హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

YouTube Subtitles: యూట్యూబ్‌లో వీడియోకు సబ్ టైటిల్స్ యాడ్ చేయాలనుకుంటున్నారా..? అయితే ఇవి ఫాలో అవ్వండి..

YouTube Subtitles: యూట్యూబ్‌లో వీడియోకు సబ్ టైటిల్స్ యాడ్ చేయాలనుకుంటున్నారా..? అయితే ఇవి ఫాలో అవ్వండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రస్తుతం యూట్యూబ్‌ చూడని నెటిజన్‌ లేడు. ప్రతి ఒక్కరు ఏదో ఒక విషయాన్ని తెలుసుకోవడం కోసం ఇంటర్నెట్‌ సాయంతో యూట్యూబ్‌ను తెగ సెర్చ్ చేస్తుంటారు. ఇంతలా ఉపయోగిస్తున్న యూట్యూబ్‌‌ వీడియోలు వేరే భాషకు చెందినవి అయితే.. సబ్ టైటిల్స్ ఉపయోగించి వాటిని చూడవచ్చు.

ఇంకా చదవండి ...

ప్రస్తుతం యూట్యూబ్‌(YouTube) చూడని నెటిజన్‌ లేడు. ప్రతి ఒక్కరు ఏదో ఒక విషయాన్ని తెలుసుకోవడం కోసం ఇంటర్నెట్‌(Internet) సాయంతో యూట్యూబ్‌ను తెగ సెర్చ్(Search) చేస్తుంటారు. ఇంతలా ఉపయోగిస్తున్న యూట్యూబ్‌‌ వీడియోలు(Videos) వేరే భాషకు చెందినవి అయితే.. సబ్ టైటిల్స్(Sub Tittles) ఉపయోగించి వాటిని చూడవచ్చు. కంటెంట్(Content) ను అర్థం చేసుకోవడంలో సబ్ టైటిల్స్(Subtitles) కీలక పాత్ర పోషిస్తాయి. సాధారణంగా వీక్షకుడికి వీడియోలో ఉపయోగించిన భాష తెలియకపోయినా దాన్ని ఆస్వాదించాలనుకున్నప్పుడు సబ్ టైటిల్స్ అవసరమవుతాయి. అవి వీక్షకుల అనుభవాన్ని మెరుగుపరుస్తాయి. ముఖ్యంగా సమాచార వీడియోల్లో మరింత కచ్చితంగా సమాచారాన్ని అందిస్తాయి.

వీడియో క్రియేటర్లు తమ వీడియోకు సబ్ టైటిల్స్ జోడించడం వల్ల భాష అవరోధాన్ని అధిగమించి కంటెంట్‌ను విస్తృతంగా ప్రేక్షకులకు అందుబాటులోకి రావడంతో పాటు పరిధిని సమర్థవంతంగా పెంచుకోవచ్చు. ఒక వేళ మీరు వీడియో క్రియేటర్ అయితే మీ YouTube వీడియోకి సబ్ టైటిల్స్ యాడ్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి.

Google Play Store: గూగుల్ ప్లేస్టోర్ కొత్త అప్‌డేట్.. వాటి కోసం కొత్త లేబుల్స్ తీసుకొస్తున్నట్లు ప్రకటన..


స్టెప్-1: మీ యూట్యూబ్ ఛానెల్‌కు లాగిన్ అవ్వండి. ప్రొఫైల్ ఫిక్చర్‌పై క్లిక్ చేయండి.

స్టెప్-2: వీడియో ఆప్షన్‌పై క్లిక్ చేసి అప్‌లోడ్ చేసిన వీడియో జాబితా ఓపెన్ అవుతుంది. అందులో సబ్ టైటిల్స్ యాడ్ చేయాలనుకుంటున్న వీడియోను ఎంచుకోండి.

స్టెప్- 3: స్క్రోలింగ్ దిగువన కుడి వైపున ఉన్న సబ్‌టైటిల్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.

