Home /News /technology /

YOUTUBE WANT TO UPLOAD VIDEOS ON YOUTUBE UPLOAD LIKE THIS FROM DIFFERENT DEVICES GH VB

YouTube: యూట్యూబ్‌లో వీడియోలు అప్‌లోడ్‌ చేయాలనుకుంటున్నారా..? వివిధ డివైజ్‌ల నుంచి ఇలా అప్‌లోడ్ చేయండి..

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

యూట్యూబ్‌ కంటెంట్‌ క్రియేటర్‌ ఏ డివైజ్‌ను వినియోగిస్తున్నా యూట్యూబ్‌లో వీడియోలు అప్‌లోడ్‌ చేయగలిగే మార్గాలను యూట్యూబ్ సంస్థ అందిస్తోంది. అవేంటో చూద్దాం.

ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన వీడియో స్ట్రీమింగ్(Video Streaming) ప్లాట్‌ఫారమ్ యూట్యూబ్‌(YouTube). ఆఫీసు, పాఠశాలల ప్రయోజనాల కోసం ఉపయోగించగల అత్యంత ఉపయోగకరమైన వీడియో షేరింగ్(Sharing) ప్లాట్‌ఫారమ్‌గా(Flatform) కూడా సంస్థ నిలిచింది. అన్ని వర్గాలకూ విలువైన సమాచారం అందజేయడంలో కీలకంగా మారింది. చాలామంది కంటెంట్ క్రియేటర్లు యూట్యూబ్‌లో వివిధ రకాల వీడియోలను అప్‌లోడ్‌(Videos Upload) చేస్తూ ఆదాయం, గుర్తింపు అందుకుంటున్నారు. అన్ని రంగాలకు చెందిన నిపుణులు యూట్యూబ్‌(YouTube) వేదికగా జ్ఞానాన్ని పంచుకొంటున్నారు. ఇతరులకు ఉపయోగపడే రీతిలో వీడియోలను రూపొందిస్తున్నారు. ఇదే బాటలో నడవాలనుకొనే వారు ముందుగా తెలుసుకోవాల్సిన అంశం.. వీడియోలను రూపొందించిన తర్వాత వాటిని ఎలా అప్‌లోడ్ చేయాలో నేర్చుకోవడం. యూట్యూబ్‌ కంటెంట్‌ క్రియేటర్‌ ఏ డివైజ్‌ను వినియోగిస్తున్నా యూట్యూబ్‌లో వీడియోలు అప్‌లోడ్‌ చేయగలిగే మార్గాలను యూట్యూబ్ సంస్థ అందిస్తోంది.

ప్లాట్‌ఫారమ్‌కి వీడియోను అప్‌లోడ్ చేయడానికి ముందు YouTube ఛానెల్ క్రియేట్‌ చేసుకోవాలి. యూట్యూబ్‌లో వీడియోలు చూసేందుకు ఉపయోగిస్తున్న గూగుల్‌ అకౌంట్‌కు యూట్యూబ్‌ అకౌంట్‌కు సంబంధం లేదు. ఛానెల్‌ ఎలా క్రియేట్‌ చేయాలో తెలుసుకోండి..

ఇప్పటికే గూగుల్ అకౌంట్ ఉంటే యూట్యుబ్ అకౌంట్‌ క్రియేట్‌ చేయడం ఎలా?

ముందు కంప్యూటర్‌లో లేదా మొబైల్‌లో YouTubeలో సైన్ ఇన్ అవ్వాలి.

తర్వాత పేజీలో కనిపించే ప్రొఫైల్ పిక్చర్‌పై క్లిక్ చేయాలి.

కింద కనిపించే మెనూలో "క్రియేట్‌ అకౌంట్‌"పై క్లిక్ చేయాలి.

Realme GT 2: ఈ స్మార్ట్‌ఫోన్‌పై తొలి సేల్‌లోనే రూ.5,000 డిస్కౌంట్

ఛానెల్‌ క్రియేట్‌ చేయాలనుకొంటున్న వివరాలను (ఛానెల్ పేరు, ఫోటో) ఎంటర్ చేయాలి. అనంతరం కనిపించే డైలాగ్ బాక్స్‌లో ఎందుకు ఛానెల్‌ క్రియేట్‌ చేయాలనుకొంటున్నారనే అంశాన్ని వివరించాలి.

అనంతరం నమోదు చేసిన వివరాలను సరిచూసుకొని "క్రియేట్‌ ఛానెల్" బటన్‌ను క్లిక్‌ చేయాలి.

ఇప్పుడు YouTube ఛానెల్ క్రియేట్‌ అవుతుంది. వీడియోలను అప్‌లోడ్ చేసుకొనే అవకాశం కలుగుతుంది.

* డెస్క్‌టాప్ బ్రౌజర్‌ ఉపయోగించి యూట్యూబ్‌కు వీడియోను ఎలా అప్‌లోడ్ చేయాలి

ముందు యూజర్లు studio.youtube.comలో YouTube క్రియేటర్‌ స్టూడియోలో లాగిన్ అవ్వాలి.

స్క్రీన్ టాప్‌ రైట్‌ కార్నర్‌లో “క్రియేట్‌” బటన్‌ను నొక్కి.. తర్వాత “అప్‌లోడ్‌ వీడియోస్‌” సెలక్ట్‌ చేసుకోవాలి.

తర్వాత కనిపించే పాప్ అప్ డైలాగ్ బాక్స్‌లో అప్‌లోడ్‌ చేయాలనుకొనే ఫైల్‌ను డ్రాగ్‌ అండ్‌ డ్రాప్‌ చేయవచ్చు లేదా “సెలక్ట్‌ ఫైల్స్‌” బటన్‌ను నొక్కాలి.

తర్వాత అప్‌లోడ్ చేయాలనుకుంటున్న ఫైల్‌ను సెలక్ట్‌ చేసుకోవాలి.

ఫైల్‌ని ఎంచుకున్న తర్వాత, అది బ్యాక్‌గ్రౌండ్‌లో అప్‌లోడ్ అవుతుంది. అక్కడ కనిపించే డైలాగ్ బాక్స్‌లో వీడియో టైటిల్‌, థంబ్‌నెయిల్‌లను ఎంటర్‌ చేయాలి.

వాటన్నింటినీ ఎంటర్‌ చేసిన తర్వాత, అప్‌లోడ్ చేస్తున్న వీడియో పిల్లలు చూడవచ్చా? వయో పరిమితి విధించాలా? అని ఆప్షన్స్‌ కనిపిస్తాయి.

తగిన వివరాలను ఎంచుకున్న తర్వాత, "నెక్స్ట్‌" నొక్కండి.

తదుపరి స్క్రీన్‌లో సబ్‌టైటిల్స్‌, స్కీన్ కార్డులను సెలక్ట్‌ చేసుకోవచ్చు.

దీని తర్వాత కనిపించే స్క్రీన్‌లో వీడియోకు సంబంధించిన ఏవైనా కాపీరైట్ ఉల్లంఘనలను YouTube మీకు చూపిస్తుంది. ఏదీ లేకుంటే, స్క్రీన్ “నో ఇష్యూస్‌ ఫౌండ్‌” అని వస్తుంది. “నెక్స్ట్‌” బటన్‌ నొక్కాలి.
తర్వాతి స్క్రీన్‌లో వీడియో "ప్రైవేట్", "అన్‌లిస్టెడ్" లేదా "పబ్లిక్" ఆప్షన్స్‌ కనిపిస్తాయి. ప్రైవేట్ అంటే యూజర్, యూజర్‌ ఎంచుకున్న వ్యక్తులు మాత్రమే వీడియోను వీక్షించగలరు. అన్‌లిస్టెడ్ అంటే వీడియోను ప్రత్యక్షంగా లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా మాత్రమే వీక్షించవచ్చు. పబ్లిక్ అంటే అందరికీ కనిపిస్తుంది.

అన్ని వివరాలు పూర్తయిన తర్వాత "సేవ్ " బటన్‌ నొక్కండి.

వీడియో YouTubeలోకి అప్‌లోడ్ అయిపోతుంది.

* ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ డివైజ్‌ల ద్వారా అప్‌లోడ్‌ చేయడం ఎలా?

YouTube మొబైల్ యాప్‌ను ఓపన్‌ చేయాలి.

క్రియేట్‌ బటన్‌ను నొక్కాలి (స్క్రీన్ కింద ఉన్న సర్కిల్‌లో ప్లస్ గుర్తు)

అనంతరం “అప్‌లోడ్‌ వీడియో” సెలక్ట్‌ చేయాలి.

OnePlus Nord N20: వన్‌ప్లస్ నుంచి మరో మిడ్ రేంజ్ ఫోన్ లాంచ్.. 64 MP ట్రిపుల్ కెమెరాతో పాటు టాప్ ఫీచర్లు..


ఫోన్ ఫైల్‌లను YouTube యాక్సెస్‌ చేసుకొనేందుకు అనుమతించండి.

అప్‌లోడ్ చేయడానికి గ్యాలరీ నుంచరి వీడియోను సెలక్ట్‌ చేసి ‘నెక్స్ట్‌’ బటన్‌ నొక్కండి

తర్వాత కనిపించే స్క్రీన్‌లో టైటిల్‌, డిస్క్రిప్షన్‌, విజిబిలిటీ వివరాలను ఎంటర్‌ చేయాలి.

వివరాలను ఎంట్‌ చేశాక "నెక్స్ట్‌" బటన్‌ నొక్కండి

తదుపరి స్క్రీన్‌లో వీడియో వయో పరిమితి ఆప్షన్స్‌ కనిపిస్తాయి. సంబంధిత వివరాలు అందజేయాలి.
చివరిగా “అప్‌లోడ్‌ వీడయో” బటన్‌ నొక్కాలి.

వీడియో YouTubeలో అప్‌లోడ్ అవుతుంది.
Published by:Veera Babu
First published:

Tags: Technology, Videos, Viral, Youtube

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు