Zomato Cricket Cup: క్రికెట్ మ్యాచ్‌ ఫలితాన్ని కరెక్ట్‌గా చెప్తే 100% క్యాష్‌బ్యాక్

Zomato Cricket Cup | ఎవరైతే మూడు ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్తారో వారికి 100 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.

news18-telugu
Updated: June 3, 2019, 11:06 AM IST
Zomato Cricket Cup: క్రికెట్ మ్యాచ్‌ ఫలితాన్ని కరెక్ట్‌గా చెప్తే 100% క్యాష్‌బ్యాక్
Zomato Cricket Cup: క్రికెట్ మ్యాచ్‌ ఫలితాన్ని కరెక్ట్‌గా చెప్తే 100% క్యాష్‌బ్యాక్ (image: Zomato)
news18-telugu
Updated: June 3, 2019, 11:06 AM IST
కొద్దిరోజుల క్రితం ఇండియన్ ప్రీమియర్ లీగ్ సందర్భంగా 'జొమాటో ప్రీమియర్ లీగ్ ' పేరుతో 'ప్రెడిక్ట్ & విన్' కాంటెస్ట్ నిర్వహించింది జొమాటో. ఇప్పుడు అవే ఆఫర్లను ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ సందర్భంగా తీసుకొచ్చింది. 'జొమాటో క్రికెట్ కప్' పేరుతో కాంటెస్ట్ ప్రారంభమైంది. మీరు కరెక్ట్‌గా ప్రెడిక్ట్ చేస్తే 100 శాతం క్యాష్ బ్యాక్ గెలుచుకోవచ్చు. ఈ కాంటెస్ట్ కోసం మొత్తం 60,000 రెస్టారెంట్లతో ఒప్పందం కుదుర్చుకుంది జొమాటో. ఐపీఎల్ సందర్భంగా 250 పైగా నగరాల నుంచి 1.8 కోట్ల ప్రెడిక్షన్స్ వచ్చాయి. ఇక వరల్డ్ కప్ సీజన్‌లో అంతకంటే ఎక్కువ క్రేజ్ ఉంటుందని భావిస్తోంది జొమాటో.

ICC Cricket World Cup 2019, Zomato Cricket Cup, Zomato predict and win, Zomato 100 per cent cashback, zomato world cup offer, rules of zomato cricket cup, zomato offer for cricket world cup, how to play zomato cricket cup, ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ 2019, జొమాటో క్రికెట్ కప్, జొమాటో ప్రెడిక్ట్ అండ్ విన్, జొమాటో 100 శాతం క్యాష్‌బ్యాక్, జొమాటో వరల్డ్ కప్ ఆఫర్స్, జొమాటో క్రికెట్ కప్ ఆఫర్స్, జొమాటో క్రికెట్ ఆఫర్స్, జొమాటో డిస్కౌంట్ ఆఫర్స్
image: Zomato

Zomato Cricket Cup: కాంటెస్ట్‌లో ఎలా పాల్గొనాలి?



మీరు జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేసే సమయంలోనే కాంటెస్ట్ వివరాలు కనిపిస్తాయి. ఆ రోజు మ్యాచ్‌కు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. ఎవరైతే మూడు ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్తారో వారికి 100 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఒక ప్రశ్న మాత్రమే కరెక్ట్ చెప్తే 25 శాతం, రెండు ప్రశ్నలకై సరైన సమాధనాలు చెప్తే 50 శాతం క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. క్యాష్‌బ్యాక్ గరిష్టంగా రూ.150 మాత్రమే. దాంతో పాటు పేటీఎం వ్యాలెట్‌లోకి అదనంగా రూ.15 బోనస్ లభిస్తుంది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లకు రాత్రి 8.30 గంటల వరకు ప్రెడిక్ట్ చేయొచ్చు. సాయంత్రం 6 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లకు అర్థరాత్రి 11.30 గంటల వరకు ప్రెడిక్ట్ చేయొచ్చు. మ్యాచ్ పూర్తైన 4 గంటల్లో మీ క్యాష్‌బ్యాక్ క్రెడిట్ అవుతుంది. ఇవాళ్టి మ్యాచ్ ప్రెడిక్ట్ చేసే అవకాశం లభించకపోతే రేపటి మ్యాచ్‌ను ప్రెడిక్ట్ చేయొచ్చు.



Black Shark 2: గేమింగ్ ఫోన్ 'బ్లాక్ షార్క్ 2' ఎలా ఉందో చూశారా?


ఇవి కూడా చదవండి:
Loading...
Railway Jobs: డిగ్రీ ఉందా? ఎంఎస్ ఆఫీస్ వచ్చా? రైల్వేలో 95 ఉద్యోగాలు...

PAN Card: ఏఏ ట్రాన్సాక్షన్స్‌కి పాన్ కార్డు అవసరమో తెలుసా?

Credit Card: క్రెడిట్ కార్డ్ వాడట్లేదా? క్యాన్సిల్ చేయండి ఇలా
First published: June 3, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...