YouTube Shorts:వీడియో సోషల్ మీడియా సైట్ యూట్యూబ్ ఏం చేసినా చాలా జాగ్రత్తగా చేస్తుంది. రూల్స్ పక్కగా ఫాలో అవుతూ... ఇంప్లిమెంట్ చేస్తుంది. ఇండియాలో టిక్ టాక్‌కి కోట్ల మంది ఫాలోయర్లు ఉండేవారు. రోజూ కోట్ల మినీ వీడియోలను అప్లోడ్ చేసేవాళ్లు. మరి టిక్‌టాక్ బ్యాన్ అయ్యాక వాళ్లు ఏం చేస్తున్నారు... రకరకాల ఇతర షార్ట్ మెసేజ్ సర్వీసులను వాడటం మొదలుపెట్టారు. అలాంటి వాళ్లందర్నీ ఒకే చోటికి చేర్చేందుకు యూట్యూబ్ గట్టిగా ప్రయత్నిస్తోంది. అందుకోసం యూట్యూబ్ షార్ట్స్ అనే ఆప్షన్ తెచ్చింది. ఇది ప్రస్తుతం బీటా వెర్షన్‌గా ఉంది. మొబైల్స్‌లోని యూట్యూబ్ యాప్‌లో ఇది అందుబాటులో ఉంది. ఇప్పటికే ఇండియాలో దీన్ని టెస్ట్ చేసిన యూట్యూబ్... ఇప్పుడు అమెరికాలో టెస్ట్ చేస్తోంది.
YouTube Shorts అంటే:
ఇదో చిన్న వీడియో మెసేజ్ సర్వీస్. ఇందులో యూట్యూబ్ యూజర్లు 15 సెకండ్లలోపు వీడియో క్లిప్పింగులను పోస్ట్ చేయవచ్చు.
ఇది ఎవరికి ఉపయోగం?:
ఎవరైనా సరే తమ పర్సనల్ విషయాలను వీడియో రూపంలో చెప్పాలనుకుంటే దీని ద్వారా చెప్పవచ్చు. తమ టాలెంట్‌ను తక్కువ సమయంలో చూపించవచ్చు.
యూట్యూబ్‌కి ఇండియాలో క్రేజ్ ఎలా ఉంది?
ఇండియాలో చాలా బాగుంది. రోజూ 650 కోట్ల వ్యూస్ ఇండియా నుంచి వస్తున్నాయి. యూట్యూబ్‌ని గూగుల్ నిర్వహిస్తోంది.
ఈ షార్ట్స్‌పై యూట్యూబ్ ఏం చెప్పింది?:
ఇది బీటా వెర్షన్ కాబట్టి... దీన్ని మరింత విస్తరిస్తామని చెప్పింది. యూట్యూబ్ క్రియేటర్లు, ఆర్టిస్టులకు అనుకూలంగా మార్చుతామని తెలిపింది. వచ్చే నెలల్లో దీన్ని బాగా అభివృద్ధి చేస్తామంది.
యూట్యూబ్ షార్ట్స్ ద్వారా డబ్బు సంపాదించుకోవచ్చా?
ప్రస్తుతం యూట్యూబ్‌లో వీడియోలను అప్లోడ్ చేసేవారికి మానిటరింగ్ ఆప్షన్ ద్వారా యూట్యూబ్ డబ్బు ఇస్తోంది. ఇది కొత్త బీటా వెర్షన్ ఆప్షన్ కాబట్టి... ప్రస్తుతానికి ఇందులో డబ్బు ఇవ్వట్లేదు. ఈ దిశగా అవకాశం కల్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది. భవిష్యత్తులో ఈ ఛాన్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.
టిక్‌టాక్‌కి పోటీ ఇస్తుందా?:
కచ్చితంగా ఇవ్వగలదు. ఎందుకంటే టిక్ టాక్‌పై ఎన్నో విమర్శలు ఉన్నాయి. పైగా... చైనాకి అనుకూలంగా వ్యవహరిస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. అదీకాక టిక్ టాక్... తమ యూజర్లు పెట్టే వీడియోలకు ఎలాంటి డబ్బూ ఇవ్వలేదు. కానీ యూట్యూబ్ అన్ని రూల్సూ పాటిస్తూ షార్ట్స్ తెచ్చినట్లు తెలిపింది. అందువల్ల ఇది క్లిక్ అయ్యే ఛాన్స్ ఉంది.
యూట్యూబ్ దీనికి సంబంధించి వీడియో రూపంలో ఏమైనా చెప్పిందా?
చెప్పింది. ఓ వీడియో ద్వారా వివరాలు చెప్పింది. ఆ వీడియో ఇదే... మీరూ చూడండి.
ఇలాంటివి మరిన్ని ఉన్నాయా?
చాలా ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్ గత నెల్లో ఫాస్ట్ లాఫ్స్ ("Fast Laughs") ఫీచర్‌ని తన ఐఫోన్ యాప్‌లో తెచ్చింది. అలాగే ఫేస్బుక్ నడుపుతున్న ఇన్స్టాగ్రామ్... రీల్స్ (reels) పేరుతో ఆగస్టులో వీడియో ఫార్మాట్ తెచ్చింది. నవంబర్‌లో స్నాప్‌చాట్... స్పాట్లైట్ (Spotlight) లాంచ్ చేసింది. ఇవన్నీ టిక్‌టాక్ లాంటివే. ఐతే... వీటన్నింటి కంటే ఎక్కువగా ఫేమస్ అయ్యేలా యూట్యూబ్ తన షార్ట్స్‌ని రెడీ చేస్తున్నట్లు తెలిసింది.
Published by:Krishna Kumar N
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.