ZOMATO AND SWIGGY FOOD ORDERING APPS ARE DOWN IN INDIA DUE TO TECHNICAL GLITCH SS
Zomato, Swiggy Down: అలర్ట్... దేశవ్యాప్తంగా జొమాటో, స్విగ్గీ డౌన్
Zomato, Swiggy Down: అలర్ట్... దేశవ్యాప్తంగా జొమాటో, స్విగ్గీ డౌన్
(ప్రతీకాత్మక చిత్రం)
Zomato, Swiggy Down | చాలావరకు ఆన్లైన్ ప్లాట్‌ఫామ్స్ అమెజాన్ వెబ్ సర్వీసెస్‌పై ఆధారపడుతుంటాయి. జొమాటో, స్విగ్గీ కూడా అమెజాన్ వెబ్ సర్వీసెస్ సేవల్ని పొందుతుండటంతో ఈ రెండు ప్లాట్‌ఫామ్స్ ఒకేసారి డౌన్ అయ్యాయి.
ఫుడ్ డెలివరీ యాప్స్ అయిన జొమాటో, స్విగ్గీ దేశవ్యాప్తంగా డౌన్ అయ్యాయి. సాంకేతిక కారణాల వల్ల దేశవ్యాప్తంగా యూజర్లకు అంతరాయం కలుగుతోంది. అమెజాన్ వెబ్ సర్వీసెస్ క్రాష్ కావడం వల్ల ఈ సమస్య తలెత్తిందని భావిస్తున్నారు. చాలావరకు ఆన్లైన్ ప్లాట్‌ఫామ్స్ అమెజాన్ వెబ్ సర్వీసెస్‌పై ఆధారపడుతుంటాయి. జొమాటో, స్విగ్గీ కూడా అమెజాన్ వెబ్ సర్వీసెస్ సేవల్ని పొందుతుండటంతో ఈ రెండు ప్లాట్‌ఫామ్స్ ఒకేసారి డౌన్ అయ్యాయి. తాము సాంకేతికంగా సమస్యలు ఎదుర్కొంటున్నామని, తమ టీమ్ పనిచేస్తోందని, త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుందని జొమాటో ట్వీట్ చేసింది. మరోవైపు స్విగ్గీ కూడా తాము సాంకేతిక సమస్యలు ఎదుర్కొంటున్నామని వివరించింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు తమ సిబ్బంది కృషి చేస్తున్నారని స్విగ్గీ తెలిపింది.
Hi Sahil, we are facing a temporary glitch. Please be assured our team is working on this and we will be up and running soon.
Hi there. We're currently unable to process your request as we're experiencing technical constraints. Not to worry, our best minds are on it and we'll be up and running soon.
జొమాటో, స్విగ్గీ ఒకేసారి డౌన్ కావడంతో ట్విట్టర్ సహా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో వరుసగా పోస్టులు చేస్తున్నారు యూజర్లు. తాము మెనూ చూడలేకపోతున్నామని, బ్రౌజ్ చేయలేకపోతున్నామని, ఆర్డర్స్ ప్లేస్ చేయడానికి రావట్లేదంటూ కంప్లైంట్స్ చేశారు. జొమాటో, స్విగ్గీ సంస్థలకు చెందిన కస్టమర్ సపోర్ట్ ట్విట్టర్ హ్యాండిల్స్ వారికి రెస్పాన్స్ ఇస్తున్నాయి.
అయితే జొమాటో, స్విగ్గీ అన్యాయమైన వ్యాపార పద్ధతుల్ని పాటిస్తున్నాయంటూ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా విచారణ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఫిర్యాదు చేసిన కొన్ని నెలల తర్వాత ఈ విచారణ మొదలైంది. జొమాటో, స్విగ్గీ కేవలం కొన్ని హోటళ్లకే ప్రాధాన్యం ఇస్తున్నాయంటూ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆరోపించింది. దేశవ్యాప్తంగా 5 లక్షలకు పైగా రెస్టారెంట్లకు NRAI ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఆరోపణల్ని జొమాటో, స్విగ్గీ ఖండించాయి.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.