YOUTUBE SHORTS GOOD NEWS FOR YOUTUBE SHORTS CREATORS HOW TO USE YOUTUBE VIDEO CLIPS FOR SHORTS GH EVK
YouTube Shorts: యూట్యూబ్ షార్ట్స్ క్రియేటర్లకు గుడ్ న్యూస్.. వీడియో క్లిప్‌లను యూజ్ చేసుకొనే అవకాశం
(ప్రతీకాత్మక చిత్రం)
YouTube Shorts | షార్ట్ వీడియో క్రియేటర్ల కోసం యూట్యూబ్ ఒక అదిరిపోయే ఫీచర్ (New Feature) తీసుకొచ్చింది. ఈ ఫీచర్‌తో క్రియేటర్లు తమ షార్ట్స్ కోసం యూట్యూబ్ వీడియోల నుంచి వీడియో క్లిప్‌లను యూజ్ చేసుకోవచ్చు. ఈ విషయాన్ని యూట్యూబ్ తాజాగా ఒక బ్లాగ్ పోస్ట్‌లో ప్రకటించింది.
ప్రపంచవ్యాప్తంగా మోస్ట్ పాపులర్ వీడియో ప్లాట్‌ఫామ్ గా యూట్యూబ్ (YouTube) అవతరించింది. ఇది ప్రస్తుత ట్రెండ్ కి తగినట్లుగా తన ప్లాట్‌ఫామ్ ని మారుస్తోంది. ఇందులో భాగంగా ఇది కొద్ది రోజుల క్రితం టిక్‌టాక్ లాంటి యూట్యూబ్ షార్ట్స్ (YouTube Shorts) తీసుకొచ్చింది. ఈ ప్లాట్‌ఫామ్ వచ్చాక షార్ట్ వీడియోలు క్రియేట్ చేసే వారి సంఖ్య పెరిగింది. వీటి సహాయంతో క్రియేటర్లు మరింత మందికి చేరువ అవుతున్నారు. అయితే తాజాగా షార్ట్ వీడియో క్రియేటర్ల కోసం యూట్యూబ్ ఒక అదిరిపోయే ఫీచర్ (New Feature) తీసుకొచ్చింది.
ఈ ఫీచర్‌తో క్రియేటర్లు తమ షార్ట్స్ కోసం యూట్యూబ్ వీడియోల నుంచి వీడియో క్లిప్‌లను యూజ్ చేసుకోవచ్చు. ఈ విషయాన్ని యూట్యూబ్ తాజాగా ఒక బ్లాగ్ పోస్ట్‌లో ప్రకటించింది. ప్రస్తుతానికి ఈ ఫీచర్ ఐఓఎస్ యూజర్లు అందుబాటులోకి వస్తోంది. ఈ ఏడాది నాటికి ఇది ఆండ్రాయిడ్ యూజర్లకు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.
యూట్యూబ్ షార్ట్స్ ఉపయోగించి మీరు 60-సెకన్ల వ్యవధి గల వీడియోలు క్రియేట్ చేయొచ్చు. అయితే ఇప్పుడు క్రియేటర్లు తమ షార్ట్-ఫామ్ వీడియోల కోసం లాంగ్-ఫామ్, షార్ట్ వీడియోల నుంచి 1 నుంచి 5 సెకన్ల క్లిప్‌లను వాడుకోవచ్చు. 1 నుంచి 5 సెకన్ల సెగ్మెంట్లను డివైడ్ చేసి వాటిని షార్ట్ వీడియోల్లో ఉపయోగించుకోవచ్చు. ఇంతకుముందు, క్రియేటర్లు యూట్యూబ్ వీడియోల నుంచి స్మాల్ ఆడియో క్లిప్ (Audio Clips) లను మాత్రమే డివైడ్ చేసి వాటిని తమ షార్ట్స్ కి ఉపయోగించుకోగలిగారు. కానీ ఇప్పుడు వీడియోలను కూడా కట్ చేసుకొని వాడుకోవచ్చు.
క్రియేటర్లు మరొక వీడియో నుంచి క్లిప్‌ను ఉపయోగించి షార్ట్‌ను క్రియేట్ చేసినప్పుడు, అసలు వీడియోకి లింక్ ద్వారా క్రెడిట్ ఇవ్వడం జరుగుతుంది. క్రియేటర్లు తమ లాంగ్ వీడియోలను ఇతరులు ఎక్కువగా యూజ్ లేకుండా ఒక లిమిట్ పెట్టొచ్చు. ప్రైవేటు లేదా కాపీరైట్లు ఉన్న వీడియోలలోని క్లిప్స్ వాడటం కుదరదు. ఓన్లీ ఎలిజిబుల్ వీడియోల నుంచి మాత్రమే క్రియేటర్లు క్లిప్స్ కట్ చేయడం కుదురుతుంది. అయితే రీ మిక్సింగ్ కోసం చాలా వీడియోలు అందుబాటులో ఉంటాయని యూట్యూబ్ తెలిపింది. యూట్యూబ్ షార్ట్లలోని ఈ కొత్త ఫీచర్.. రీల్స్ కోసం ఇన్స్టాగ్రామ్ రీమిక్స్ ఫీచర్ పని చేసినట్లుగా పనిచేస్తుంది. అలానే ఇది టిక్‌టాక్ స్టిచ్ ఫీచర్ లాగానే ఉంటుంది.
బిలియన్ల కొద్దీ యూట్యూబ్ వీడియోలను యాక్సెస్ చేసేందుకు అనుమతి ఇవ్వడం క్రియేటర్లకు ఒక పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. క్రియేటర్ల ఓన్ కంటెంట్ వైరల్ అయినట్లయితే రెవెన్యూ వచ్చే అవకాశం ఉంది. యూట్యూబ్ లో ఇతరుల క్రియేట్ చేసిన రీమిక్స్ ద్వారా కూడా ఒరిజినల్ వీడియో ఓనర్లకు లాభం చేకూరుతుంది. షార్ట్స్ ఇప్పుడు యూట్యూబ్ వెబ్సైట్లో, అలాగే టాబ్లెట్లలో యూట్యూబ్‌లో చూడటానికి అందుబాటులో ఉన్నాయని కంపెనీ ప్రకటించింది.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.