HOME »NEWS »TECHNOLOGY »youtube to push more non skippable ads increase revenue

యూట్యూబ్‌లో యాడ్స్ స్కిప్ చేయలేరు!

యూట్యూబ్‌లో యాడ్స్ స్కిప్ చేయలేరు!
స్నాప్‌చాట్ లాంటి ఫీచర్ యూట్యూబ్‌లో..., (Image: Reuters)

ఆదాయాన్ని పెంచుకునేందుకు యూట్యూబ్ కొత్త ప్రణాళికలు రచిస్తోంది. ఇకపై స్కిప్ చేయలేని యాడ్స్‌ని ఎక్కువగా ప్లే చేయనుంది.

  • Share this:
    యూట్యూబ్‌లో ఏదైనా మంచి వీడియో కనిపించగానే క్లిక్ చేయడం చాలామందికి అలవాటు. అలా క్లిక్ చేయగానే వీడియో కన్నా ముందు యాడ్ ప్లే అవుతుంది. ఆ యాడ్ చూడటం ఇష్టం లేనివాళ్లు స్కిప్ బటన్ ప్రెస్ చేస్తారు. వీడియో చూసి ఎంజాయ్ చేస్తారు. కానీ ఇకపై ఇది సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే యూట్యూబ్‌లో స్కిప్ చేయలేని యాడ్స్ ఎక్కువగా రానున్నాయి. ఆదాయ మార్గాలను పెంచుకునేందుకు యూట్యూబ్ తీసుకున్న నిర్ణయమిది.

    వేర్వేరు వీడియోలకు స్కిప్ చేయలేని (నాన్-స్కిప్పబుల్) యాడ్స్ పోస్ట్ చేసే టూల్‌ని క్రియేటర్లకు ఇవ్వనుంది గూగుల్. దీని ద్వారా యూట్యూబ్‌కు ఆదాయం పెరగనుంది. మరో వారం రోజుల్లో యూట్యూబ్‌లో ఇలాంటి యాడ్స్ కనిపిస్తాయి. ఇప్పటికే ఉన్న వీడియోలకు నాన్-స్కిప్పబుల్ యాడ్స్ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ కూడా క్రియేటర్లకు అందించనుంది యూట్యూబ్. అంతేకాదు... నాన్-స్కిప్పబుల్ యాడ్స్‌కు వస్తున్న స్పందన ద్వారా వాటిని కొనసాగించాలో, వద్దో నిర్ణయించుకోవచ్చు. ఈ ఫీచర్ "యూట్యూబ్ పార్ట్‌నర్ ప్రోగ్రామ్"‌లో ఉన్న క్రియేటర్లందరికీ లభిస్తుంది.



    ఇది కూడా చదవండి:

    #మొబైల్ యాప్: ఎమ్మెల్యేలు, ఎంపీలకు యాప్‌లో రేటింగ్!
    Published by:Santhosh Kumar S
    First published:August 27, 2018, 12:44 pm

    टॉप स्टोरीज