YOUTUBE MUSIC YOUTUBE PREMIUM GO LIVE FOR CONSUMERS IN INDIA KNOW FEATURES AND PLANS SS
YouTube Music: మ్యూజిక్ లవర్స్‌కు గుడ్ న్యూస్... యూట్యూబ్ మ్యూజిక్ వచ్చేసింది
YouTube Music: మ్యూజిక్ లవర్స్‌కు గుడ్ న్యూస్... యూట్యూబ్ మ్యూజిక్ వచ్చేసింది( Image: Tech2)
YouTube Music, YouTube Premium | ఒకవేళ మీరు యూట్యూబ్ మ్యూజిక్ ప్రీమియం తీసుకుంటే యాడ్స్ ఉండవు. ఇతర దేశాలతో పోలిస్తే ప్రీమియం ధరలు కాస్త తక్కువగానే ఉన్నాయి. కాంప్లిమెంటరీగా యూట్యూబ్ ప్రీమియం మూడు నెలలపాటు ఉచితంగా లభిస్తుంది.
సంగీతప్రియులకు ఇది మరో శుభవార్త. కొద్ది రోజుల క్రితమే ఇండియాలో స్పాటిఫై రిలీజైతే... ఇప్పుడు యూట్యూబ్ మ్యూజిక్, యూట్యూబ్ ప్రీమియం ఇండియాలో రిలీజయ్యాయి. ఇప్పటికే గూగుల్ నుంచి గూగుల్ ప్లే మ్యూజిక్, గూగుల్ ప్లే మూవీస్ ఉన్నాయి. ఇప్పుడు గూగుల్ నడిపించే యూట్యూబ్‌కు చెందిన మరో రెండు సర్వీసులు చేరాయి. యూట్యూబ్ మ్యూజిక్ యాప్‌ను ఎవరైనా ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. కాకపోతే యాడ్స్ ఉంటాయి. ఒకవేళ మీరు యూట్యూబ్ మ్యూజిక్ ప్రీమియం తీసుకుంటే యాడ్స్ ఉండవు. ఇతర దేశాలతో పోలిస్తే ప్రీమియం ధరలు కాస్త తక్కువగానే ఉన్నాయి. కాంప్లిమెంటరీగా యూట్యూబ్ ప్రీమియం మూడు నెలలపాటు ఉచితంగా లభిస్తుంది. ఒకవేళ మీరు సాంసంగ్ గెలాక్సీ ఎస్10 కొంటే యూట్యూబ్ ప్రీమియం, యూట్యూబ్ మ్యూజిక్ ప్రీమియం లేదా గూగుల్ ప్లే మ్యూజిక్ సబ్‌స్క్రైబ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నాలుగు నెలల పాటు యూట్యూబ్ ప్రీమియం వాడుకోవచ్చు.
యూట్యూబ్ మ్యూజిక్‌లో పెద్ద మ్యూజిక్ లైబ్రరీ ఉంది. ప్రీమియం వర్షన్లో యాడ్స్ లేకుండా పాటలు వినొచ్చు. అయితే ఇప్పటికే ఇండియాలో మ్యూజిక్ స్ట్రీమింగ్ ఇచ్చే ప్లాట్‌ఫామ్స్ చాలా ఉన్నాయి. యూట్యూబ్‌కు ఇండియాలో అతిపెద్ద యూజర్ బేస్ ఉంది కాబట్టి యూట్యూబ్ మ్యూజిక్ ఎంత ఆకట్టుకుంటుందో చూడాలి. ఇక యూట్యూబ్ ప్రీమియం ద్వారా యూట్యూబ్ ఒరిజినల్స్ యాక్సెస్ చేయడంతో పాటు ఆఫ్‌లైన్ డౌన్లోడ్స్ చేయొచ్చు. అయితే యూట్యూబ్ ప్రీమియం తీసుకున్నవారికి యూట్యూబ్ మ్యూజిక్ కూడా లభిస్తుంది.
Photos: ఈ 50 లగ్జరీ కార్లు చూస్తే కళ్లు చెదిరిపోవాల్సిందే...
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.