హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Zomato: జొమాటో వాడుతున్నారా? రూ.3,00,000 రివార్డు గెలుచుకోవచ్చు ఇలా

Zomato: జొమాటో వాడుతున్నారా? రూ.3,00,000 రివార్డు గెలుచుకోవచ్చు ఇలా

Zomato | మీరు జొమాటో యాప్ వాడుతున్నారా? జొమాటో వెబ్‌సైట్ ట్రై చేస్తున్నారా? మీకు టెక్నికల్ నాలెడ్జ్ ఉందా? అయితే రూ.3,00,000 వరకు రివార్డ్ గెలుచుకోవచ్చు. ఎలాగో తెలుసుకోండి.

Zomato | మీరు జొమాటో యాప్ వాడుతున్నారా? జొమాటో వెబ్‌సైట్ ట్రై చేస్తున్నారా? మీకు టెక్నికల్ నాలెడ్జ్ ఉందా? అయితే రూ.3,00,000 వరకు రివార్డ్ గెలుచుకోవచ్చు. ఎలాగో తెలుసుకోండి.

Zomato | మీరు జొమాటో యాప్ వాడుతున్నారా? జొమాటో వెబ్‌సైట్ ట్రై చేస్తున్నారా? మీకు టెక్నికల్ నాలెడ్జ్ ఉందా? అయితే రూ.3,00,000 వరకు రివార్డ్ గెలుచుకోవచ్చు. ఎలాగో తెలుసుకోండి.

  టెక్నాలజీ రిసెర్చర్లు, ఎథికల్ హ్యాకర్లకు ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జోమాటో బంపర్ ఆఫర్ ప్రకటించింది. తమ ప్లాట్‌ఫాంకు నష్టం చేకూర్చే ఏదైనా బగ్‌ను కనుగొన్న వారికి ఇస్తున్న బహుమతిని పెంచింది. దీనికి సంబంధించిన వివరాలను సంస్థ జూలై 8న అధికారికంగా వెల్లడించింది. ఇప్పుడు బగ్ బౌంటీ ప్రోగ్రామ్‌లో భాగంగా సంస్థకు చెందిన యాప్ లేదా వెబ్‌సైట్‌లో ఏదైనా హానికరమైన బగ్‌ను కనుగొన్న వారు అత్యధికంగా 4,000 డాలర్లు (దాదాపు రూ.3 లక్షలు) గెలుచుకోవచ్చు. "జోమాటో బగ్ బౌంటీ ప్రోగ్రామ్.. మా ప్లాట్‌ఫాం సెక్యూరిటీ వ్యవస్థలో కీలక భాగం. మేం ఇస్తున్న ఈ ఆఫర్ హ్యాకర్ కమ్యూనిటీని మరింత ప్రేరేపిస్తుందని ఆశిస్తున్నాం. ఇప్పటివరకు ఈ ప్రోగ్రాం కోసం మీరు చేసిన కృషికి ధన్యవాదాలు. మీరు అందించే బగ్‌ రిపోర్టుల కోసం ఎదురుచూస్తున్నాం" అని జొమాటో ప్రకటించింది. ఈ ప్రకటనను సంస్థకు చెందిన సెక్యూరిటీ ఇంజనీర్ యష్ సోధా సైతం ట్వీట్ చేశారు.

  Zomato IPO: జొమాటో ఐపీఓ డేట్ ఫిక్స్... గ్రే మార్కెట్ ప్రీమియం ఎంతంటే

  Amazon Prime Day Sale: బీ రెడీ... భారీ డిస్కౌంట్స్, ఆఫర్‌తో అమెజాన్ ప్రైమ్ డే సేల్ వస్తోంది

  కంప్యూటర్ ప్రోగ్రాం లేదా సిస్టంలో లోపాలను బగ్స్ అంటారు. టెక్నాలజీ ఆధారంగా పనిచేసే ప్లాట్‌ఫాంలలో అనుకోకుండా కొన్ని రకాల సెక్యూరిటీ సమస్యలు తలెత్తుతాయి. వీటిని సంస్థల ఇంజనీర్లు ఎప్పటికప్పుడు గుర్తిస్తూ సరిచేస్తుంటారు. బయట నుంచి ఇలాంటి బగ్‌ను గుర్తించి, సంబంధిత సంస్థకు సమాచారం అందిస్తే.. వాటి ద్వారా తమ ప్లాట్‌ఫాంకు నష్టం వాటిల్లకుండా కంపెనీలు జాగ్రత్త పడతాయి. ఇలా తమకు సాయం చేసిన వారిని సంస్థలు నగదు బహుమతితో సత్కరిస్తాయి. తాజాగా ఈ బహుమతిని జొమాటో పెంచింది.

  Gold Purity: మీ బంగారు నగల్లో నకిలీ గోల్డ్ ఉందా? ఇంట్లోనే చెక్ చేయండి ఇలా

  Realme 5G Smartphone: రియల్‌మీ సంచలనం... రూ.10,000 లోపే 5జీ స్మార్ట్‌ఫోన్

  బగ్‌లు హాని చేసే తీవ్రత ఆధారంగా.. వాటిని కనుగొన్న వారికి జొమాటో రివార్డు అందిస్తుంది. ఇందుకు ప్రత్యేకంగా కామన్ వల్నరబిలిటీ స్కోరింగ్ సిస్టమ్‌ (CVSS)ను ఏర్పాటు చేసింది. CVSS స్కోరు ఆధారంగా తుది బహుమతి విలువను సంస్థ నిర్ధారిస్తుంది. తీవ్రమైన హాని కలిగించే బగ్‌ను గుర్తించిన వారికి CVSS స్కోర్ 10గా ఉంటుంది. వీరు 4,000 డాలర్లు గెల్చుకోవచ్చు. ఈ స్కోరు 9.5గా ఉంటే.. రివార్డు 3,000 డాలర్ల వరకు ఉంటుంది.

  స్కోర్ తగ్గే కొద్దీ.. నగదు బహుమతి సైతం తగ్గుతుంది. ఎంత స్కోర్‌కు ఎంత మొత్తంలో నగదు బహుమతి ఇస్తారనే వివరాలను సోధా ట్వీట్ చేశారు. జోమాటో బగ్ బౌంటీ ప్రోగ్రామ్‌లో పాల్గొనడానికి టూ- ఫ్యాక్టర్ అథెంటికేషన్ అవసరం. మరిన్ని వివరాలకు సంస్థ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని సోధా ట్వీట్‌లో తెలిపారు.

  First published:

  Tags: Zomato

  ఉత్తమ కథలు