యూట్యూబ్.. షాకింగ్ నిర్ణయం తీసుకొంది. యూట్యూబ్(You Tube) ప్లాట్ ఫాం నుంచి సుమారు పది లక్షల వీడియోలను తొలగించింది. ఈ విషయాన్ని సంస్థ ప్రకటించింది. ఈ తొలగింపునకు కారణం కూడా వివరించింది. ప్రస్తుతం ప్రపంచమంతా కరోనా(Corona) మహమ్మారితో పోరాడుతోంది. చాలా మంది కరోనాకు సంబంధించిన సమాచారం కోనం యూట్యూబ్‌ని ఆశ్రయిస్తున్నారు. కరోనా సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వ్యాక్సినేషన్(Vaccination), కరోనా లక్షణాలు.. ఇలా కరోనాకు సంబంధించిన చాలా వీడియోలు(Videos) యూట్యూబ్‌లో అందుబాటులో ఉన్నాయి. కానీ.. అందులో కొన్ని వీడియోలు తప్పుడు సమాచారాన్ని అందిస్తున్నట్టు యూట్యూబ్ గుర్తించింది. దీనిద్వారా ప్రజలు ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో యూట్యూబ్ ఈ నిర్ణయం తీసుకొంది. కరోనా వ్యాప్తి మొదలైన సమయం ఫిబ్రవరి 2020 నుంచి ఇప్పటి వరకు కోవిడ్ 19(Covid19) మీద అప్‌లోడ్ అయిన వీడియోల్లో తప్పుడు సమాచారం ఉన్న 1 మిలియన్ వీడియోలను గుర్తించి యూట్యూబ్ తొలగించింది.
యూట్యూబ్ వినియోగదారులకు సరైన సమాచారం అందించాలన్న నిర్ణయంతో ప్రతీ మూడు నెలలకు మిలియన్ సంఖ్యలో వీడియోలను తొలగిస్తుంది. తప్పుడు సమాచారం, వ్యూస్ లేనివి, యూట్యూబ్ రూల్స్‌ను అతిక్రమించిన వీడియోలు ప్రతీ మూడు నెలలకు కోటి వీడియోలను వరకు డిలీట్ చేస్తుంది. ఈ సారి మాత్రం కేవలం కరోనాకు సంబంధించిన తప్పుడు సమాచారం ఉన్న 10 లక్షల వీడియోలను యూట్యూబ్ డిలీట్ చేసినట్టు యూట్యూబ్ చీఫ్ ప్రాడక్ట్ ఆఫీసర్ నెల్ మోహన్ వెల్లడించారు. యూట్యూబ్‌లో తప్పుడు సమాచారం.. చెడు సమాచారం ఉన్న వీడియోల నిష్పత్తి (Percentage) చాలా తక్కువగా ఉంటాయి. మొత్తం యూట్యూబ్ వీక్షణలో 16శాతం నుంచి 18శాతం యూట్యూబ్ నియమ నిబంధనలు(You Tube Rules) అతిక్రమించి ఉంటాయని వీటిని ఎప్పటికప్పుడు తొలగిస్తామని యూట్యూబ్ చీఫ్ ప్రాడక్ట్ ఆఫీసర్ నెల్ మోహన్ అన్నారు. ప్రజలకు సరైన సమాచారం అందించడం మా లక్ష్యమని ఆయన అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Youtube