స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికీ యూట్యూబ్ పరిచయమే. ఈ వీడియో స్ట్రీమింగ్ యాప్ ప్రపంచ వ్యాప్తంగా వినియోగంలో ఉంది. అయితే అధికారికంగా ఈ ప్లాట్‌ఫాం నుంచి వీడియోలను డౌన్‌లోడ్ చేసుకోలేం. యాప్‌లో యూట్యూబ్ వీడియోలను ఆఫ్‌లైన్‌లో చేసేందుకు.. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు డౌన్‌లోడ్ ఆప్షన్ అందుబాటులో ఉంది. కానీ డెస్క్‌టాప్ లేదా వెబ్ వెర్షన్‌లో మాత్రం ఈ సదుపాయం లేదు. త్వరలో వెబ్ వెర్షన్‌లో సైతం వీడియో డౌన్‌లోడింగ్ ఆప్షన్‌ను పరిచయం చేయనుంది యూట్యూబ్. ఈ ఫీచర్ ప్రీమియం మెంబర్స్‌కు మాత్రమే అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం ఈ ఆఫ్‌లైన్ డౌన్‌లోడింగ్ ఫీచర్‌ను సంస్థ పరీక్షిస్తోంది.
భారత్‌తో పాటు ఇతర దేశాల్లోని సెలక్టెడ్ యూట్యూబ్ మెంబర్స్‌కు ఈ ఫీచర్ వాడుకునే అవకాశం కల్పించనుంది. ఈ ఆప్షన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత క్రోమ్ బ్రౌజర్, ఒపేరా, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ లాంటి బ్రౌజర్లు డౌన్‌లోడ్లను నిరోధించలేవు. వీడియోను వీక్షిస్తున్నప్పుడు కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. షేర్ బటన్ పక్కన ఈ డౌన్‌లోడ్ ఆప్షన్ ఉంటుంది.
డౌన్‌లోడ్ కంప్లీట్ అయిన తర్వాత వినియోగదారులు లెఫ్ట్ సైడ్ ఉండే మెనూలోని 'వాచ్ లేటర్' ఐకాన్‌పై క్లిక్ చేసి ఆఫ్‌లైన్ వీడియోలు చూడవచ్చు. లేదా youtube.com/feed/downloads ద్వారా వీడియోను వీక్షించవచ్చు. ఫుల్ హెచ్‌డీ వీడియోలను డౌన్‌లోడ్ చేసుకునే సౌలభ్యాన్ని కూడా యూట్యూబ్ వినియోగదారులకు కల్పిస్తోంది. వీడియో క్వాలిటీ ఆధారంగా సైజు మారుతుంది. ఈ కొత్త ఫీచర్‌ను అక్టోబరు 19 వరకు టెస్టింగ్ చేస్తారు. త్వరలోనే అధికారికంగా దీన్ని లాంచ్ చేయనున్నారు.
Weight Loss: బరువు తగ్గించుకుంటున్నారా ? లేక కొవ్వు తగ్గించుకుంటున్నారా ?.. రెండింటి మధ్య తేడా ఇదే..
Revanth Reddy: రేవంత్ రెడ్డి ‘టీడీపీ’ విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారా ?
* ఐఓఎస్ వినియోగదారుల కోసం..
కొంతమంది ఐఓఎస్ వినియోగదారులు మినీ ప్లేయర్ లో యూట్యూబ్ వీడియోలను చూడటానికి పిక్చర్ ఇన్ పిక్చర్(పీఐపీ)ని కూడా ట్రై చేయవచ్చు. ఐఓఎస్ యూజర్లకు ట్రయల్ వెర్షన్ Youtube.com/new లో అక్టోబరు 31 వరకు అందుబాటులో ఉంటుంది. వీడియో చూస్తున్నప్పుడు యాప్ క్లోజ్ చేసి మినీ ప్లేయర్ లో చూడటానికి స్వైప్ చేయాలని కంపెనీ పేర్కొంది. పీఐపీలో వీడియో చూస్తున్నప్పుడు స్క్రీన్ లాక్ చేయడం వల్ల వీడియో పాజ్ అవుతుంది. లాక్ స్క్రీన్ మీడియా కంట్రోల్స్ ఉపయోగించి వీడియోను రెజ్యూమ్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్‌ను మొదటిసారి ప్రయత్నిస్తుంటే మొదటి గంట సరిగ్గా పనిచేయకపోవచ్చు. తర్వాత కూడా పీఐపీ సరిగ్గా పనిచేయకపోతే అన్ ఇన్ స్టాల్ చేసి, మళ్లీ ఇన్ స్టాల్ చేయండి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Youtube