news18-telugu
Updated: November 30, 2018, 2:45 PM IST
స్నాప్‌చాట్ లాంటి ఫీచర్ యూట్యూబ్‌లో...
ఏ యాప్ అయినా అప్డేట్ అవుతుంటేనే కొత్తదనం వస్తుంది. యూజర్లకు కొత్త ఎక్స్పీరియన్స్ లభిస్తుంది. అందుకే యాప్స్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకుంటాయి. ఇప్పుడు యూట్యూబ్ కూడా కొత్త ఫీచర్‌ను తీసుకొస్తోంది. స్నాప్‌చాట్ స్టోరీస్ లాంటి ఫీచర్‌ను మరికొంత మంది క్రియేటర్స్‌కు అందుబాటులోకి తీసుకురానుంది. వాస్తవానికి నవంబర్ 2017లోనే ఈ ఫీచర్‌ను తీసుకొచ్చింది. కాకపోతే అప్పుడు కొంతమందికి మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులో ఉండేది. ఇప్పుడు అందరికీ ఈ ఫీచర్ రిలీజ్ చేయాలని నిర్ణయించింది. అయితే 10,000 సబ్స్క్రైబర్స్ ఉన్న క్రియేటర్స్ మాత్రమే ఈ టూల్ ఉపయోగించుకోవచ్చు.
ఈ ఫీచర్‌ను స్నాప్‌చాట్ నుంచి కాపీ చేసినా కొన్ని మార్పులు చేసింది యూట్యూబ్. ఇన్స్టాగ్రామ్, స్నాప్‌చాట్‌లో స్టోరీస్ 24 గంటలు మాత్రమే ఉంటాయి. కానీ యూట్యూబ్‌లో 7 రోజుల పాటు ఉంటాయి. ఈ స్టోరీస్ సబ్స్క్రైబర్లతో పాటు నాన్-సబ్స్క్రైబర్లకు కూడా కనిపిస్తాయి. క్రియేటర్లతో పాటు వ్యూయర్ల మధ్య రియల్ టైమ్ ఇంటరాక్షన్ కోసం ఈ టూల్ ఉపయోగపడుతుంది.
ఇవి కూడా చదవండి:
వాట్సప్‌లో వెంటనే మార్చాల్సిన సెట్టింగ్స్ ఇవే...
వ్యాపారం చేస్తున్నారా..? మీ కోసమే ఈ టిప్స్...
రియల్మీ యూ1 లుక్ ఎలా ఉందో చూశారా?కత్తిలాంటి లగ్జరీ కార్లు అంటే ఇవే...
డబ్బు సంపాదించడానికి 6 సులభమైన మార్గాలు
వాట్సప్‌లో కొత్తగా మరో రెండు ఫీచర్లు
Published by:
Santhosh Kumar S
First published:
November 30, 2018, 1:34 PM IST