YOUTUBE SAYS IT CAN SHUT DOWN ACCOUNTS IF THEY DONT MAKE ENOUGH MONEY IN NEW UPDATE TO TERMS NK
యూట్యూబ్ రూల్స్ ఛేంజ్... వీడియో క్రియేటర్లకు షాక్..!
యూట్యూబ్ రూల్స్ ఛేంజ్... వీడియో క్రియేటర్లకు షాక్..!
Youtube New Rules : యూట్యూబ్, గూగుల్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు... కొత్త రూల్స్ తెచ్చినప్పుడు దాదాపు 15 నుంచీ 20 పేజీల కండీషన్లు పెడతాయి. అవి మొత్తం చదివి ఓకే చెప్పమంటాయి. చాలా మంది అవి చదవకుండానే ఓకే చెబుతారు. యూట్యూబ్ కొత్తగా తెచ్చిన రూల్స్‌ని చాలా మంది ఇలాగే ఓకే చేశారు. ఇప్పుడా రూల్స్ షాక్ ఇచ్చేలా ఉన్నాయా?
Youtube New Rules : ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల మందికి పైగా యూజర్లను కలిగివున్న సంస్థ యూట్యూబ్. క్షణక్షణానికీ కొన్ని వేల వీడియోలు యూట్యూబ్‌లో అప్లోడ్ అవుతూ ఉంటాయి. ఐతే... ఈ వీడియోల్లో చాలావాటికి... యాడ్ రెవెన్యూ రావట్లేదు. ఇలాంటి వీడియోల వల్ల యూట్యూబ్ సర్వర్లకు అనవసరంగా స్పేస్ వేస్టవుతోంది. అందుకే యూట్యూబ్ యాజమాన్యం కొత్త రూల్స్ తెచ్చింది. వాటిని ఇప్పటికే 90 శాతం కంటెంట్ క్రియేటర్లు ఓకే చేశారు కూడా. ఐతే... ఇలా ఓకే చేసిన వారిలో చాలా మందికి అసలు యూట్యూబ్ తెచ్చిన కొత్త రూల్స్ ఏంటి? కొత్త కండీషన్లేంటి? అన్నది పూర్తిగా తెలియదు. ఆ కండీషన్లను చదివే ఓపిక లేక... ఓకే చేసేసినవాళ్లే ఎక్కువ. బట్... వాటిని చదివిన వాళ్లు అసలు విషయం తెలిసి షాకవుతున్నారు.
సింపుల్‌గా చెప్పాలంటే యూట్యూబ్ తెచ్చిన కొత్త రూల్స్... కంటెంట్ క్రియేటర్లకు షాక్ ఇస్తున్నాయిు. ఇకపై యూట్యూబ్‌లో క్రియేటర్లు అప్లోడ్ చేసే వీడియోలకు... యాడ్ రెవెన్యూ సరిగా రాకపోయినా లేక రెవెన్యూ తక్కువగా వస్తున్నా... ఇక ఆ క్రియేటర్ యూట్యూబ్ ఛానెల్‌ను యూట్యూబ్ యాజమాన్యం రద్దు చేస్తుంది. ఆ తర్వాత ఇక ఆ వీడియోలు గూగుల్ సర్వీసుల్లో కనిపించవు. ఆ క్రియేటర్... జీమెయిల్, గూగుల్ డాక్స్, గూగుల్ ఫొటోలు వంటి సేవలు కూడా వాడుకోకుండా చేస్తుంది. ఎంత రెవెన్యూ వస్తుంది, ఎంత రావాలి అన్నదాన్ని నిర్ణయించేది యూట్యూబ్ యాజమాన్యమే.
ఈ జాగ్రత్తలు పాటించండి :
- ఇకపై వీడియోలు అప్లోడ్ చేసే క్రియేటర్లు... క్వాలిటీ వీడియోలను మాత్రమే అప్లోడ్ చేయడం బెటర్.
- అప్లోడ్ చేసే వీడియో... ఎక్కువ మంది చూడదగ్గదిగా ఉండాలి. అప్పుడు దానికి యాడ్ రెవెన్యూ కూడా ఎక్కువ ఉంటుంది.
- ఏ వీడియో అయినా కనీసం 10వేల మంది చూస్తే... అలాంటి వీడియోలకు యూట్యూబ్ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది.
- కనీసం వారానికి ఒక వీడియో అయినా అప్లోడ్ చేస్తే... అకౌంట్ యాక్టివ్‌గా ఉన్నట్లు యూట్యూబ్ యాజమాన్యం భావిస్తుంది.
ఈ కొత్త రూల్స్ వెబ్సైట్లకు కూడా వర్తిస్తాయి. వెబ్సైట్లలో గూగుల్ యాడ్స్ ఉంచుతుంది. ఈ యాడ్లను ప్రజలు పెద్దగా క్లిక్ చెయ్యకపోతే... వెబ్‌సైట్‌కి యాడ్ రెవెన్యూ ఎక్కువగా రాదు. అలాంటి వెబ్సైట్లకు యాడ్లను గూగుల్ ఇకపై తొలగిస్తుంది. అంతేకాదు... ఆ వ్యక్తికి చెందిన జీమెయిల్, ఇతర సర్వీసుల్ని రద్దు చేస్తుంది. ఇది వెబ్సైట్ల నిర్వాహకులకు ఇబ్బంది కలిగించే అంశమే.
కొత్త రూల్స్ డిసెంబర్ 10, 2019 నుంచీ అమల్లోకి రానున్నాయి. యూట్యూబ్ నిర్ణయంపై విమర్శలు వస్తున్నాయి. చిన్న క్రియేటర్లకు ఇబ్బంది కలిగిస్తూ... పెద్ద క్రియేటర్లకు ఫేవర్ చేస్తున్నారని చాలా మంది అంటున్నారు. దీనిపై చాలా మంది ట్విట్టర్, రెడ్డిట్‌లో తమ అభ్యంతరాల్ని తెలుపుతున్నారు. యూట్యూబ్ యాజమాన్యం మాత్రం... కొత్త రూల్స్ వల్ల యూట్యూబ్ మరింత ఎక్కువ మందికి చేరువవుతుందనీ, కంటెంట్ క్రియేటర్లకు అది మేలు చేస్తుందని అంటోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.