YOUTUBE NOW ALLOWS YOU CHANGE YOUR CHANNEL NAME WITHOUT CHANGING YOUR GOOGLE ACCOUNT SU GH
YouTube Channel: గూగుల్ అకౌంట్‌తో సంబంధం లేకుండా మీ యూట్యూబ్ ఛానల్ పేరు మార్చుకోవచ్చు.. ఎలాగంటే...
ప్రతీకాత్మక చిత్రం
గూగుల్ అకౌంట్‌పై ఎలాంటి ప్రభావం పడకుండా యూట్యూబ్ ఛానల్ పేరు, ప్రొఫైల్ పిక్చర్‌ను మార్చుకునే అవకాశాన్ని కల్పించింది యూట్యూబ్ సంస్థ. అదేలాగో ఇక్కడ తెలుసుకోండి..
గూగుల్ అకౌంట్‌పై ఎలాంటి ప్రభావం పడకుండా యూట్యూబ్ ఛానల్ పేరు, ప్రొఫైల్ పిక్చర్‌ను మార్చుకునే అవకాశాన్ని కల్పించింది యూట్యూబ్. ఇప్పుడు యూజర్లు గూగుల్ అకౌంట్, యూట్యూబ్ అకౌంట్లకు ప్రత్యేకంగా పేరు, ప్రొఫైల్ పిక్చర్లను పెట్టుకోవచ్చు. ఇంతకు ముందు యూట్యూబ్ అకౌంట్లో పేరు, ప్రొఫైల్ పిక్చర్‌ను మార్చుకుంటే.. గూగుల్ అకౌంట్లోనూ ఆ మార్పులు కనిపించేవి. కానీ ఇప్పుడు గూగుల్ అకౌంట్‌పై ఎలాంటి ప్రభావం పడకుండా యూట్యూబ్‌లోనే పేరు, ప్రొఫైల్ పిక్చర్లను మార్చుకోవచ్చు. జీమెయిల్, యూట్యూబ్, ఇతర సేవల కోసం ఒకే గూగుల్ అకౌంట్‌ను వాడేవారికి ఈ అప్డేట్ ఉపయోగపడనుంది. ఇప్పటి వరకు ఛానల్ పేర్లతో ఇబ్బందులు ఎదుర్కొనేవారు ప్రత్యేకంగా మరో గూగుల్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సి వచ్చేది. దాని సాయంతోనే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకునేవారు. ఇప్పుడు ఈ అప్డేట్ ఇలాంటి సమస్యలు ఉండవు.
ఇప్పటి వరకు గూగుల్ అకౌంట్ వివరాలతో యూట్యూబ్ అకౌంట్ క్రియేట్ చేసుకునేవారు.. ఛానెల్ పేరుతో సమస్యలు ఎదుర్కొనేవారు. దీనిపై చాలామంది యూజర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా తాజా మార్పులు చేస్తున్నట్టు సంస్థ ప్రకటించింది. పర్సనల్ యూట్యూబర్లు, బ్రాండ్ అకౌంట్లు ఉన్నవారు ఇప్పుడు వారి ఛానల్ పేర్లను సులభంగా మార్చుకోవచ్చు. యూట్యూబ్ ఇప్పటికే ఈ కొత్త ఫీచర్‌ను అప్డేట్ ద్వారా విడుదల చేసింది.
* వారికి ఇబ్బందులు
ఈ అప్డేట్లో యూట్యూబ్ వెరిఫికేషన్ బ్యాడ్జ్ ఉన్నవారికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. వీరు యూట్యూబ్ ఛానల్ పేరు మార్చుకుంటే, ఇప్పటికే ఉన్న వెరిఫికేషన్ బ్యాడ్జ్ కోల్పోవాల్సి ఉంటుంది. ఈ అప్డేట్ తర్వాత ఛానల్ పేరును మార్చుకుంటే బ్యాడ్జి కోసం మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో ఇలాంటి యూట్యూబ్ యూజర్లు కొత్త అప్డేట్పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వెరిఫికేషన్ బ్యాడ్జ్ లేనివారు, కొత్తగా యూట్యూబ్ ఛానల్‌ను క్రియేట్ చేసుకోవాలనుకునే వారికి ఈ మార్పువల్ల ఎలాంటి ఇబ్బందీ ఉండదు.
* యూట్యూబ్ ఛానల్ పేరును ఎలా మార్చాలి?
ముందు యూజర్లు డెస్క్టాప్పై యూట్యూబ్ స్టూడియోను ఓపెన్ చేయాలి. ఇక్కడ కనిపిపంచే మెను బార్ నుంచి కిందకు వెళ్లాలి. ఆ తరువాత ఆప్షన్లలో కనిపించే కస్టమైజేషన్‌ను సెలెక్ట్ చేస్తే ఇతర వివరాలు కనిపిస్తాయి. దీంట్లో బెసిక్ ఇన్ఫోను సెలెక్ట్ చేసి, ఛానల్ పేరు మార్చుకోవడానికి పెన్సిల్ గుర్తుపైన క్లిక్ చేయాలి. మొబైల్లో ఈ మార్పులు సులభంగా చేసుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్‌లో యూట్యూబ్ ప్రొఫైల్ పిక్చర్ పైన ట్యాప్ చేయాలి. తరువాత డిస్ప్లే అయ్యే ఆప్షన్ల జాబితాలో ‘యువర్ ఛానల్’పైన ట్యాప్ చేయాలి. అనంతరం ఎడిట్ ఛానల్ ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మీ ఛానల్ పేరును మార్చుకోవడానికి పెన్సిల్ ఐకాన్‌పైన ట్యాప్ చేయాలి. ఇక్కడ పేరు మార్చుకున్న తరువాత మార్పులు డిస్ప్లే అవుతాయి.
Published by:Sumanth Kanukula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.