హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Youtube Video: వీడియో క్వాలిటీ పెంచనున్న యూట్యూబ్

Youtube Video: వీడియో క్వాలిటీ పెంచనున్న యూట్యూబ్

Youtube Video: వీడియో క్వాలిటీ పెంచనున్న యూట్యూబ్
(ప్రతీకాత్మక చిత్రం)

Youtube Video: వీడియో క్వాలిటీ పెంచనున్న యూట్యూబ్ (ప్రతీకాత్మక చిత్రం)

Youtube Video | యాప్‌లో చూసే ప్రతి వీడియోకు వర్తించే సెట్టింగ్స్‌ను కూడా వినియోగదారులు ఎంచుకునే సదుపాయం ఉంటుంది. ఇందుకు ప్రత్యేకంగా 'వీడియో క్వాలిటీ ప్రిఫరెన్స్’ విభాగాన్ని సెట్టింగ్స్‌లో యాడ్ చేయనున్నారు.

తమ కస్టమర్లకు మెరుగైన సేవలందించే ఏర్పాట్లు చేస్తోంది యూట్యూబ్. వీడియో నాణ్యతను పెంచే సెట్టింగ్స్‌ను సులభంగా సర్దుబాటు చేసే అవకాశాన్ని ఆ సంస్థ అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వివరాలను 9to5Google అనే సంస్థ వెల్లడించింది. ప్రస్తుతం యూట్యూబ్‌లో వీడియో ప్లే చేస్తున్నప్పుడు, సెట్టింగ్స్‌లో వీడియో క్వాలిటీని పెంచుకునే అవకాశం ఉంది. 144p నుంచి రిజల్యూషన్ ఆప్షన్లు ఉన్నాయి. కానీ కొత్త అప్‌డేట్ తరువాత సెట్టింగ్స్‌లో ఈ నంబర్లు ఉండవు. వాటి స్థానంలో నాలుగు ప్రత్యేకమైన ఆప్షన్లు ఉంటాయి. వినియోగదారులు తమ ఆసక్తుల ప్రకారం వాటిని ఎంచుకోవచ్చు. కొత్త అప్‌డేట్‌లో పిక్సెల్ అడ్జెస్ట్‌మెంట్‌కు బదులుగా వినియోగదారులకు నాలుగు ఆప్షన్లు కనిపిస్తాయి. వీటిలో నెట్‌వర్క్‌కు తగ్గట్లు 'ఆటో' ఆప్షన్, ఎక్కువ డేటాను ఉపయోగించే 'హయ్యర్ పిక్చర్ క్వాలిటీ', తక్కువ పిక్చర్ క్వాలిటీ కోసం 'డేటా సేవర్', ఎక్కువ రిజల్యూషన్‌ వీడియో కోసం 'అడ్వాన్స్‌డ్' ఆప్షన్లను వినియోగదారులు ఎంచుకోవచ్చు.

పబ్‌జీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్... PUBG Mobile ఇండియాకు తిరిగొచ్చేస్తోంది

అమెజాన్‌లో TTD 2021 క్యాలెండర్ బుక్ చేయండి ఇలా

అవసరం ప్రకారం ఎంచుకోవచ్చు


వీడియోను ఎంచుకున్న తరువాత అది ఏ రిజల్యూషన్‌లో ప్లే అవుతుందో వినియోగదారులకు తెలుస్తుంది. వీడియో మెనూపై 'Quality for current video' అనే నోటిఫికేషన్‌లో ఇది కనిపిస్తుంది. 'అడ్వాన్స్‌డ్' ఆప్షన్‌ను ఎంచుకున్న వినియోగదారులు అంతకు ముందు మెనూని యాక్సెస్ చేయడానికి ఈ సెట్టింగ్స్ అనుమతిస్తుంది. ‘ఆటో’ ఆప్షన్‌లోనే ప్రేక్షకులు ఉత్తమ అనుభవాన్ని పొందే వీడియోలు చూడవచ్చని గూగుల్ పేర్కొన్నట్లు తాజా నివేదిక చెబుతోంది. 'హయ్యర్ పిక్చర్ క్వాలిటీ', 'డేటా సేవర్' ఆప్షన్లను సందర్భానుసారం ఎంచుకునే వెసులుబాటు ఉంది.

ప్రత్యేక విభాగంలో సెట్టింగ్స్


ఎంచుకున్న సెట్టింగ్స్ కేవలం ప్రస్తుతం వీక్షించే వీడియోకు మాత్రమే పరిమితం కానున్నాయి. యాప్‌లో చూసే ప్రతి వీడియోకు వర్తించే సెట్టింగ్స్‌ను కూడా వినియోగదారులు ఎంచుకునే సదుపాయం ఉంటుంది. ఇందుకు ప్రత్యేకంగా 'వీడియో క్వాలిటీ ప్రిఫరెన్స్’ విభాగాన్ని సెట్టింగ్స్‌లో యాడ్ చేయనున్నారు. దీని ద్వారా మొబైల్ నెట్‌వర్క్‌లు, వై-ఫైలతో బ్రౌజింగ్ చేసేటప్పుడు ప్రత్యేకంగా వీడియో క్వాలిటీని సెట్ చేసుకోవచ్చు.

Mobile App: స్మార్ట్‌ఫోన్ యూజర్లకు అలర్ట్... వెంటనే ఈ 7 యాప్స్ డిలిట్ చేయండి

Google Pay: గూగుల్ పే ఉందా? ఈ గేమ్ ఆడితే రూ.501 మీవే

ఇంకా ప్రయోగ దశలోనే..


యూట్యూబ్ కొత్త సెట్టింగ్స్ అయిన వీడియో క్వాలిటీ ప్రిఫరెన్స్ ఆప్షన్‌ ఇంకా ప్రయోగ దశలోనే ఉంది. కొంతమంది ఉద్యోగులకు దీన్ని బీటా వెర్షన్‌లో ఆ సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఈ యూజర్ ఇంటర్ఫేస్ అడ్వాన్స్‌మెంట్స్‌.. వెర్షన్ 15.45.32లో అందుబాటులో ఉంది. దీన్ని పూర్తిస్థాయిలో వినియోగదారులకు ఎప్పుడు అందుబాటులోకి తీసుకొస్తారనే సమాచారంపై స్పష్టత లేదు. లాక్‌డౌన్ సమయంలో డేటా వినియోగం పెరగడం వల్ల, తమ వినియోగదారులకు వీడియో క్వాలిటీ ఆప్షన్లో ఉండే 1080pను యూట్యూబ్ తొలగించింది. కొన్ని రోజుల క్రితమే మళ్లీ దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. వినియోగదారుల ప్రాధాన్యాలకు అనుగుణంగా కొత్తరకం వీడియో క్వాలిటీ ప్రిఫరెన్స్ సెట్టింగ్స్‌ను యూట్యూబ్ అభివృద్ధి చేస్తోంది.

First published:

Tags: Technology, Youtube

ఉత్తమ కథలు