స్టెప్- 4: ఇప్పుడు YouTube మీ కోసం యూట్యూబ్ స్టూడియో సబ్ టైటిల్స్ ఎడిటర్‌ను ఓపెన్ చేస్తుంది. ఇక్కడ మీరు సబ్ టైటిల్స్‌ను సర్దుబాటు చేయవచ్చు.

స్టెప్-5: మీరు అప్‌లోడ్ చేసిన వీడియో కోసం YouTube ఆటో‌మెటిక్‌గా సబ్ టైటిల్స్ రూపొందిస్తుంది. వీటిని స్టూడియో పేజీలోని టెక్స్ట్ బాక్స్‌లో చూడవచ్చు. అయితే అవి తప్పుగా ఉన్నాయని మీరు భావిస్తే, వాటిని క్లియర్ చేయవచ్చు.

స్టెప్ -6: టెక్స్ట్ డిలీట్ చేయాలనుకుంటే మూడు చుక్కలపై క్లిక్ చేసి, క్లియర్ టెక్స్ట్‌పై క్లిక్ చేయండి

స్టెప్ -7: మీ సబ్‌టైటిల్స్‌ను టెక్స్ట్ బాక్స్‌లో టైప్ చేయవచ్చు లేదా సబ్‌టైటిల్ ఫైల్‌ను అప్‌లోడ్ చేయవచ్చు.

స్టెప్-8: సబ్‌టైటిల్ ఫైల్‌ను అప్‌లోడ్ చేయాలంటే ముందుగా అది యూట్యూట్‌కు సపోర్ట్ చేస్తుందని నిర్ధారించుకోవాలి. అప్పుడు అప్‌లోడ్ ఫైల్‌ను సెలక్ట్ చేయడం కోసం ‘విత్ టైమింగ్’ లేదా ‘విత్‌ఔట్ టైమింగ్’ మధ్య సెలక్ట్ చేసుకోండి. మీ వీడియో సబ్ టైటిల్స్‌తో సరిపోలినప్పుడు “విత్ ఔట్ టైమింగ్” ఆప్షన్‌ను కూడా ఉపయోగించవచ్చు.

స్టెప్-9: కంటిన్యూపై క్లిక్ చేసి, సేవ్ చేయడానికి ముందు ఫైల్‌ను అప్‌లోడ్ చేయడానికి ఎంచుకోండి

* ఒకవేళ కొత్త వీడియోను అప్‌లోడ్ చేస్తున్నప్పుడు సబ్ టైటిల్స్ యాడ్ చేయాలనుకుంటే ఇలా ఫాలో అవ్వండి

స్టెప్-1: మీరు YouTube వీడియోను అప్‌లోడ్ చేస్తున్నప్పుడు, మీరు అప్‌లోడ్ చేసే “వీడియో ఎలిమెంట్స్” దశలో ఉన్నట్లయితే ‘యాడ్ సబ్ టైటిల్’‌ను ఎంపిక చేసుకోండి.

స్టెప్-2: మీరు సబ్‌టైటిల్ ఫైల్‌ను మునుపటిలా అప్‌లోడ్ చేయవచ్చు. వాటిని మాన్యువల్‌గా కూడా టైప్ చేయవచ్చు లేదా “ఆటో-సింక్” సెలక్ట్ చేసుకోవచ్చు.

స్టెప్- 3: సబ్‌టైటిల్ ఫైల్‌ను అప్‌లోడ్ చేసి “విత్ టైమ్’’ లేదా “విత్ ఔట్ టైమ్’’ సెలక్ట్ చేయండి. ఆపై సబ్ టైటిల్ సరిగ్గా సరిపోలుతున్నాయో లేదో తనిఖీ చేసుకోండి. సబ్ టైటిల్ టెక్స్ట్ పేస్ట్ చేయడానికి Auto-syncను సెలక్ట్ చేసి ఉపయోగించండి.

స్టెప్- 4: ఛేంజస్‌ను సేవ్ చేయండి. అప్‌లోడ్ చేసిన వీడియోలో సబ్ టైటిల్స్‌ను చూడండి.

First published:

Tags: 5g technology, Technology, Youtube

ఉత్తమ కథలు