హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

YouTube Music: ఆడియో-ఓన్లీ ప్లాట్‌ఫాంగా మారనున్న యూట్యూబ్ మ్యూజిక్.. వీడియోలు చూడాలంటే...

YouTube Music: ఆడియో-ఓన్లీ ప్లాట్‌ఫాంగా మారనున్న యూట్యూబ్ మ్యూజిక్.. వీడియోలు చూడాలంటే...

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

సంగీత ప్రియుల కోసం యూట్యూబ్ ప్రత్యేకంగా ‘యూట్యూబ్ మ్యూజిక్’ (YouTube Music) పేరుతో ఓ యాప్‌ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ మ్యూజిక్ యాప్‌లో ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్ తీసుకురావడంతో పాటు పలు మార్పులు చేస్తోంది.

సంగీత ప్రియుల కోసం యూట్యూబ్ ప్రత్యేకంగా ‘యూట్యూబ్ మ్యూజిక్’ (YouTube Music) పేరుతో ఓ యాప్‌ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ మ్యూజిక్ యాప్‌లో ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్ తీసుకురావడంతో పాటు పలు మార్పులు చేస్తోంది. ఇటీవల యాప్ సబ్‌స్క్రైబర్లతో పాటు ఫ్రీ- యూజర్లకు కూడా ఉచితంగా బ్యాక్‌గ్రౌండ్ ప్లే ఫీచర్ అందుబాటులోకి తెస్తామని సంస్థ ప్రకటించింది. అప్పుడు యూజర్లకు గుడ్‌న్యూస్‌ చెప్పిన యూట్యూబ్.. ఇప్పుడు ఓ బ్యాడ్‌న్యూస్‌ చెప్పింది. ఉచితంగా పాటలు వినే యూజర్లకు యూట్యూబ్ మ్యూజిక్ ఆడియో-ఓన్లీ (Audio-only)గా మారనుందని.. వారికి ఇకపై వీడియోలు ప్లే చేసే సదుపాయం ఉండదని యూట్యూబ్ వెల్లడించింది.

ఆడియో ఓన్లీ (audio only) మార్పును నవంబర్ 3 నుంచి కెనడా యూజర్లకు అందుబాటులోకి తెస్తామని యూట్యూబ్ పేర్కొంది. ఆ తర్వాత అన్ని దేశాలకు విస్తరించే అవకాశం ఉంది. ఈ మార్పుతో యూట్యూబ్ మ్యూజిక్ యాప్‌లో ఉచిత యూజర్లు వీడియోలను ప్లే చేయలేరు. అయితే సబ్‌స్క్రైబర్లు మాత్రం వీడియోలను ప్లే చేయగలరు. ప్రస్తుతానికైతే యూట్యూబ్ ప్రీమియం ప్యాక్ కు ఎలాంటి అప్‌డేట్‌లు ప్రకటించలేదు.

ఇది కూడా చదవండి: Nokia C30: భారత మార్కెట్​లోకి నోకియా సి 30 స్మార్ట్‌ఫోన్‌ లాంచ్​.. జియో ఎక్స్​క్లూజివ్​ ఆఫర్​తో రూ.10 వేలలోపే లభ్యం

యూట్యూబ్ మ్యూజిక్ యూజర్లు వీడియోలు ప్లే చేయాలంటే సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుందని తన కమ్యూనిటీ ఫోరమ్‌లలో ఓ పోస్ట్ ద్వారా యూట్యూబ్ వెల్లడించింది. 'యూట్యూబ్ మ్యూజిక్‌లో వీడియోలు ప్రీమియం సబ్‌స్క్రైబర్‌లకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఎందుకంటే పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ తీసుకునేంతవరకు ఉచిత యూజర్లు వీడియోలను చూడలేరు' అని యూట్యూబ్ వెల్లడించింది. అంతేకాదు, యూట్యూబ్ మ్యూజిక్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ తీసుకోని యూజర్లు ఆన్-డిమాండ్ మ్యూజిక్ సెలక్షన్, అపరిమిత స్కిప్‌లతో సహా పలు ఫీచర్లను యాక్సెస్ చేయలేరని యూట్యూబ్ పేర్కొంది.

ఇది కూడా చదవండి: Realme: రియల్​మీ నుంచి కొత్తగా రెండు మిడ్​రేంజ్​ స్మార్ట్​ఫోన్లు లాంచ్​.. ధర, ఫీచర్ల వివరాలివే!

అయితే యూట్యూబ్ మ్యూజిక్ ఉచిత యూజర్లు వర్కౌట్, ట్రావెల్, తదితర పనులు చేస్తున్న సమయంలో డెడికేటెడ్ మూడ్ మిక్స్‌లను మాత్రం యాక్సెస్ చేయవచ్చు. అలాగే మిలియన్ల కొద్దీ పాటలు, వేలాది ప్లేలిస్టులను యాక్సెస్ చేయొచ్చు కానీ మధ్యలో యాడ్స్ చూడాల్సి ఉంటుంది. యూట్యూబ్ మ్యూజిక్ యాప్‌లో పాటలను అప్‌లోడ్ చేసిన ఉచిత యూజర్లు వాటిని ఆన్-డిమాండ్‌లో ప్లే చేయడానికి వీలు ఉంటుందని కమ్యూనిటీ ఫోరమ్‌ల పోస్ట్‌లో యూట్యూబ్ పేర్కొంది.

First published:

Tags: Music, Technology, Trending videos, Youtube

ఉత్తమ కథలు