers, Scams, Swiggy, Zomato