TikTokను ఢీ కొట్టేందుకు సిద్ధమవుతున్న Youtube...కొత్త వీడియో యాప్ సిద్ధం..

ఇందులో 15 సెకన్ల వీడియో పోస్ట్ చేసేందుకు వీలుగా యాప్ విడుదల చేయనుంది. ఫోన్ గ్యాలరీ నుండి నేరుగా అప్‌లోడ్ చేసే వీలుంది. టిక్‌టాక్ మాదిరిగా ఫిల్టర్లు, మ్యూజిక్ సపోర్ట్ ఉందా లేదా అనే దానిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

news18-telugu
Updated: June 28, 2020, 11:59 PM IST
TikTokను ఢీ కొట్టేందుకు సిద్ధమవుతున్న Youtube...కొత్త వీడియో యాప్ సిద్ధం..
Google (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
చైనా Tiktok యాప్ కు పోటీగా కొత్త ఫీచర్‌తో యూట్యూబ్ రాబోతోంది. టిక్‌టాక్‌ మాదిరిగానే సరికొత్త ఫీచర్‌ లాంచ్ చేయాలని యూట్యూబ్ సన్నాహాలు చేయనుంది. గూగుల్ ఇప్పటికే టిక్ టాక్ కు పోటీగా వీడియో ప్లాట్‌ఫాం ద్వారా కొత్త ఫీచర్‌ బీటా వర్షన్ విడుదలకు సిద్ధం చేస్తోంది. షార్ట్స్ పేరుతో టిక్‌టాక్‌ లాంటి యాప్‌ను యూట్యూబ్ త్వరలో తీసుకురానుంది. ఇప్పటికే ఈ ఫీచర్‌ను పరీక్షిస్తున్నట్లు యూట్యూబ్ ప్రకటించింది. తర్వాత దీన్ని భారీ ఎత్తున లాంచ్ చేయనున్నామని గూగుల్ తెలిపింది. అటు ఆండ్రాయిడ్, ఐవోఎస్ రెండింటిలోనూ దీన్ని ప్రయోగాత్మకంగా పరీక్షించనుంది. ఇందులో 15 సెకన్ల వీడియో పోస్ట్ చేసేందుకు వీలుగా యాప్ విడుదల చేయనుంది. ఫోన్ గ్యాలరీ నుండి నేరుగా అప్‌లోడ్ చేసే వీలుంది. టిక్‌టాక్ మాదిరిగా ఫిల్టర్లు, మ్యూజిక్ సపోర్ట్ ఉందా లేదా అనే దానిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

టిక్‌టాక్ తో పాటు ప్రస్తుతం ఏఆర్ ఎడిటింగ్ ఎఫెక్టులతో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఫేస్ బుక్ కూడా టిక్ టాక్ మాదిరిగానే లాస్సో అనే యాప్‌ను తీసుకురానుందని తెలుస్తోంది.
First published: June 28, 2020, 11:59 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading