క్రెడిట్ ఇవ్వకుండా యూట్యూబర్ వీడియో వాడుకున్న యూట్యూబ్

image:@Hevesh5/Youtuber

క్రిస్మస్ డే సందర్భంగా ఓ యూట్యూబర్ వీడియోను తీసుకొని ట్విట్టర్‌లో షేర్ చేసింది యూట్యూబ్. అందులో ఆ వీడియో రూపొందించిన యూట్యూబర్‌కు క్రెడిట్ కూడా ఇవ్వలేదు. ఈ విషయాన్ని పసిగట్టిన యూట్యూబర్లు యూట్యూబ్‌కు ప్రశ్నల వర్షం కురిపించారు.

  • Share this:
    యూట్యూబ్‌లో చాలామంది వీడియోలు అప్‌లోడ్ చేస్తుంటారు. వాటిని ఇతరులు ఎలాంటి క్రెడిట్ ఇవ్వకుండా దర్జాగా వాడుకుంటూ ఉంటారు. ఈ సమస్య అన్నిచోట్లా ఉన్నదే. మరి ఇలాంటి వీడియోలకు వేదికను ఏర్పాటు చేసిన యూట్యూబ్ కూడా అలాగే క్రెడిట్ ఇవ్వకుండా వీడియోలు వాడేస్తే..? ఇలాంటి ఘటనే ఇప్పుడు యూట్యూబర్లలో చర్చనీయాంశమవుతోంది. క్రిస్మస్ డే సందర్భంగా ఓ యూట్యూబర్ వీడియోను తీసుకొని ట్విట్టర్‌లో షేర్ చేసింది యూట్యూబ్. అందులో ఆ వీడియో రూపొందించిన యూట్యూబర్‌కు క్రెడిట్ కూడా ఇవ్వలేదు. ఈ విషయాన్ని పసిగట్టిన యూట్యూబర్లు యూట్యూబ్‌కు ప్రశ్నల వర్షం కురిపించారు. యూట్యూబ్ వాడుకున్న వీడియో ఇదే.


    యూట్యూబర్ లిల్లీ హెవిష్ రూపొందించిన వీడియో ఇది. తనకు క్రెడిట్ ఇవ్వకుండా యూట్యూబ్ ఈ వీడియోను తన అఫిషియల్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ఆ తర్వాత ప్రశ్నల వర్షం కురవడంతో 24 గంటల తర్వాత తేరుకొని క్షమాపణలు చెప్పింది. వీడియో క్రియేటర్‌కు క్రెడిట్స్ ఇస్తూ మళ్లీ అదే పోస్ట్‌ను రీట్వీట్ చేశారు యూట్యూబ్ సిబ్బంది.

    ఇవి కూడా చదవండి:

    IRCTC వెబ్‌సైట్ మారింది... కొత్త ఫీచర్లు ఇవే

    #Jobs: ప్రైవేట్ సంస్థల్లో 650 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు

    న్యూ ఇయర్ పార్టీకి బదులు ఈ 10 పనులు చేయండి

    బ్యాంకులు మినిమమ్ బ్యాలెన్స్‌ని ఎలా లెక్కిస్తాయి? తెలుసుకోండి

    Good News: డీటీహెచ్ ఛార్జీలు ఇక రూ.500లోపే... ట్రాయ్ కొత్త ఆదేశం

    మ్యూచువల్ ఫండ్ తీసుకుంటున్నారా? ఈ 5 అంశాలు పరిశీలించండి

     
    First published: