హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

యూట్యూబ్ అలర్ట్... ఇకపై ఆ వీడియోలకు వార్నింగ్ మెసేజ్

యూట్యూబ్ అలర్ట్... ఇకపై ఆ వీడియోలకు వార్నింగ్ మెసేజ్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Youtube Feature : మారుతున్న కాలంతో యూట్యూబ్ కూడా మారక తప్పట్లేదు. అందులో కొత్తగా వచ్చిన రూల్ ఏంటో తెలుసుకుందాం.

  ఈ మధ్య సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్‌ల కలకలం ఎక్కువైపోయింది. డూప్లికేట్ వీడియోలకు తోడు... మార్ఫింగ్ ఫొటోలు, మిమిక్రీ వాయిస్‌లు వాడేసి... నకిలీ వీడియోలు తయారుచేస్తున్నారు చాలా మంది. ఇకపై అలాంటి వీడియోలను యూట్యూబ్ కనిపెట్టేస్తుంది. అలాంటి అన్ని వీడియోలకూ ఫాక్ట్ చెకింగ్ సిస్టం తెస్తోంది. తద్వారా ఏవైనా వీడియోల్లో అసత్య ప్రచారం, ఫేక్ న్యూస్ ఉంటే... వెంటనే వాటిని ఫేక్ వీడియోలుగా గుర్తిస్తుంది. "ఈ వీడియోల్లో తప్పుడు సమాచారం ఉంది" (prone to misinformation) అనే వార్నింగ్ మెసేజ్ ఇస్తుంది. ఉదాహరణకు ఏదైనా సంఘటనపై మనం సెర్చ్ చెయ్యగానే... ఆ సంఘటనపై ఫేక్ వీడియోలు గనక ఉన్నట్లు యూట్యూబ్ భావిస్తే... వాటన్నింటినీ ఓ గ్రూప్‌లో పెట్టి సెర్చ్ రిజల్ట్స్‌లో చూపిస్తుంది. అవి ఫేక్ వీడియోలా, వాస్తవ వీడియోలా అన్నది యూట్యూబ్ చెప్పదు. అది తేల్చుకోవాల్సింది మనమే. ఐతే... యూట్యూబ్ అలా చెబుతున్న వీడియోల్లో చాలా వరకూ ఫేక్‌వే ఉంటాయన్నమాట.


  ఇకపై వివాదాస్పద అంశాలపై అప్‌లోడ్ అయ్యే వీడియోలను చెక్ చెయ్యడానికి యూట్యూబ్‌లో ఓ టీమ్ పనిచేస్తుంది. ఈ టీమ్... అనుమానాస్పద వీడియోలను ప్రత్యేక గ్రూపులోకి చేర్చుతుంది. తద్వారా ఆ వీడియోలను చూసేవారు... అవి నిజమో, కాదో ఆలోచించుకునే అవకాశం ఉంటుంది.


  ప్రస్తుతానికి ఈ కొత్త ఫీచర్ ఇండియాలో మాత్రమే అది కూడా ఇంగ్లీష్, హిందీలో మాత్రమే అమలులోకి వచ్చింది. త్వరలోనే ప్రపంచం అంతటా అమలులోకి రానుంది. ఇండియాలో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి... ఇక్కడ ముందుగా ఈ రూల్ తీసుకొచ్చారు.


   


  ఇవి కూడా చదవండి :


  ఆ గ్రహశకలంపై 20,00,000 కేజీల బంగారం ఉందన్న నాసా... ఫ్యూచర్‌లో తవ్వేస్తారా....


  అతని నాలిక రేటు రూ.92 కోట్లు... ఎందుకో తెలిస్తే ఆశ్చర్యమే...


  ఒక్కోటీ ఒక్కో వింత వెబ్ సైట్ ... ఇలాంటివి ఉన్నాయంటే నమ్మలేం


  మొబైల్ ఆండ్రాయిడ్ యాప్ తయారీ... సింపుల్‌గా ఎలా... ఇలా చెయ్యండి

  First published:

  Tags: Technology, Youtube

  ఉత్తమ కథలు