వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ (YouTube), మ్యూజిక్ లవర్స్ కోసం డెడికేటెడ్ మ్యూజిక్ యాప్ యూట్యూబ్ మ్యూజిక్ (YouTube Music)ను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ మ్యూజిక్ స్ట్రీమింగ్ యాప్‌లో యూట్యూబ్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను లాంచ్ చేస్తోంది. ముఖ్యంగా ప్రీమియం యూజర్ల (Premium Users) కోసం అదిరిపోయే ఫీచర్లను పరిచయం చేస్తోంది. తాజాగా యూట్యూబ్ మ్యూజిక్‌లో రీసెంట్‌గా ప్లే చేసిన పాటలను డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయాన్ని అందజేసింది. ఇప్పుడు ఆండ్రాయిడ్ ప్రీమియం యూజర్లు మ్యూజిక్ యాప్ సెట్టింగ్స్‌లో “రీసెంట్లీ ప్లేయిడ్ సాంగ్స్ (Recently Played Songs)" అనే కొత్త ఆప్షన్ యాక్సెస్ చేయవచ్చు. ఈ ఆప్షన్ టోగుల్‌ను ఆన్ చేసి, రీసెంట్‌గా ప్లే చేసిన 200 పాటల వరకు ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
యూట్యూబ్ మ్యూజిక్ ఆండ్రాయిడ్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ఉన్నవారు సెట్టింగ్స్> డౌన్‌లోడ్స్ & స్టోరేజ్‌లో కొత్తగా “రీసెంట్లీ ప్లేయిడ్ సాంగ్స్” టోగుల్‌ని చూడవచ్చు. "స్మార్ట్ డౌన్‌లోడ్స్" ఫీచర్‌కి, కొత్తగా వచ్చిన ఫీచర్‌కి ఎలాంటి సంబంధం ఉండదు. కొత్తగా రిలీజ్ అయిన ఫీచర్ సపరేట్‌గా ఉంటుంది. దీన్ని జనవరిలోనే లాంచ్ చేశామని, అయితే ఇప్పుడు మాత్రమే ఆండ్రాయిడ్‌లో విస్తృతంగా అందుబాటులోకి వస్తోందని కంపెనీ తెలిపింది.
ఈ ఫీచర్ మ్యూజిక్ యాప్‌లో విన్న 200 రీసెంట్ సాంగ్స్ వరకు ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్ చేస్తుంది. కానీ ఈ పాటలకు లైబ్రరీ ట్యాబ్‌లో ప్రత్యేకంగా ప్లేలిస్ట్ ఉండదు. దానికి బదులుగా, హోమ్ స్క్రీన్ ఐకాన్‌ను కాసేపు నొక్కి పట్టుకొని 'డౌన్‌లోడ్స్' యాప్ షార్ట్‌కట్ ఉపయోగించడం ద్వారా వాటిని కనుగొనవచ్చు.
ఇది కూడా చదవండి : తగ్గేదే లే.. ఆ రికార్డు బ్రేక్ చేయనున్న ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్
ఆ విధంగా యూట్యూబ్ మ్యూజిక్ ప్రీమియం మెంబర్లు ఇప్పుడు ఆఫ్‌లైన్‌లో లేదా వారి మొబైల్ డేటాను వాడకుండానే సాంగ్స్ వినొచ్చు. ఆండ్రాయిడ్ పెయిడ్ యూజర్లకు ఈ ఫీచర్ ఇప్పటికే అందుబాటులోకి రాగా iOS యూజర్స్ కోసం గూగుల్ ఇంకా దీనిని ప్రకటించలేదు. వీరి కోసం త్వరలోనే దీనిని తీసుకొచ్చే అవకాశముంది.
* మరిన్ని కొత్త ఫీచర్లు
ప్రస్తుతం YouTube Music మరిన్ని కొత్త ఫీచర్లను ఆకర్షణీయంగా మారుతోంది. ఇప్పుడు ఇందులోని Now Playing రిలేటెడ్ ట్యాబ్‌తో పాటు సెర్చ్ రిజల్ట్స్‌లో "అధర్ పర్ఫామెన్సెస్" క్రింద లైవ్, కవర్, రీమిక్స్ వంటి లేబుల్స్ వస్తున్నాయి. అలాగే, YouTube Musicలో మ్యూజిక్ వింటున్నప్పుడు యూజర్లకు పాట, ఆల్బమ్ క్రెడిట్స్ కనిపిస్తున్నాయి. అంటే యూజర్లు సింగర్ ఎవరో, పాటను రాసింది ఎవరు? అనే వివరాలు తెలుసుకోవచ్చు. ఓవర్‌ఫ్లో మెనూలో 'వ్యూ సాంగ్ క్రెడిట్స్' ఆప్షన్‌పై క్లిక్ చేసి, ఈ ఫీచర్‌ను ఉపయోగించవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Latest Technology, Music, Tech news, Youtube