హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

YouTube: అదిరిపోయే ఫీచర్‌ను పరిచయం చేసిన యూట్యూబ్.. మొబైల్ యూజర్స్‌కు స్పెషల్.. పూర్తి వివరాలు ఇవే..

YouTube: అదిరిపోయే ఫీచర్‌ను పరిచయం చేసిన యూట్యూబ్.. మొబైల్ యూజర్స్‌కు స్పెషల్.. పూర్తి వివరాలు ఇవే..

ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ యూట్యూబ్‌ తమ యూజర్ల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తోంది.

ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ యూట్యూబ్‌ తమ యూజర్ల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తోంది.

ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ యూట్యూబ్‌ తమ యూజర్ల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తోంది.

  ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ యూట్యూబ్‌(Youtube) తమ యూజర్ల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తోంది. గత కొద్ది నెలల్లోనే అద్భుతమైన ఫీచర్లను పరిచయం చేసి యూజర్లను బాగా ఆకట్టుకుంది. తాజాగా 'ట్రాన్స్‌లేట్‌'(Translate) అనే అద్భుతమైన ఫీచర్ ను ఆండ్రాయిడ్, ఐఓఎస్ మొబైల్ యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ఉపయోగించి ఇతర భాషల్లో ఉన్న యూట్యూబ్ కామెంట్లను ట్రాన్స్‌లేట్‌ చేసుకోవచ్చు. ఈ 'ట్రాన్స్‌లేట్‌' బటన్ పై క్లిక్ చేసి వందకు పైగా భాషలలో ఉన్న కామెంట్లను అనువాదం చేసి ఈజీగా చదవచ్చు. స్పానిష్, పోర్చుగీస్, ఫ్రెంచ్, బాహాసా, జపనీస్, ఉర్దూ, ఇలా చెప్పుకుంటూ పోతే వందకు పైగా భాషలను అనువదించేందుకు వీలుగా 'ట్రాన్స్‌లేట్‌' ఫీచర్ ను యూట్యూబ్ పరిచయం చేయడం విశేషం. ఈ విషయాన్ని యూట్యూబ్ ట్విట్టర్ వేదికగా ప్రకటించింది.

  ట్రాన్స్‌లేషన్‌ చేసేందుకు వీలుగా ప్రతి యూట్యూబ్ వీడియో (Youtube Video) కామెంట్ కింద ట్రాన్స్‌లేట్ బటన్‌ను సంస్థ అందిస్తోంది. దాంతో కామెంట్స్ లోని టెక్స్ట్ ని క్షణాల్లోనే ట్రాన్స్‌లేట్ చేసి మళ్లీ ఒరిజినల్ టెక్స్ట్ ని కూడా చూసుకోవచ్చు. ట్రాన్స్‌లేట్‌ ఫీచర్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ మొబైల్ యూజర్ల యూట్యూబ్ అప్లికేషన్లలో( Youtube Applications) అందుబాటులో వచ్చిందని యూట్యూబ్ పేర్కొంది.

  ఆస్పత్రికి వచ్చిన అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు.. పక్కా ప్లాన్‌తోనే ఇలా చేశారు.. అసలేం జరిగిందంటే..


  ఈ ఫీచర్ ని యూజ్ చేయాలనుకున్నవారు యూట్యూబ్ వీడియో కింద పోస్ట్ చేసిన కామెంట్లను ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ప్రతి కామెంట్ కింద "ట్రాన్స్‌లేట్ టు తెలుగు/ ఇంగ్లీష్/ మీ మాతృభాష" అని కనిపిస్తుంది. ఒకవేళ కామెంట్స్ మీ ప్రాంతీయ భాషలో లేకపోతే వాటన్నిటినీ ట్రాన్స్‌లేట్ చేసుకోవచ్చు. మీరు సెలెక్ట్ చేసుకున్న మాతృభాష ప్రకారం యూట్యూబ్ కామెంట్లు ట్రాన్స్‌లేట్ అవుతాయి. లైక్, డిస్లైక్, రిప్లై ఆప్షన్స్ కింద ట్రాన్స్‌లేట్ బటన్ కనిపిస్తుంది.

  సాధారణంగా ఏదైనా ఇతర భాషా(Language) వీడియో చూస్తున్నప్పుడు దాని కింద కామెంట్లు చదివే అలవాటు చాలామందికి ఉంటుంది. కానీ అవి వేరే భాషలో ఉంటే అర్థం చేసుకోవడానికి కష్టమైపోతుంది. అయితే ఇకపై ట్రాన్స్‌లేట్ బటన్.. యూట్యూబ్ కామెంట్లను అర్థం చేసుకునేందుకు తక్షణమే అనువదిస్తుంది. ఈ ఫీరురే తో ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరి భావాలను అర్థం చేసుకొని వారితో సంభాషించడం సాధ్యపడుతుంది. యూట్యూబ్ యాప్ స్పానిష్, పోర్చుగీస్, డ్యూచ్, ఫ్రెంచ్, బాహాసా, మరిన్ని భాషలతో సహా 100 కి పైగా భాషల ట్రాన్స్‌లేషన్ కు సపోర్ట్ చేస్తుంది. అయితే కామెంట్లను అనువదించాలనుకున్న ప్రతిసారి బటన్ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది.

  Sad: పరుగెత్తుకుంటూ వచ్చి ఆగి ఉన్న కారును ఢీకొట్టాడు.. సీసీటీవీలో దృశ్యాలు.. అసలేం జరిగిందంటే..


  ఇక ప్రపంచవ్యాప్తంగా తమ సేవలను విస్తరించేందుకు యూట్యూబ్ ఇటీవల 'వీడియో సబ్ టైటిల్స్ ఆటోమేటిక్ ట్రాన్స్‌లేషన్'‌ ప్రవేశపెట్టడానికి రెడీ అయిందని వార్తలు వచ్చాయి. యూట్యూబ్ ఇప్పటికే వీడియో టైటిల్స్ తో పాటు డిస్క్రిప్షన్ ను అనువదిస్తూ కంటెంట్ డిస్కవరీని మరింత సులభతరం చేస్తుంది. ఒకవేళ మీ యూట్యూబ్ యాప్ లో 'ట్రాన్స్‌లేట్ బటన్'(Translate Button) కనిపించకపోతే అప్డేట్ చేసుకోండి.

  First published:

  Tags: Latest Technology, Youtube

  ఉత్తమ కథలు